
మైఖేల్ కోర్సలే, శ్రుతీహాసన్
గత నెలలో శ్రుతీహాసన్ పుట్టిన రోజుకు లండన్ నుంచి ప్రేమ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు శ్రుతీ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే. సోమవారం మైఖేల్ పుట్టినరోజు. ఈసారి ప్రేమ సందేశాలను లండన్ పంపడం శ్రుతీ వంతైంది. ‘‘మైఖేల్.. ఈ ఏడాది నువ్వు ఇంకా అద్భుతంగా మారతావని, కెరీర్ మరింత కాంతివంతంగా మారుతుందని ఆశిస్తున్నాను. వీటితోపాటు నీ హృదయం మరింత విశాలంగా మారుతుందని (ఒకవేళ అవకాశముంటే). హ్యాపీ బర్త్‌డే బెస్ట్ ఫ్రెండ్. మై మ్యాన్.. మిస్ అవుతున్నాను’’ అని రాసుకొచ్చారు శ్రుతీ. ప్రేమ పంచుకుంటున్న వీళ్లు జీవితాన్ని ఎప్పుడు పంచుకుంటారో అని శ్రుతీ ఫ్యాన్స్ వెయిటింగ్.
Comments
Please login to add a commentAdd a comment