మైఖేల్ కోర్సలే, శ్రుతీహాసన్
కొంతకాలంగా శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఒకరి బర్త్‌డేను మరొకరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం, సెల్ఫీలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం... ఇలా చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది దృష్టిలో పడ్డారు. వీరి ప్రేమకు శ్రుతీ తండ్రి కమల్ కూడా అంగీకారం తెలిపారు, త్వరలోనే శ్రుతీ, మైఖేల్ ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్నారని వినిపించింది. అయితే కహానీలో ట్విస్ట్ వచ్చింది. శ్రుతీ, మైఖేల్ విడిపోతున్నారు. ఎవరో కల్పించిన వార్తలు కాదు. మైఖేలే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా బ్రేకప్ విషయాన్ని స్పష్టం చేశారు.
‘‘జీవితం మమ్మల్ని (శ్రుతీ–మైఖేల్) అనుకోకుండా భూమికి చెరో వైపు (తాను లండన్, శ్రుతి ఇండియన్ అనే అర్థంతో) ఉంచింది. బహుశా అందుకే మేమిద్దరం విడివిడిగా నడవాలనుకుంటా. విడిపోయినప్పటికీ శ్రుతీహాసన్ నా బెస్ట్ ఫ్రెండ్‌లానే ఉంటుంది. తను నా ఫ్రెండ్‌గా దొరకడం నా అదృష్టం’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు కోర్సలే. పరస్పర అంగీకారం ప్రకారమే ఈ ఇద్దరూ విడిపోయారని, విడిపోయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌లానే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారు అని శ్రుతీ–మైఖేల్‌ల కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment