'నా కొడుకు రాహుల్‌ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ | Sonia Gandhi In Rae Bareli Rally | Sakshi
Sakshi News home page

'నా కొడుకు రాహుల్‌ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ

Published Fri, May 17 2024 6:52 PM | Last Updated on Fri, May 17 2024 7:09 PM

Sonia Gandhi In Rae Bareli Rally

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార హోరు జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు సైతం క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ అధినేత్రి 'సోనియా గాంధీ' శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీకి తన (సోనియా గాంధీ) పట్ల చూపిన అదే ప్రేమ, ఆప్యాయతలను అందించాలని సోనియా గాంధీ ప్రజలను కోరారు. ''నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను మీవారిలా భావించినట్లే, అతనికి కూడా అదే ప్రేమ, ఆప్యాయతని అందించండి''. రాహుల్ మిమ్మల్ని మీరసపరిచేది లేదని అన్నారు.

తమ కుటుంబానికి ఎప్పుడూ మద్దతు ఇచ్చే రాయ్‌బరేలీ ఈ సారి కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా తాను లోక్‌సభ ఎన్నికలలో పాల్గొనడం లేదని సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈమె 2004 నుంచి రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది.

ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ ప్రజలకు 20 ఏళ్ల పాటు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించారు. అదే నాకు పెద్ద ఆస్తి. రాయ్‌బరేలీకి చెందిన నా కుటుంబ సభ్యులు, చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

రాయ్‌బరేలీ మాదిరిగానే.. అమేథీ కూడా నా ఇల్లు అని పేర్కొంటూ.. నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు, కుటుంబ మూలాలు ఈ మట్టితో ముడిపడి ఉన్నాయి. గంగామాత వలె పవిత్రమైన ఈ సంబంధం అవధ్ మరియు రాయ్‌బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమైంది, ఇది నేటికీ కొనసాగుతోందని సోనియా గాంధీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement