లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తరుణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ హోమంత్రి రాంనివాస్ రావత్ బీజేపీలో చేరడం చర్చాంశనీయంగా మారింది.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు వెయ్యి మంది మద్దతుదారులతో బీజేపీలో చేరారు.
సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. రావత్ విజయపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో ఒకరు.
బీజేపీలోకి కమల్ నాథ్ సన్నిహితుడు
కాగా,ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడు, అమర్‌వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారు
నామినేషన్ ఉపసంహరణ.. ఆపై బీజేపీలోకి జంప్
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 29న ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కాగా, బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ నేత అక్షయ్ కాంతి బామ్‌ను రంగంలోకి దించింది. అనూహ్యంత్ అక్షయ్ కాంతి బామ్ బీజేపీ చెంతకు చేరడం మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment