Michael Corsale
-
మరో ప్రేమ కోసం..
చెన్నై,టీ.నగర్: మరో ప్రేమ కోసం అన్వేషిస్తున్నట్లు నటి శ్రుతిహాసన్ వెల్లడించారు. నటి శ్రుతిహాసన్ లండన్ బాయ్‌ఫ్రెండ్ మైకెల్ కోర్సెల్‌తో డేటింగ్ చేశారు. ఇరువురూ ప్రేమజంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ సంబంధాన్ని శ్రుతిహాసన్ హఠాత్తుగా బ్రేక్ అప్ చేశారు. డేటింగ్, ప్రేమంటూ ఏడాదికి పైగా కొత్త చిత్రాల్లో నటించని శ్రుతి ప్రస్తుతం నటించేందుకు అంగీకారం తెలుపుతోంది. ప్రస్తుతం విజయసేతుపతితో లాభం చిత్రంలో జంటగా నటిస్తున్నారు. హిందీ చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. ప్రియుడు మైకెల్‌తో బ్రేక్ అప్ అయిన విషయం గురించి మౌనం పాటిస్తూ వచ్చిన శ్రుతి బహిరంగంగా నోరు విప్పారు. ఆమె మాట్లాడుతూ మంచివారు కొన్ని సమయాల్లో మంచివారేనని, అదే వ్యక్తులు కొన్ని సమయాల్లో చెడ్డవారుగా మారుతారని తెలిపారు. ప్రేమ విఫలం కావడం గురించి తనకు ఎటువంటి బాధ లేదని, ఇది మొత్తానికి తనకు ఒక అనుభవంగా మిగిలిందన్నారు. ప్రేమకు ఇదే కండిషన్ అంటూ ఏమీ లేదని, ఈ ప్రేమ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. ఇది నేర్చుకోవడం ద్వారా తెలిసిందని, తదుపరి ప్రేమ కోసం వేచివున్నట్లు తెలిపారు. అది చక్కని ప్రేమగా మిగులుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అటువంటి ప్రేమ లభిస్తే దాని గురించి సంతోషంగా అందరితో పంచుకుంటానని తెలిపారు. -
బ్రేకప్‌పై స్పందించిన నటి
విశ్వ నటుడు కమల్ హాసన్ గారాల తనయ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పని లేదు. ప్రతిభ, అందం శ్రుతి సొంతం. 2009లో హిందీ సినిమా లక్‌తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రుతి ఆ తర్వాత తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్గా నిలిచారు. 2017లో వచ్చిన కాటమరాయుడు తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు శ్రుతి. ఆ సమయంలో ఇటాలియన్ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. లాస్ ఏంజెల్స్, చెన్నై, ముంబై వంటి చోట్ల పర్యటించారు. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కొద్ది సంవత్సరాల పాటు సాగిన వీరి బంధం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోకు హాజరయ్యారు శ్రుతి. ఈ సందర్భంగా మైఖేల్‌తో బ్రేక్ అప్, జీవితం గురించి తన అంచనాలు వంటి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు శ్రుతి హాసన్. మైఖేల్‌తో బంధం తనకో మంచి అనుభవాన్ని మిగిల్చిందన్నారు శ్రుతి. ‘నేను చాలా అమాయకంగా ఉంటాను. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బాస్‌లా ప్రవర్తిస్తారు. నాలో భావోద్వేగాలు అధికం. అందుకే నా చుట్టు ఉండే వారు నన్ను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. అయితే ఇవన్ని కూడా నాకు మంచి అనుభవాలనే మిగిల్చాయి’ అని తెలిపారు. అంతేకాక జీవితంలో సరైన వ్యక్తి కోసం తాను ఎదురు చూస్తున్నాను అన్నారు శ్రుతి. తను కోరుకున్న లక్షణాలు కల వ్యక్తి తారసపడితే.. వెంటనే అతడితో ప్రేమలో పడతానని.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తానని తెలిపారు శ్రుతి. అంతేకాక ప్రేమలో పడటానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవన్నారు శ్రుతి. ఒకానొక సమయంలో మంచిగా అనిపించిన ఓ వ్యక్తి అదే సమయంలో చెడ్డగా కనిపిస్తాడని తెలిపారు. ఇలాంటి విషయాల గురించి తాను బాధపడన్నారు. ఇవన్ని తనకు నేర్చుకునే అవకాశం కల్గించాయని.. తనకు మంచి అనుభవాలుగా మిగిలిపోతాయన్నారు. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న వీరు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడిపోయిన సంగతి తెలిసిందే. తమ బ్రేకప్ విషయాన్ని మైఖల్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. -
బ్రేకప్‌కి కారణం అదేనా?
‘‘జీవితం మనల్ని భూమి మీద చెరోవైపు ఉంచింది. అందుకే ఇకపై విడిగా నడవాలేమో?’’ అంటూ తమ బ్రేకప్ను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రెండు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తమ బంధానికి ఇరువురు ఇష్టప్రకారమే వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ బ్రేకప్‌కి కారణం ఇదే అంటూ తమిళనాడులో ఓ వార్త తిరుగుతోంది. దాని సారాంశం ఏంటంటే ... మైఖేల్ కోర్సలే నిర్లక్ష్యమే ఈ బ్రేకప్‌కి ప్రధాన కారణమట. లండన్‌లోని థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్. ఇప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడకుండా తల్లిదండ్రులపైనే ఆధారపడ్డాడట అతను. నీ వైఖరిని మార్చుకోవాలి, నీ అంతట నువ్వు నిలబడాలి, సొంతంగా ఏదైనా చేయమంటూ శ్రుతీ చాలాసార్లు మైఖేల్‌కు చెప్ప డం జరిగిందట. కానీ శ్రుతీహాసన్ చెప్పిన మాటలను మైఖేల్ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఇది శ్రుతీకి కష్టంగా అనిపించిందట. జంటగా తడబడుతూ నడిచే బదులు, విడివిడిగా సవ్యంగా నడు ద్దాం అని భావించి ఇష్టప్రకారమే ఈ రిలేషన్‌షిప్‌కు బై బై చెప్పారట. -
ఇకపై విడిగా నడుద్దాం
కొంతకాలంగా శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. చెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఒకరి బర్త్‌డేను మరొకరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం, సెల్ఫీలతో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం... ఇలా చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది దృష్టిలో పడ్డారు. వీరి ప్రేమకు శ్రుతీ తండ్రి కమల్ కూడా అంగీకారం తెలిపారు, త్వరలోనే శ్రుతీ, మైఖేల్ ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్నారని వినిపించింది. అయితే కహానీలో ట్విస్ట్ వచ్చింది. శ్రుతీ, మైఖేల్ విడిపోతున్నారు. ఎవరో కల్పించిన వార్తలు కాదు. మైఖేలే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా బ్రేకప్ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘జీవితం మమ్మల్ని (శ్రుతీ–మైఖేల్) అనుకోకుండా భూమికి చెరో వైపు (తాను లండన్, శ్రుతి ఇండియన్ అనే అర్థంతో) ఉంచింది. బహుశా అందుకే మేమిద్దరం విడివిడిగా నడవాలనుకుంటా. విడిపోయినప్పటికీ శ్రుతీహాసన్ నా బెస్ట్ ఫ్రెండ్‌లానే ఉంటుంది. తను నా ఫ్రెండ్‌గా దొరకడం నా అదృష్టం’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు కోర్సలే. పరస్పర అంగీకారం ప్రకారమే ఈ ఇద్దరూ విడిపోయారని, విడిపోయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌లానే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారు అని శ్రుతీ–మైఖేల్‌ల కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. -
ప్రేమ సందేశాలు
గత నెలలో శ్రుతీహాసన్ పుట్టిన రోజుకు లండన్ నుంచి ప్రేమ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు శ్రుతీ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే. సోమవారం మైఖేల్ పుట్టినరోజు. ఈసారి ప్రేమ సందేశాలను లండన్ పంపడం శ్రుతీ వంతైంది. ‘‘మైఖేల్.. ఈ ఏడాది నువ్వు ఇంకా అద్భుతంగా మారతావని, కెరీర్ మరింత కాంతివంతంగా మారుతుందని ఆశిస్తున్నాను. వీటితోపాటు నీ హృదయం మరింత విశాలంగా మారుతుందని (ఒకవేళ అవకాశముంటే). హ్యాపీ బర్త్‌డే బెస్ట్ ఫ్రెండ్. మై మ్యాన్.. మిస్ అవుతున్నాను’’ అని రాసుకొచ్చారు శ్రుతీ. ప్రేమ పంచుకుంటున్న వీళ్లు జీవితాన్ని ఎప్పుడు పంచుకుంటారో అని శ్రుతీ ఫ్యాన్స్ వెయిటింగ్. -
ప్రేమ కుట్టింది
టాలీ, కోలీ, బాలీ.. అన్ని వుడ్లనూ దాటిలవేరియా అన్ని అడవు(డ్)లకూ పాకింది.గుయ్.. గుయ్ మంటూ..ఈ వుడ్డునుంటావా, ఆ వుడ్డునుంటావాఅని అడిగేవరకూ ఆగడం లేదు. పడవెక్కి ప్రేమవుడ్డుకు.. సారీ.. ప్రేమఒడ్డుకుసాగిపోతోంది. అన్ని వుడ్‌ల ప్రేమా ఫలించాలి. స్క్రీన్ మీద లవ్‌బర్డ్స్‌కి లైఫ్‌లో కూడా లవ్ వైరస్ సోకితే.. అభిమానులు, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ వాక్సిన్ వేసుకుంటారు. అలా లవేరియాతో అయిదు జంటలు ఎంజాయ్ చేస్తున్నాయి. ఎవరో తెలుసుకోండి... పండగ చేసుకోండి ‘వాలెంటైన్స్‌డే’ను. ఆ దేవుడే పంపాడు ఈ సంక్రాంతికి విశాల్ తన పెళ్లిని కన్ఫార్మ్ చేశారు. అనీషా ఆళ్ల అనే హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారాయన. అనీషా కూడా నటే. ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి’ చిత్రాల్లో ఆమె నటించారు. ‘‘అనీషాతో నా పరిచయం పెళ్లివరకు వెళ్తుందని ఊహించలేదు. తనలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. తను బాస్కెట్‌బాల్ నేషనల్ ప్లేయర్. సోషల్ వర్కర్ కూడా. మా పెళ్లి అయ్యాక అనీషా సినిమాలు మానేస్తుందని నేను చెప్పలేను. ఆమెను దేవుడే నా కోసం పంపాడు’’ అని విశాల్ అంటారు. విశాల్, అనీషా నిశ్చితార్థం మార్చిలో జరగనుందట. పెళ్లి ఆగస్టులో జరగనుందని టాక్. పెళ్లి కబురు ఎప్పుడొస్తుందో! కోలీవుడ్‌లో ప్రేమపక్షులు అంటే నయనతార, విఘ్నేష్ శివన్లే. లేటెస్ట్గా ఆర్య, సాయేషాల పేర్లూ టైటిల్ కార్డ్స్‌లో చేరాయి. ఈ ఇద్దరూ కలిసి ‘గజనీకాంత్’ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా టైమ్‌లోనే ఈ ఇద్దరి మీద కాదల్ (ప్రేమ) క్లాప్ కొట్టిందట. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ సినిమాలో సాయేషా కథానాయికగా నటిస్తుండగా, ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అతి త్వరలో ఆర్య, సాయేషాల వివాçహానికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చనే వార్త వైరల్ అయింది తమిళ సినీ పరిశ్రమలో. ఫొటోలతో కన్ఫార్మ్ బాలీవుడ్ కూడా లవ్ ఫ్లూతో ఫ్లేమ్ అవుతోంది. నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, నటి షిబానీ దండేకర్ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వినపడుతోంది. సోషల్ మీడియాలో కనపడుతోంది కూడా. గతేడాది అక్టోబర్‌లో ఫర్హాన్ అఖ్తర్, షిబానీ ఇద్దరూ ఒకేఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫర్హాన్ లవ్ సింబల్‌ను జతపెట్టి మరీ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి లవ్‌కి కన్ఫర్మేషన్ వచ్చినట్టయింది. ‘‘మీరు ఫర్హాన్‌తో ప్రేమలో ఉన్నారా?’’ అని షిబానీని అడిగితే ‘‘మేం పోస్ట్ చేసే ఫొటోలను బట్టే అందరూ అర్థం చేసుకోవాలి’’ అని జవాబు ఇచ్చారు. దాంతో ఈ ఏడాదే వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకోనున్నారని బాలీవుడ్లో ఒకటే హోరు. రోహ్మాన్తో ప్యార్ మే 1994 మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ ఇప్పుడు సినిమాల్లో రేర్ అయినా పబ్లిసిటీలో జోరుగా ఉన్నారు... రోహ్మన్ షాల్ అనే వ్యక్తితో లవ్‌లో పడి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో ఈ జంట వేసిన స్టెప్స్ సూపర్ హిట్. ‘రోహ్మాన్తో ప్యార్ మే’ కదా అంటే సుష్మితా నవ్వుతున్నారు. ‘మీ పెళ్లెప్పుడు?’ అంటే మాత్రం ‘నా పెళ్లి విషయం మీకెందుకు’ అంటూ మండిపడతున్నారట. కానీ మీడియాలో అయితే వీళ్లిద్దరూ ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్ స్ట్రీమ్ అవుతోంది. సుష్మితా సేన్‌కు రినీ సేన్, అలీసా సేన్ అనే ఇద్దరు దత్తపుత్రికలు ఉన్న సంగతి తెలిసిందే. లవ్ ఫర్ హార్లిన్ ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్’తో 200 కోట్ల క్లబ్లో చేరాడు విక్కీ కౌశల్. పర్సనల్ లైఫ్‌ను లవ్ క్లబ్లో రిజిష్టర్ చేయించుకున్నాడు. హార్లిన్ సేథి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పారు విక్కీ. ‘‘కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ పార్టీలో హార్లిన్ను కలిశాను. లాస్ట్ ఇయర్ నుంచే తనతో డేటింగ్లో ఉన్నా. ఒకరినొకరం తెలుసుకుంటున్నాం. మా రిలేషన్ బాగుంది’’ అని చెప్పారు విక్కీ కౌశల్. మొహబ్బతే... తాప్సీ–మాథ్యాస్ బో, శ్రుతీహాసన్ – మైఖేల్ కోర్సలే, ఇలి యానా –ఆండ్రూ నీబోన్, నటాషా దలాల్–వరుణ్‌ధావన్, ఆలియా భట్–రణ్‌బీర్ కపూర్, రియా కపూర్–కరణ్ బులానీ, టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ... ఈ జంటలు ప్రేమలో మునిగి ఉన్నట్లు వాళ్ల తీరు స్పష్టం చేస్తోంది. వీళ్ల ప్యార్ ఈ యేడాదైనా మ్యారేజ్ టేక్ తీసుకుంటుందా? చూడాలి! ఇంతకీ ఇక్కడ ప్రస్తావించిన జంటల్లో రియా కపూర్ ఎవరో అనుకునేరు... ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, నటి సోనమ్‌కపూర్ సోదరే రియా. రింగులు మార్చుకున్నారు నిశ్చితార్థంతో సగం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కథానాయికలూ ఉన్నారు. జో అనే వ్యక్తితో రిచా గంగోపాధ్యాయ, జార్జ్ పానాయియోటోన్తో అమీ జాక్సన్, గుణ జక్కాతో అనీషా అంబ్రోస్లకు ఎంగేజ్మెంట్ అయింది. వీళ్ల పెళ్లి తేదీలు ఇంకా ఖరారు కాలేదు. జతకూడేనా? టాలీవుడ్లో ప్రేమ, పెళ్లి టాపిక్స్ వస్తే చాలు వెంటనే ప్రభాస్, రానా గుర్తొస్తారు. వీరితోపాటు వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్, నిఖిల్, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, అఖిల్, నాగశౌర్య, రాజ్ తరుణ్ వంటి హీరోల స్టేటస్ సింగిల్‌గానే ఉంది. వచ్చే ప్రేమికుల రోజుకైనా వీరికి వాళ్ల వేలెంటైన్ దొరికేనా.. జత కూడేనా? కాలం కాదల్‌తో జవాబిస్తుందేమో చూద్దాం! ప్రేమించు.. పెళ్లాడు ఇటీవల ప్రేమ వివాహలు చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. మలయాళ నటి భావన.. నిర్మాత నవీన్‌ను, శ్రియ తన ప్రేమికుడు అండ్రూ కృశ్చేవ్‌ను, కలర్స్ స్వాతి పైలట్ వికాస్‌ను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు నటి శ్వేతాబసు ప్రసాద్ గత డిసెంబర్ 13న పుణేలో రోహిత్ మిట్టల్‌కు జీవితభాగస్వామి అయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె , దర్శక, నిర్మాత సౌందర్యా రజనీకాంత్ వ్యాపారవేత్త విశాగన్ వనంగాముడిని వివాహమాడారు. ఇక బీటౌన్ పెళ్లిళ్ల వైపు వెళితే.. దీప్‌వీర్‌ల (దీపికా పదుకోన్–రణ్వీర్ సింగ్) ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒకింటి వారయ్యారన్నది సినీ అభిమాన జగమెరిగిన సత్యం. ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్ (నిక్యాంక)లు కూడా గత డిసెంబర్ 1, 2 తేదీల్లో రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 1న క్రిస్టియన్ స్టైల్లో, డిసెంబర్ 2న నార్త్ ఇండియన్ స్టైల్లో ఆ పెళ్లి వేడుకలు జరిగాయి. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాల వెడ్డింగ్ పంజాబ్ స్టైల్లో గత మే 8న జరగింది. సోనమ్ కపూర్ పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత మే 10న నేహా« «ధూపియా, అంగద్ బేడీల పెళ్లి అయింది. నటుడు మిలింద్ సోమన్, అంకిత కోన్వార్.. ఏప్రిల్ 22న మహారాష్ట్రియన్ వివాహ పద్ధతిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దర్శక–నిర్మాత దినేష్ విజన్ దుబాయ్‌కి చెందిన ప్రమీత తన్వర్‌ను, బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్ శర్మ.. గిన్ని చత్రాథ్ను పరిణయమాడారు. వీరితో పాటు హిందీ బుల్లితెర నటీనటులు కొందరు గతేడాది మ్యారీడ్ లైఫ్‌కు శ్రీకారం చూట్టారు. -
నువ్విక్కడుంటే బాగుండు
‘యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్’ అంటూ ఓ సినిమాలో హీరో శ్రుతీహాసన్‌ను పొగుడుతాడు. వెంటనే ఇద్దరూ ఓ డ్యూయెట్ పాడుకుంటారు. అది తెరమీద ఎవరో రాసిన డైలాగ్. కానీ శ్రుతీహాసన్ పుట్టిన రోజున అదే డైలాగ్‌ను కొట్టారు మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండే మైఖేల్ అని చెప్పక్కర్లేదు. పుట్టినరోజు శుభాకాంక్షల్లో ప్రేమను వొలకబోయడమే కాదు, ‘గాళ్‌ఫ్రెండ్’ అని సంబోధించారు కూడా. వీళ్లిద్దరూ గతేడాది నుంచి రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమను పంచుకుంటున్నారే తప్ప ప్రేమికులమని ప్రకటించలేదు. ప్రేయసి బర్త్‌డే రోజున ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్‌సైడ్. నీలాంటి గాళ్‌ఫ్రెండ్ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. లవ్ యు బేబి. ఈ రోజుని అద్భుతంగా గడుపుతావని అనుకుంటున్నాను’’ అని లండన్ నుంచి శుభాకాంక్షలు పంపారు మైఖేల్. దానికి సమాధానంగా శ్రుతీ ‘‘లవ్ యు టూ డార్లింగ్. నువ్విక్కడుంటే బావుణ్ణు’’ అని స్పందించారు. కెరీర్ పరంగా శ్రుతీహాసన్ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ఇటీవలే లండన్‌లో సొంతంగా ఓ మ్యూజికల్ షో నిర్వహించారు. దానికి విశేషమైన స్పందన లభించింది. కొన్ని రోజులు యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చి మ్యూజిక్ వైపు శ్రద్ధ చూపాలనుకుంటున్నారని టాక్. -
ఏంటి నిజమా?
కొత్త సినిమాలు సంతకం చేయడం లేదు. కేవలం టీవీ షో మాత్రమే చేస్తోంది. ఇది చాలదా గాసిప్‌రాయుళ్లకు శ్రుతీహాసన్ పెళ్లికి శుభముహూర్తం పెట్టడానికి. అదే చేసేశారు. శ్రుతీ 2019లో తన లండన్ బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ కోర్సలేను పెళ్లి చేసుకోబోతోంది అని రాసుకొచ్చారు. ఈ వార్త శ్రుతీ చెవిలో కూడా పడింది. వెంటనే ‘ఏంటి నిజమా? ఇది నాకూ వార్తే’ అంటూ ట్వీట్ చేశారు. మైఖేల్, శ్రుతీ కొంత కాలంగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఔత్సాహికులు రాసుకొచ్చినట్టు శ్రుతీహాసన్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా? ఆవిడ కొట్టిపారేసినట్టే ఈ ఏడాది ప్రేమలోనే మునిగి తేలుతూ జీవితాన్ని ఆస్వాదిస్తారా? వేచి చూద్దాం. -
కాలానికి ధన్యవాదాలు
న్యూ ఇయర్ వచ్చేసింది. గడచిన సంవత్సరం ఎలా గడిచింది? అని విశ్లేషించుకుంటూ ఈ ఏడాది ఎలా ఉండాలో కోరుకుంటూ బిజీగా ఉన్నారు చాలామంది. శ్రుతీహాసన్ ఏమంటున్నారంటే.. ‘‘ఎలా జీవించాలో నాకు నేర్పుతున్న ప్రతి ఏడాదికి థ్యాంక్స్. కాలం నాలో తెచ్చిన మార్పులకు థ్యాంక్స్. నాలో నన్ను వెతుక్కునే అవకాశం కల్పించి, నన్ను నేను ప్రేమించుకునేలా చేసిన టైమ్‌కి థ్యాంక్స్. అలాగే 2019 కూడా నన్ను ఎగై్జట్ చేసే ఎన్నో అంశాలను నా ముందుకు తీసుకురావాలి. నాకు నచ్చిన విషయాలను ఎంపిక చేసుకునే అవకాశాలను ఇవ్వాలి. నా సంతోషంలో గతేడాది భాగమైన నా బంధుమిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఆమె తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి లండన్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక శుత్రి సినిమాల విషయానికి వస్తే.. హిందీలో విద్యుత్ జమాల్ సరసన ఆమె ఓ సినిమా చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకుడు. -
అందుకే... నువ్వంటే నాకిష్టం!
కొన్ని రోజులుగా శ్రుతీహాసన్ కాస్త మూడీగా ఉంటున్నారు. పనులన్నీ చేస్తూనే ఉన్నారు. అందరితో బాగానే ఉంటున్నారు. కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు. కారణం.. మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్ గురించి తెలిసినవాళ్లకు మైఖేల్ పరిచయం లేని పేరు. ఆమె భాషలో చెబితే అతను శ్రుతీ బెస్ట్ ఫ్రెండ్... మన భాషలో చెప్పుకుంటే బాయ్‌ఫ్రెండ్. లండన్‌లో ఉండే థియేటర్ ఆర్టిస్ట్ కోర్సలే. కొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మధ్యలో వీళ్లిద్దరూ కలుసుకోవడం కుదర్లేదు. టీవీ షో చేస్తూ చెన్నైలో బిజీ బిజీగా గడిపారు శ్రుతీ. దాంతో ఇద్దరికీ మిస్సింగ్ మిస్సింగ్ అయింది. ప్రేమ భాషలో చెప్పాలంటే విరహం. మ్యూజిక్ వర్క్ మీద లాస్ ఏంజెల్స్ వెళ్లారు శ్రుతీ. అక్కడ మైఖేల్‌ను చాలా రోజుల తర్వాత కలిశారు. ఇంకేముంది అవధుల్లేని ఆనందం వచ్చేసింది శ్రుతీకి. ఆ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘నువ్వు నన్ను బాగా నవ్విస్తావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. చాలా రోజుల తర్వాత నా ప్రియమైన వ్యక్తిని కలిశాను’’ అంటూ సెల్ఫీని పోస్ట్ చేశారు శ్రుతి. -
వైఫై కంటే ఎక్కువ!
ఇటీవల శ్రుతీహాసన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌ను గమనిస్తుంటే ఆల్మోస్ట్ ప్రతి ఫొటోలోనూ లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సెలే ఉన్నారు. శ్రుతీ, మైఖేల్ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే శ్రుతి మాత్రం మైఖేల్‌ను లవర్ అని ఒప్పుకోవడం లేదు కానీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అంటున్నారు. తాజాగా ‘వైఫై కన్నా ఎక్కువగా నేను మైఖేల్‌ను ప్రేమిస్తున్నాను’’ అని అర్థం వచ్చేలా ఓ ఫొటోను ఉంచారు శ్రుతి. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో వైఫై కనెక్షన్ లేకపోతే నెటిజన్లు ఎంతలా అల్లాడిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మైఖేల్ లేకపోతే శ్రుతి కూడా అంతేనేమో. అందుకే ఆ పోస్ట్ పెట్టారేమో? అని విశ్లేషించుకుంటున్నారు నెటిజన్లు. ఇక శ్రుతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విద్యుత్ జమాల్ సరసన బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకుడు. -
నీతో సావాసం బాగుంది
‘‘నీతో సావాసం ప్రతిరోజు ఓ సరికొత్త సాహసం చేసినట్లుగా అనిపిస్తోంది మైఖేల్’’ అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేని పొగడ్తలతో ముంచెత్తారు శ్రుతీహాసన్. మైఖేల్, శ్రుతీ ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ కోడై కూసినా వీళ్లు మాత్రం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనే తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి చెబుతున్నారు. రీసెంట్గా మైఖేల్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన శ్రుతీ – ‘‘నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో ప్రతి రోజూ చూపిస్తున్నావు. చిన్న చిన్న విషయాలకు నవ్వుకోవడాలు, చాటింగ్ చేసుకోవడం... ఎంత దూరమైనా కలసి నడవడం అన్నీ బావున్నాయి’’ అన్నారు శ్రుతీ. -
ఇట్టా చెట్టా పట్టాలేసుకుని..!
‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని శ్రుతీహాసన్‌ను అడిగితే ‘ఆ ఒక్కటీ అడగద్దంటూనే, ఇతరుల పర్సనల్ లైఫ్‌ని గౌరవించండి’ అని కాస్త ఘాటుగా మాట్లాడతారు. కానీ సెలబ్రిటీల విషయాలను తెలుసుకునేవాళ్లు ఈ మాట విని ఆగుతారా? ఊహూ.. చాన్సే లేదు. లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సలేతో శ్రుతి లవ్‌లో ఉన్నారని ఈ ఇద్దర్నీ అక్కడక్కడా చూసినవాళ్లు ఊహిస్తున్నారు. ఆ ఊహలకు తగ్గట్టుగా మైఖేల్‌తో శ్రుతి బాహాటంగానే చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ మధ్య ఓ పెళ్లిలో, అలాగే తల్లి సారికతో, ఓసారి షాపింగ్ మాల్లో మైఖేల్‌తో కనిపించారు శ్రుతి. తాజాగా, ఈ ఇద్దరూ ప్రేమపక్షుల్లా విహరిస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. మరి ఈ జంట ఏడడుగులు ఎప్పుడు వేస్తారో? అని ఔత్సాహికరాయుళ్లు మాట్లాడుకుంటున్నారు. సినిమాల సంగతికొస్తే... ఈ అమ్మడు విద్యుత్ జమాల్ హీరోగా రూపొందనున్న ఓ హిందీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. -
ఫన్నీగాయ్!
మైఖేల్ కోర్స్లే, హీరోయిన్ శృతీహాసన్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఇండస్ట్రీ టాక్. రీసెంట్గా చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో కమల్‌హాసన్‌తో, మరో సందర్భంలో శృతి తల్లి సారికతో మైఖేల్ ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. దీంతో మైఖేల్, శృతి పెళ్లిపీటలెక్కబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఈ ఏడాది బర్త్‌డే సందర్భంగా చెప్పారు శృతి. కానీ మైఖేల్‌పై మాత్రం ఫుల్ క్లారటీ ఇవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్గా మైఖేల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారామె. ‘‘ ప్రతి విషయంలో నాతో కలిసి నవ్వుతూ నవ్విస్తుంటాడు. నాకు తెలిసిన ఫన్నీగాయ్. హ్యాపీ బర్త్‌డే టు మై బెస్ట్ ఫ్రెండ్’’ అంటూ మైఖేల్‌కు పుట్టనరోజు శుభాకాంక్షలు తెలిపారు శృతి. అంతేకాదు ఈ టైమ్‌లో మైఖేల్ పక్కన తను లేకపోయినందుకు ‘ఐ యామ్ సారీ’ అని కూడా పేర్కొన్నారామె. -
హ్యాపీ మూమెంట్లో నీతో లేను.. సారీ!
సాక్షి, చెన్నై: లండన్‌కు చెందిన నటుడు, తన బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సల్‌తో నటి శ్రుతీహాసన్ గత కొంతకాలం నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నటి ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను లాస్ఏంజల్స్లో మైఖెల్ కోర్సల్, కొందరు స్నేహితులతో జరుపుకుని అందరిని ఆశ్చర్యపరచారు. కోర్సల్ అంటే తనకెంత ఇష్టమో శ్రుతీహాసన్ చెప్పకనే చెప్పేశారు. మైఖెల్ కోర్సల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపింది శ్రుతి. ‘ మై బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్ ఇన్ క్రైమ్, నాతో పాటు ప్రపంచాన్ని చుట్టొచ్చేందుకు ఇష్టపడే తోటి ప్రయాణికుడు. ప్రతి విషయంలోనూ నాతో పాటు నవ్వుతుండే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ శ్రుతీహాసన్ ట్వీట్ చేశారు. ఈ సంతోష సందర్భంలో నీ చెంత లేనందుకు క్షమించమంటూ బాయ్ ఫ్రెండ్ కోర్సల్ను నటి కోరుతున్నట్లు తెలిపింది. ఫన్నియెస్ట్ మ్యాన్ ఐ నో, హార్ట్ ఆఫ్ గోల్డ్, బర్త్‌డే బాయ్, సారీ ఐయామ్ నాట్ దేర్, హ్యాపీమీ హ్యాపీఅస్ అని హ్యాష్ ట్యాగ్స్‌తో మైఖెల్ కోర్సల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది ఈ బ్యూటీ. కొన్ని రోజుల కిందట చెన్నైలో జరిగిన నటుడు ఆదవ్ కన్నదాసన్ పెళ్లి వేడుకలో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌తో సందడి చేయగా.. పెళ్లి వందంతులు వ్యాప్తిచెందాయి. తాను ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం లేదని శ్రుతీహసన్ స్పష్టం చేసి రూమర్లకు చెక్ పెట్టింది. Happy birthday to my best friend,partner in crime,weird conversation connoisseur,fellow traveler through the world of art and most of all the man who laughs with me through everything ❤️ #funniestmaniknow #heartofgold #birthdayboy #sorryimnotthere #happymehappyus pic.twitter.com/yBwDAiWfPu — shruti haasan (@shrutihaasan) 18 February 2018 -
కూతురి ఎఫైర్.. ప్రముఖ హీరో ఆందోళన
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన కూతురు, నటి శృతి హాసన్.. మిస్టరీ మ్యాన్ మైఖేల్ కొర్సలేతో ఎఫైర్ సాగిస్తోందని వచ్చిన వార్తలపై ఆందోళన చెందుతున్నారట. శృతి హాసన్, మైఖేల్ కలిసున్న ఫొటోలు ఇటీవల మీడియాలో వచ్చాయి. గత నెలలో వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఇద్దరికీ రిలేషన్షిప్ ఉందని బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయం కమల్ హాసన్ దృష్టికి రావడంతో ఆయన కలత చెందినట్టు సన్నిహితులు చెప్పారు. మైఖేల్‌తో శృతి ఇలా బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరగడం పట్ల కమల్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇలాంటి కథనాలు మీడియాలో రావడం వల్ల ప్రతిష్ట దెబ్బతింటుందని కమల్ భావిస్తున్నారని, ఈ విషయం గురించి శృతితో మాట్లాడారని సన్నిహితులు చెప్పారు. లండన్‌లోని ప్రఖ్యాత డ్రామా సెంటర్లో మైఖేల్ గ్రాడ్యుయేషన్ చేశాడు. కాగా గతంలో కూడా శృతి ఎఫైర్ల గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ తాజా సినిమాలో కాటమరాయుడులో ఆమె హీరోయిన్గా నటించింది.