నువ్విక్కడుంటే బాగుండు | Shruti Haasan with rumoured boyfriend Michael Corsale to depict her love story | Sakshi
Sakshi News home page

నువ్విక్కడుంటే బాగుండు

Jan 29 2019 3:38 AM | Updated on Jan 29 2019 8:11 AM

Shruti Haasan with rumoured boyfriend Michael Corsale to depict her love story - Sakshi

‘యు ఆర్‌ బ్యూటిఫుల్‌ ఇన్‌సైడ్‌’ అంటూ ఓ సినిమాలో హీరో శ్రుతీహాసన్‌ను పొగుడుతాడు. వెంటనే ఇద్దరూ ఓ డ్యూయెట్‌ పాడుకుంటారు. అది తెరమీద ఎవరో రాసిన డైలాగ్‌. కానీ శ్రుతీహాసన్‌ పుట్టిన రోజున అదే డైలాగ్‌ను కొట్టారు మైఖేల్‌ కోర్సలే. శ్రుతీహాసన్‌ బాయ్‌ఫ్రెండే మైఖేల్‌ అని చెప్పక్కర్లేదు. పుట్టినరోజు శుభాకాంక్షల్లో ప్రేమను వొలకబోయడమే కాదు, ‘గాళ్‌ఫ్రెండ్‌’ అని సంబోధించారు కూడా. వీళ్లిద్దరూ గతేడాది నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమను పంచుకుంటున్నారే తప్ప ప్రేమికులమని ప్రకటించలేదు. ప్రేయసి బర్త్‌డే రోజున ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్‌.

యు ఆర్‌ బ్యూటిఫుల్‌ ఇన్‌సైడ్‌ అండ్‌ అవుట్‌సైడ్‌. నీలాంటి గాళ్‌ఫ్రెండ్‌ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. లవ్‌ యు బేబి. ఈ రోజుని అద్భుతంగా గడుపుతావని అనుకుంటున్నాను’’ అని లండన్‌ నుంచి శుభాకాంక్షలు పంపారు మైఖేల్‌. దానికి సమాధానంగా శ్రుతీ ‘‘లవ్‌ యు టూ డార్లింగ్‌. నువ్విక్కడుంటే బావుణ్ణు’’ అని స్పందించారు. కెరీర్‌ పరంగా శ్రుతీహాసన్‌ కొత్త సినిమాలేవీ సైన్‌ చేయలేదు. ఇటీవలే లండన్‌లో సొంతంగా ఓ మ్యూజికల్‌ షో నిర్వహించారు. దానికి విశేషమైన స్పందన లభించింది. కొన్ని రోజులు యాక్టింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి మ్యూజిక్‌ వైపు శ్రద్ధ చూపాలనుకుంటున్నారని టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement