అందుకే... నువ్వంటే నాకిష్టం! | Shruthi Haasan meet to boy friend | Sakshi
Sakshi News home page

అందుకే... నువ్వంటే నాకిష్టం!

Dec 21 2018 2:57 AM | Updated on Dec 21 2018 2:57 AM

Shruthi Haasan meet to boy friend - Sakshi

శ్రుతీహాసన్‌, మైఖేల్‌ కోర్సలే,

కొన్ని రోజులుగా శ్రుతీహాసన్‌ కాస్త మూడీగా ఉంటున్నారు. పనులన్నీ చేస్తూనే ఉన్నారు. అందరితో బాగానే ఉంటున్నారు. కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు. కారణం.. మైఖేల్‌ కోర్సలే. శ్రుతీహాసన్‌ గురించి తెలిసినవాళ్లకు మైఖేల్‌ పరిచయం లేని పేరు. ఆమె భాషలో చెబితే అతను శ్రుతీ బెస్ట్‌ ఫ్రెండ్‌...  మన భాషలో చెప్పుకుంటే బాయ్‌ఫ్రెండ్‌. లండన్‌లో ఉండే థియేటర్‌ ఆర్టిస్ట్‌ కోర్సలే. కొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మధ్యలో వీళ్లిద్దరూ కలుసుకోవడం కుదర్లేదు.

టీవీ షో చేస్తూ చెన్నైలో బిజీ బిజీగా గడిపారు శ్రుతీ. దాంతో ఇద్దరికీ మిస్సింగ్‌ మిస్సింగ్‌ అయింది. ప్రేమ భాషలో చెప్పాలంటే విరహం. మ్యూజిక్‌ వర్క్‌ మీద లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లారు శ్రుతీ. అక్కడ మైఖేల్‌ను చాలా రోజుల తర్వాత కలిశారు. ఇంకేముంది అవధుల్లేని ఆనందం వచ్చేసింది శ్రుతీకి. ఆ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘నువ్వు నన్ను బాగా నవ్విస్తావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. చాలా రోజుల తర్వాత నా ప్రియమైన వ్యక్తిని కలిశాను’’ అంటూ సెల్ఫీని పోస్ట్‌ చేశారు శ్రుతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement