
‘‘జీవితం మనల్ని భూమి మీద చెరోవైపు ఉంచింది. అందుకే ఇకపై విడిగా నడవాలేమో?’’ అంటూ తమ బ్రేకప్‌ను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రెండు సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తమ బంధానికి ఇరువురు ఇష్టప్రకారమే వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ బ్రేకప్‌కి కారణం ఇదే అంటూ తమిళనాడులో ఓ వార్త తిరుగుతోంది. దాని సారాంశం ఏంటంటే ... మైఖేల్ కోర్సలే నిర్లక్ష్యమే ఈ బ్రేకప్‌కి ప్రధాన కారణమట.
లండన్‌లోని థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్. ఇప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడకుండా తల్లిదండ్రులపైనే ఆధారపడ్డాడట అతను. నీ వైఖరిని మార్చుకోవాలి, నీ అంతట నువ్వు నిలబడాలి, సొంతంగా ఏదైనా చేయమంటూ శ్రుతీ చాలాసార్లు మైఖేల్‌కు చెప్ప డం జరిగిందట. కానీ శ్రుతీహాసన్ చెప్పిన మాటలను మైఖేల్ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఇది శ్రుతీకి కష్టంగా అనిపించిందట. జంటగా తడబడుతూ నడిచే బదులు, విడివిడిగా సవ్యంగా నడు ద్దాం అని భావించి ఇష్టప్రకారమే ఈ రిలేషన్‌షిప్‌కు బై బై చెప్పారట.
Comments
Please login to add a commentAdd a comment