దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం.
కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్‌కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్‌లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్‌చార్జి జైరాం రమేష్‌తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment