Britney Spears Release Conservatorship From Her Father: ఎట్టకేలకు తండ్రి చెర నుంచి పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్(39) విముక్తి పొందింది. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను ఆమె తండ్రి జేమిని స్పియర్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిట్నీ తన తండ్రి జేమీ స్పియర్స్ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని ఆమె గత జులైలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శుక్రవారం(నవంబర్ 12) ఈ కేసును విచారించిన లాస్ ఎంజిల్స్ కోర్టు తనకు ఊరటనిచ్చింది.
చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే..
తన తండ్రి చెర నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ‘నా జీవితంలో ఇదే అత్యుత్తమైన రోజు’ అంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. దీంతో ఆమెకు మద్దతు తెలిపేందుకు ఆమె ఫ్యాన్స్ లాస్ ఏంజిల్స్ కోర్టుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బ్రిట్నీ తన తండ్రి సంరక్షణలో భౌతికంగా, ఎమోషనల్, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయినట్లు ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదించారు.
చదవండి: Kangana Ranaut: అప్పుడేం జరిగిందో చెబితే పద్శశ్రీ తిరిగి ఇచ్చేస్తా
వారి వాదనలు విన్న లాస్ ఎంజిల్స్ కోర్టు ఆమెకు ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది. గత 13 ఏళ్ల నుంచి తన తండ్రి వల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు ఆమె ఇటీవల కోర్టులో పేర్కొంది. సంరక్షణ స్థానం నుంచి తన తండ్రిని తప్పించాలని, ఆయన వద్ద ఉన్న నియంత్రణాధికారాలను తొలగించాలని బ్రిట్నీ కోర్టును వేడుకుంది. 2008 నుంచి పాప్ సింగర్ బ్రిట్నీ తన తండ్రి జేమ్స్ స్పియర్స్ కస్టడీలో ఉంటున్నది. అయితే తనపై తన తండ్రికి ఉన్న న్యాయపరమైన నియంత్రణను తొలగించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది.
చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..?
బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి జేమ్స్ చూసుకున్నారు. 13 ఏళ్ల నరకం ఇక చాలు అని, తన జీవితాన్ని తనకు వెనక్కి ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది. బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్నదని, ఆమెను తండ్రి చెర నుంచి విముక్తి చేయాలని ఆన్‌లైన్‌లో ఫ్రీ బ్రిట్నీ ఉద్యమం కొనసాగించిన విషయం తెలిసిందే. సంరక్షణాధికారాలను తన తండ్రి దుర్వినియోగం చేసినట్లు బ్రిట్నీ ఆరోపించింది.
చదవండి: నా జీవితం నాక్కావాలి: కన్నతండ్రిపై సింగర్ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment