లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా.. | Rape Survivor Set On Fire On Way To Court | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..

Published Thu, Dec 5 2019 11:01 AM | Last Updated on Thu, Dec 5 2019 2:21 PM

Rape Survivor Set On Fire On Way To Court - Sakshi

లక్నో : లైంగిక దాడికి గురైన యువతి కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు వెళుతున్న క్రమంలో గ్రామ శివార్లలో ఆమెకు నిప్పంటించిన ఘటన ఉన్నావ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతికి 60 నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయని, తదుపరి చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.ఈ ఏడాది మార్చిలో తన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని 23 సంవత్సరాల బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇక మహిళకు నిప్పంటించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు.  కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని , మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఉన్నావ్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి విక్రాంత్‌ విర్‌ తెలిపారు.

ఉన్నావ్‌లో తనపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాన్ని వీడియో తీశారని ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేయగా అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. మరో నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్‌ చేయకపోవడం గమనార్హం. నిందితుడి ఆస్తులను అటాచ్‌ చేసి ఆయనపై లుక్‌అవుట్‌ నోటీస్‌ జారీ చేశామని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని కాపాడటమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని, ప్రధాన నిందితుడు శివం త్రివేదీ ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement