తగ్గేదేలే.. ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్ | RRR Music Director MM Keeravani Gets Another Award | Sakshi
Sakshi News home page

MM Keeravani: కీరవాణికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్

Published Sun, Jan 15 2023 6:58 PM | Last Updated on Sun, Jan 15 2023 6:59 PM

RRR Music Director MM Keeravani Gets Another Award - Sakshi

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. తాజాగా అమెరికాలోని 'లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు దక్కింది. 

(ఇది చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణిని ‍ఎంపిక చేసింది. ఈ అవార్డ్ అందుకున్న ఫోటోలు ఆర్ఆర్ఆర్ బృందం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కీరవాణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఊపులో ఆస్కార్ అవార్డ్ కూడా తీసుకురావాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement