Shruthihasan
-
సమ్మర్లో క్రాక్
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘డాన్ శీను, బలుపు’ తర్వాత వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్’. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రవితేజ. బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయిక. మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
జోరు పెరిగింది
‘పందెంకోడి 2, సర్కార్’ వంటి తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో కీలకపాత్ర పోషించిన వరలక్ష్షీ్మ శరత్‌కుమార్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడామె డైరెక్ట్‌గా తెలుగు చిత్రాలకు సైన్ చేస్తూ టాలీవుడ్లో జోరు పెంచారు. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి.మధు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘రవితేజగారి సినిమాలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తారు. కాగా, సందీప్‌కిషన్ హీరోగా నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్’ వరలక్ష్మికి తొలి తెలుగు చిత్రం. తమిళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్బిజీగా ఉన్నారామె. -
శిక్షణ ముగిసింది
స్టంట్స్ చేయడానికి శిక్షణ పూర్తి చేసుకున్నారు శ్రుతీహాసన్. ఇక వాటిని స్క్రీన్ మీద చూపించడమే ఆలస్యం అంటున్నారామె. ‘ట్రెడ్‌స్టోన్’ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో యాక్ట్ చేయనున్నారు శ్రుతీ. తన పాత్రకు సంబంధించి చాలా యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుందట. దానికోసం కొంత కాలంగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ పూర్తికావడంతో షూటింగ్‌కు రెడీ అయ్యారు. ‘‘చాలా ఏళ్ల తర్వాత నాలో శక్తిని మళ్లీ బయటకు తీసుకు వచ్చారు నా ట్రైనర్ జిల్వీ. తనతో ట్రైనింగ్ చాలా సరదాగా సాగింది’’ అని పేర్కొన్నారు శ్రుతీ. ఈ షూటింగ్లో జాయిన్ అవడానికి తైవాన్ వెళ్లారు శ్రుతీ. ఈ సిరీస్‌లో పగలంతా వెయిట్రెస్‌గా పని చేస్తూ రాత్రి హత్యలు చేసే వ్యక్తి పాత్రలో శ్రుతీ కనిపిస్తారు. -
హాసన్‌ని కాదు శ్రుతీని!
నటిగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు శ్రుతీహాసన్. ఈ సెలబ్రేషన్‌ను బుడాపెస్ట్‌లో (హంగేరీ దేశం) జరుపుకుంటున్నారు. ఇంతకీ. అక్కడేం చేస్తున్నారనుకుంటున్నారా? త్వరలోనే ఓ హాలీవుడ్ టీవీ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కోసం శిక్షణ తీసుకుంటున్నారామె. కొత్త సిరీస్, పదేళ్ల ప్రయాణం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘ట్రెడ్‌స్టోన్’ అనే టీవీ సిరీస్ చేస్తున్నాను. ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. అందుకే ప్రతీరోజు కఠినమైన శిక్షణలో పాల్గొంటున్నాను. స్క్రిప్ట్ విన్నప్పుడు యాక్షన్ సన్నివేశాలేగా.. పదేళ్లుగా సినిమాలు చేస్తున్నాం. అంత కష్టంగా ఉంటాయా? అనుకున్నాను. కానీ చాలా కష్టంగా ఉన్నాయి. నేను దీన్ని బాధగా చెప్పడంలేదు. కానీ వర్క్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. పదేళ్లయినా కూడా నేను పని చేస్తూనే ఉండాలని కోరుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరగడం ఆనందంగా ఉంది. అలాగే ప్రస్తుతం నెపోటిజమ్ (బంధు ప్రీతి) గురించి చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. నా ఇంటి పేరే చిత్రపరిశ్రమలో నాకు తలుపు తెరిచిందని బాగా తెలుసు. ఆ పేరే లేకపోతే కష్టాలు పడాల్సి వచ్చేది. అందుకు నేను మావాళ్లకు కృతజ్ఞురాలిగానే ఉంటాను. అయితే నేను కేవలం హాసన్గానే ఉండిపోకుండా శ్రుతీగా నిలబడ్డాను. నాకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకోగలిగాను. అది అందరికీ తెలిసిందే’’ అని అన్నారు. -
ఐకమత్యం ముఖ్యం
‘‘నాకు తెలిసినంత వరకూ చాలామంది ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఒక స్త్రీ మరో స్త్రీతో కలసి ఐకమత్యంగా ఉండకపోవడమే అనిపిస్తోంది. దీన్ని అధిగమించడానికి నా టీమ్‌లో అందరూ కలిసుండే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఫెమినిజమ్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘నా చిన్నప్పటి నుంచే మా అమ్మానాన్న నన్ను స్వాతంత్య్రంగా, స్ట్రాంగ్ ఉమెన్‌గా పెంచారు. నన్ను పెంచింది ఓ స్ట్రాంగ్ మ్యాన్ (తండ్రి కమల్‌హాసన్). అందుకే నేను మగాళ్లను ద్వేషించే కేటగిరీలో లేను. నాతో పాటు మా ఇంట్లో మరో ఇద్దరు శక్తిమంతమైన మహిళలు ఉన్నారు (తల్లి సారిక, చెల్లెలు అక్షరని ఉద్దేశించి). ప్రస్తుత కాలంలో స్త్రీవాదం అనేది వివిధ రూపాల్లో రూపాంతరం చెందింది. లండన్‌లో నా మ్యూజిక్ బ్యాండ్‌లో టీమ్‌లో అందరూ ఉమెనే ఉన్నారు. ఉమెన్ అని వాళ్లకు జాబ్ ఇవ్వలేదు. వాళ్ల ప్రతిభను చూసే ఇచ్చాను. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం’’ అని శ్రుతీహాసన్. -
మరోసారి జోడీ?
‘బలుపు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రవితేజ–శృతీహాసన్ మరోసారి జోడీ కడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘బలుపు’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం విడుదలైన ఆరేళ్లకు మళ్లీ రవితేజ–శృతీహాసన్ జంటగా నటించనున్నారట. అయితే ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతంలో రవితేజ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘డాన్‌శీను, బలుపు’ సినిమాలొచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. వాస్తవ సంఘటనల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరిందట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవగానే ఈ చిత్రంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇందులో రవికి జోడీగా శృతిని తీసుకోవాలని యూనిట్ ఇప్పటికే ఆమెను సంప్రదించగా నటించేందుకు ఎగై్జట్‌గా ఉన్నారని సమాచారం. 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు శృతి. ఆ మధ్య తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేను పెళ్లి చేసుకోనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌కి ‘బ్రేకప్’ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో శృతీహాసన్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. -
బ్రేకప్‌కి కారణం అదేనా?
‘‘జీవితం మనల్ని భూమి మీద చెరోవైపు ఉంచింది. అందుకే ఇకపై విడిగా నడవాలేమో?’’ అంటూ తమ బ్రేకప్ను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రెండు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తమ బంధానికి ఇరువురు ఇష్టప్రకారమే వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ బ్రేకప్‌కి కారణం ఇదే అంటూ తమిళనాడులో ఓ వార్త తిరుగుతోంది. దాని సారాంశం ఏంటంటే ... మైఖేల్ కోర్సలే నిర్లక్ష్యమే ఈ బ్రేకప్‌కి ప్రధాన కారణమట. లండన్‌లోని థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్. ఇప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడకుండా తల్లిదండ్రులపైనే ఆధారపడ్డాడట అతను. నీ వైఖరిని మార్చుకోవాలి, నీ అంతట నువ్వు నిలబడాలి, సొంతంగా ఏదైనా చేయమంటూ శ్రుతీ చాలాసార్లు మైఖేల్‌కు చెప్ప డం జరిగిందట. కానీ శ్రుతీహాసన్ చెప్పిన మాటలను మైఖేల్ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఇది శ్రుతీకి కష్టంగా అనిపించిందట. జంటగా తడబడుతూ నడిచే బదులు, విడివిడిగా సవ్యంగా నడు ద్దాం అని భావించి ఇష్టప్రకారమే ఈ రిలేషన్‌షిప్‌కు బై బై చెప్పారట. -
కష్టపడు.. లేకపోతే ఇంటికెళ్లిపో!
‘హాయ్.. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తా’ అంటూ ట్వీటర్లో తనను ఫాలో అవుతున్నవాళ్లకు మంచి చాన్స్ ఇచ్చారు శ్రుతీహాసన్. అంతే.. ఆమెకు ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చాయి. వాటిలో ఆసక్తికరమైన కొన్ని ప్రశ్నలు–జవాబులు. ► చెన్నైలో మీకు ఇష్టమైన ప్లేస్? మా నాన్న అండ్ పియానో ఎక్కడుంటే అది నాకు ఇష్టమైన ప్లేస్. ► మీరు ఏ వస్తువు లేకపోతే జీవించలేరు? ఫోన్. ► మిమ్మల్ని బాగా విమర్శించేవారు ఎవరు? నేనే. ► మీకు నేను (ఫ్యాన్) ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? నో.. ఐ యామ్ సారీ అని చెప్తాను. ► ట్రెడిషనల్ ఆర్ మోడ్రన్ డ్యాన్స్. వీటిలో ఏది ఇష్టం? రెండూ ఇష్టం. ► మీ నాన్నగారు స్థాపించిన పార్టీలో చేరి ప్రజా సేవ చేస్తారా? నా జ్ఞానం, నా అనుభవం సమాజంలో పాజిటివ్ చేంజ్ తీసుకురాగలదు అని నేను నమ్మినప్పుడు తప్పకుండా వస్తా. ► మీరు నటించే నెక్ట్స్ బాలీవుడ్ మూవీ టైటిల్ ఏంటి? ఇంకా డిసైడ్ కాలేదు. ► ఏ వస్తువు తయారు చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు? గన్స్. ► క్లాసులు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారా? అవును. ► ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? పెయింటింగ్ అండ్ రీడింగ్. ► మీ మోటివేషన్ లైన్ ఏంటీ? కష్టపడు. లేకపోతే ఇంటికెళ్లిపో. ► ప్రపంచంలోనే ఏదైనా చేంజ్ చేయగల శక్తి మీకు వస్తే ఏం చేస్తారు? మహిళలు, చిన్నారులకు హాని చేయాలనుకునే వారి మైండ్‌సెట్‌ను మార్చేస్తా. ► మీరు బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు అందులోంచి బయటకు తీసుకొచ్చేదెవరు? నా చెల్లెలు అక్షరాహాసన్. ► మీ జీవితంలో అద్భుతమైన క్షణాలు? నా చెల్లి పుట్టినప్పుడు. ► ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు? మ్యుజిషియన్. ► లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్. దేన్ని ప్రిఫర్ చేస్తారు? లైఫ్‌లో నాకు అన్నీ అరేంజ్ చేయడానికి ఒక మనిషిని నేను ఏర్పాటు చేసుకోలేదు. అలాంటప్పుడు నేనెందుకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి. -
స్పెషల్ బర్త్‌డే
‘ఇవాళ నా బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే టూ మీ...’ అంటూ తనకూ తానే విషెష్ చెప్పుకుంటూ ప్రతీ సంవత్సరం సరదాగా తన ఆత్మీయులతో కలిసి బర్త్‌డే పార్టీలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రుతీహాసన్. 2016లో తండ్రి కమల్‌హాసన్‌తో చెన్నైలో తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. గతేడాది తన క్లోజ్ ఫ్రెండ్స్, హీరోయిన్ తమన్నాతో కలిసి జరుపుకున్నారు. మరి ఈ ఏడాది శ్రుతీహాసన్ బర్త్‌డేను ఎక్కడ? ఎవరితో జరుపుకుంటారో అని ఔత్సాహికరాయుళ్లు ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తికి కారణం మైఖేల్ కోర్సెల్. లండన్‌కి చెందిన ఈ థియేటర్ ఆర్టిస్ట్‌తో శ్రుతి లవ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ ‘నా మనసులో మైఖేల్‌కి స్పెషల్ ప్లేస్ ఉంది’ అని మాత్రం అన్నారు. ఈసారి ఈ స్పెషల్ మేన్తోనే శ్రుతి తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారట. అందుకే తన పాత స్నేహితులు కొంతమంది, మైఖేల్‌తో కలిసి ఆమె లాస్ ఏంజెల్స్ వెళ్లారని సమాచారం. శ్రుతి ఫ్యాన్స్ ఆల్రెడీ ట్విట్టర్, ఫేస్బుక్లో అడ్వాన్స్ విషెస్‌తో సందడి చేస్తున్నారు. ‘‘నా బర్త్‌డేకు మెసేజ్‌ల వర్షం కురిపిస్తున్న అభిమానులందరికీ చాలా పెద్ద హగ్. ఈ ప్రేమాభిమానాలే మీరు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్’’ అని సోషల్ మీడియా ద్వారా శ్రుతి పేర్కొన్నారు. అన్నట్లు శ్రుతీహాసన్ బర్త్‌డే ఎప్పుడో చెప్పలేదు కదూ.. రేపే. -
స్క్రీన్ టెస్ట్
► ఈ సంవత్సరం (2018) విడుదలవ్వటానికి సిద్ధంగా ఉన్న ‘రజనీకాంత్’ సినిమాలెన్నో తెలుసా? ఎ) ఒకటి బి) రెండు సి) మూడు డి) నాలుగు ► ‘భరత్ అనే నేను’, ‘రంగస్థలం–1985’... ఈ రెండు చిత్రాలకు సంగీత దర్శకుడు ఒక్కరే? ఎవరై ఉంటారో కనుక్కోండి చూద్దాం? ఎ) అనిరుద్ బి) యస్.యస్. తమన్ సి) గోపీసుందర్ డి) దేవిశ్రీ ప్రసాద్ ► 2018 జనవరిలో ‘భాగమతి’ అనే సినిమా రిలీజు కానుంది. ఈ చిత్రంలో ‘ అనుష్క’ హీరోయిన్గా నటించింది? ఏ నిర్మాణ సంస్థ నిర్మించిందో తెలుసా? (ఎ) ఎ) యువీ క్రియేషన్స్ బి) గీతా ఆర్ట్స్ సి) వైజయంతి మూవీస్ డి) 14 రీల్స్ ► ఈ ‘సంక్రాంతి’కి వస్తున్న సినిమాలలో రెండు పెద్ద సినిమాలలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) రాయ్ లక్ష్మీ సి) కీర్తీ సురేశ్ డి) అనుపమాపరమేశ్వరన్ ► ‘స్కెచ్’ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరో విక్రమ్. హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సమంత బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) రెజీనా డి) తమన్నా ► ఆయనొక రైటర్. 2017లో మెగా ఫోన్ పట్టాడు. 2018లో దర్శకుడిగా తన మొదటి సినిమా రిలీజవుతుంది? ఎవరా రచయిత–దర్శకుడు? ఎ) విజయేంద్ర ప్రసాద్ బి) శివా నిర్వాణ సి) వక్కంతం వంశీ డి) ఐవీ ఆనంద్ ► 2018లో సాయిపల్లవి నటించే మొదటి సినిమాలో హీరో ఎవరో కనుక్కోండి ? ఎ) శర్వానంద్ బి) నాని సి) కల్యాణ్‌రామ్ డి) వరుణ్‌తేజ్ ► మంచు విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఈ నెలలో రిలీజవుతోంది. ఆయన ప్రక్కన ఫుల్ లెంగ్త్ పాత్ర చేసిన హాస్య నటుడెవరో తెలుసా? ఎ) పృథ్వీ బి) పోసాని కృష్ణమురళి సి) సప్తగిరి డి) బ్రహ్మానందం ► ఈ నెలలో షూటింగ్ ప్రారంభించనున్న బోయపాటి. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించనున్న హీరో ఎవరు? ఎ) బాలకృష్ణ బి) మహేశ్‌బాబు సి) రామ్‌చరణ్ డి) యన్టీఆర్ ► చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం ‘దిల్’ రాజుతో కలిసి ఓ అగ్రనిర్మాత ఓ సినిమా నిర్మించనున్నారు. ఎవరా నిర్మాత? చిన్న క్లూ (ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తారు. ఎ) బీవియస్‌యన్ ప్రసాద్ బి) చలసాని అశ్వనీదత్ సి) సురేశ్‌బాబు డి) కేయస్ రామారావు ► పాటల రచయిత కృష్ణ చైతన్య రెండోసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరో ఎవరు? ఎ) అల్లు శిరీష్ బి) నితిన్ సి) మంచు మనోజ్ డి) అఖిల్ ► ఈ క్రింద ఉన్న నాలుగు సినిమాలలో ఫిబ్రవరి 9న విడుదల కాని చిత్రం ఏంటో తెలుసా? ఎ) కిరాక్ పార్టీ బి) గాయత్రి సి) తొలిప్రేమ డి) ఛలో ► 2018లో రాబోతున్న పూరి జగన్నాథ్ సినిమా పేరు ‘మెహబుబా’. అందులో హీరో ఎవరు? సి) ఎ)సుమంత్ అశ్విన్ బి) శ్రీ విష్ణు సి) ఆకాష్ పూరి డి) అడవి శేష్ ► రవితేజ కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’లో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్‌సింగ్ బి) రాశీ ఖన్నా సి) శ్రుతీహాసన్ డి) మెహరీన్ ► 2018 ప్రథమార్ధంలో ద్విపాత్రాభినయం చేస్తున్న యంగ్ హీరో ఎవరు ? ఎ) నాగచైతన్య బి) రామ్ సి ) నాని డి) నిఖిల్ ► చిరంజీవి చేస్తున్న ‘సైరా’ నరసింహా రెడ్డి సినిమాలో నరసింహా రెడ్డికి ఎంత మంది భార్యలు? ఎ)ముగ్గురు బి) ఇద్దరు సి) ఒక్కరు డి) నలుగురు ► ఈ సంవత్సరం బాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు ఎవరు? ఎ) పూరీ జగన్నాద్ బి) వీవీ వినాయక్ సి) కృష్ణవంశీ డి) క్రిష్ ► విశాల్ హీరోగా నటిస్తున్న ‘అభిమన్యుడు’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) నయనతార బి) కాజల్ సి) తమన్నా డి) సమంత ► నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా వీరి కాంబినేషన్లో ఎన్నో చిత్రం? ఎ) 2 బి) 5 సి) 4 డి) 6 ► 2017లో ‘ఘాజీ’ సినిమా ద్వారా సంచలనం సృష్టించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తదుపరి సినిమాలో హీరో ఎవరు? ఎ) రాజ్ తరుణ్ బి) నాగ శౌర్య సి) వరుణ్ తేజ్ డి) విజయ్ దేవరకొండ సమాధానాలు 1.బి, 2.డి, 3.ఎ, 4.సి, 5.డి,6.సి, 7.ఎ, 8.డి, 9.సి, 10.బి,11.బి, 12.డి, 13.సి, 14.బి,15.ఎ, 16.ఎ, 17.డి, 18.డి, 19.సి, 20.సి -
బరువు పెరిగిన శ్రుతి
తమిళసినిమా: చక్కనమ్మ చిక్కినా అందమే.. అనేది నాటి మాట. ముద్దు గుమ్మ బొద్దుగా మారినా అందమే అనేది నేటి మాట. ఇంతకీ అసలు విషయమేమిటంటే కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా వెలుగుతున్న బ్యూటీ శ్రుతీహాసన్. అమ్మడు తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో బిజీబిజీగా నటిస్తూ చెక్కర్లు కొడుతోంది. సుందర్ సి రూపొందిస్తున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్రలో నటించడానికి సిద్ధమైన శ్రుతి అకస్మాత్తుగా అందులో నుంచి పక్కకు తప్పుకుంది. అయితే ఆ తర్వాత ఆమె కొత్తగా ఏ చిత్రానికి కమిట్ కాలేదు. ప్రస్తుతం శ్రుతి చేతిలో శభాష్ నాయుడు చిత్రం మాత్రమే ఉంది. గత కొంత కాలంగా చిత్ర షూటింగ్‌లు లేకపోవడంతో శ్రుతి మునుపటి వలే అందాలకు మెరుగులు దిద్దుకోకపోవడంతో భారీగా బరువు పెరిగిపోయింది. ఇటీవల ఒక దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రుతి బరువెక్కిన అందాలతో కాస్త బబ్లీగా కనిపించే ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. -
రీచార్జ్ అవుతున్నా!
తమిళసినిమా: కింద పడిపోయినా తాము పైనే ఉన్నాం అంటారు కొందరు హీరోయిన్లు. చేతిలో అవకాశాలు లేకపోయినా, ఆ భాషలో, ఈ భాషలో నటిస్తున్నాను అంటూ మార్కెట్ లేని విషయాన్ని అస్సలు అంగీకరించరు. ప్రస్తుతం నటి శ్రుతిహాసన్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇంతకు ముందు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక్దమ్ నటిస్తూ యమ బిజీగా ఉన్న నటి శ్రుతిహాసన్. అలాంటిది ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం లేదు. ఏదైనా ఉందంటే అది తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్నాయుడునే. అదీ మధ్యలోనే ఆగిపోయింది. శ్రుతీకి తన తండ్రితో కలిసి నటించడం కలిసి రాలేదా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో తలెత్తుతోంది. ఎందుకంటే అప్పటి వరకూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ తరువాత అంగీకరించిన భారీ చిత్రం సంఘమిత్ర అవకాశాన్ని కాలదన్నుకున్నారు. ఆ అంశం పెద్ద వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అంతే కాదు ఆ తరువాత ఒక్కటంటే ఒక్క అవకాశం శ్రుతిహాసన్‌ను పలకరించలేదు. అయితే ఈ విషయాన్ని ఆ ముద్దుగుమ్మ ఒప్పుకోవడం లేదు. తనకు అవకాశాలు రావడం లేదన్నది నిజం కాదని, చాలా అవకాశాలు వస్తున్నా, తానే నిరాకరిస్తున్నానని చెప్పుకొచ్చారు. కారణం ఏమిటన్న ప్రశ్నకు తానిప్పుడు రీచార్జ్ అవుతున్నానని మళ్లీ తన విజృంభణను చూస్తారని అంటున్నారు. ఏదేమైనా శ్రుతిహాసన్ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవచ్చు. అదే విధంగా హీరోల మార్కెట్నైనా అంచనా వేయవచ్చు గానీ, హీరోయిన్ల మార్కెట్ గురించి వెంటనే ఒక నిర్ణయానికి రాలేం. ఇవాళ అవకాశాలు లేకపోయినా రేపు బిజీ అయిపోవచ్చు. కాజల్‌అగర్వాల్, తమన్నా లాంటి హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను దాటి వచ్చిన వారే. -
కర్ణాటక పొగరులో...
కర్ణాటక సంగీతంలో... అని రాయబోయి పొరబాటున ‘పొగరు’ అని రాశారనుకుంటున్నారేమో! అక్కడ రాసింది... మీరు చదివింది... కరెక్టే. అది పొగరే! కర్ణాటక ప్రేక్షకులకు తన నటనలోని పొగరేంటో చూపించనున్నారు శ్రుతీహాసన్. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కనిపించిన శ్రుతి, త్వరలో కన్నడ సినిమాలోనూ కనిపించనున్నారు. ఆమె ఓ కన్నడ సినిమా అంగీకరించారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో ధ్రువ్ సరసన శ్రుతి నటించనున్నారు. ధ్రువ్ హీరోగా నటిస్తున్న ‘పొగరు’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్నట్లు చిత్రదర్శకుడు నందకిశోర్ తెలిపారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ నెల్లోనే శ్రుతి కూడా ఈ షూటింగులో పాల్గొంటారట!! -
చిన్న కారులో పెద్ద పాప
కమల్‌హాసన్ పెద్ద పాప శ్రుతీహాసన్‌ను చూశారా!? వయసులో పెద్దదవుతున్నా... మనసుకు నచ్చిన పనులు చేసే విషయంలో ఇంకా చిన్నపిల్లే అనుకోవాలేమో! ముఖ్యంగా ఎంజాయ్ చేసే విషయంలో. ఇప్పుడీ అమ్మాయి లండన్‌లో ఉన్నారు. సినిమా షూటింగ్ కోసం కాదు... సరదాగా ఎంజాయ్ చేయడం కోసం వెళ్లినట్టున్నారు. సోషల్ మీడియాలో శ్రుతీ పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇట్టే చెప్పేయొచ్చు. ఇన్సెట్లో ఫొటో ఉంది చూశారా... అందులో చిన్న కారు ఉంది కదా. లండన్ వీధుల్లో సరదాగా నడుస్తున్నప్పుడు అది శ్రుతీ కంట పడింది. చిన్నప్పుటి ఆటలు గుర్తొచ్చినట్టున్నాయి. వెంటనే కారులో కూర్చుని కెమెరా కంటికి ఓ ఫోజిచ్చారు. అదీ ‘చిన్న కారులో పెద్ద పాప’ మేటర్!! -
అజిత్‌తో మరోసారి..
తమిళసినిమా: అజిత్‌తో నటి శ్రుతీహాసన్ మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతోందా? సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో శ్రుతీహాసన్ ఒకరని చెప్పవచ్చు. తనకు తోచింది నిర్భయంగా చెప్పే మనస్తత్వం కలిగిన ఈ బ్యూటీ ఇటీవల సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి వార్తల్లో కెక్కింది. ప్రస్తుతం కెరీర్ పరంగా శ్రుతీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందని చెప్పవచ్చు. చేతిలో ఒక్క చిత్రం లేదు. తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు సగంలోనే ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు మొదలవుతుందో స్పష్టమైన సమాచారం లేదు. ఆ మధ్య విడుదలైన హిందీ చిత్రం చాలా నిరాశనే మిగిల్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నటుడు అజిత్ 58వ చిత్రంలో హీరోయిన్ అవకాశం శ్రుతీహాసన్ తలుపు తట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. అజిత్ వివేగం చిత్రాన్ని పూర్తి చేశారు. కాజల్‌అగర్వాల్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 10వ తేదీన విడుదలకు ముస్తాబవుతోందని సమాచారం. దీంతో అజిత్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నట్లు, ఈ చిత్రానికి వీరం, వేదాళం, వివేగం చిత్రాల దర్శకుడు శివనే దర్శకత్వం వహించనున్నారని, ఇందులో శ్రుతీహాసన్‌ను కథానాయికిగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రుతీహాసన్ ఇప్పటికే వేదాళం చిత్రంలో అజిత్‌కు జంటగా నటించిందన్నది గమనార్హం. అయితే అజిత్ తాజా చిత్రానికి సంబంధించిన అధికారకంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం., -
పార్టీలు... పబ్బులు... నాకిష్టం లేదండీ!
...అంటున్నారు శ్రుతీహాసన్. ఎందుకు? అని ఆమెను అడిగితే... పార్టీకి వెళితే షూటింగ్‌కి వెళ్లినట్టే అనిపిస్తుందట. ఇదెక్కడి విడ్డూరం? మాంచి మ్యూజిక్, మందు, చిందు... పార్టీల్లో ఇవేగా ఉండేది! మరి, శ్రుతి షూటింగ్ అంటున్నారేంటి? చాలామందికి సహజంగా వచ్చే డౌట్ ఇదే! దీన్నే శ్రుతీహాసన్ ముందుంచితే... ‘‘పార్టీలకు వెళితే అక్కడ ఎవరెవరో నాకు పరిచయం లేనోళ్లు, తెలీనోళ్లు కనిపిస్తారు. నెర్వస్‌గా ఉంటుందప్పుడు. లేని నవ్వును తెచ్చుకుని నటించాలి. అప్పుడక్కడ సరదా ఏముంటుంది? పైగా, అక్కడ కూడా నేను చేసే సినిమాల గురించే అడుగుతుంటారు. అందుకే, పార్టీలు... పబ్బులు... అంటే నాకు ఇష్టం ఉండదు’’ అన్నారు. ముంబయ్‌లో పబ్బులు, పార్టీ కల్చర్ ఎక్కువ! ప్రస్తుతం ముంబయ్‌లోనే ఉంటున్నారామె. పార్టీలకు దూరంగా అక్కడ ఎలా ఉంటున్నారు? ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? అని శ్రుతీని ప్రశ్నిస్తే... ‘‘షూటింగ్ షెడ్యూల్స్ మధ్య నాకు చాలా తక్కువ ఫ్రీ టైమ్ దొరుకుతోంది. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేస్తా. వాళ్లే నా రీ–చార్జ్ బ్యాటరీస్’’ అన్నారు. -
డిస్కౌంట్ సేల్‌లో కొంటా!
న్యూ ఇయర్ సేల్, సంక్రాంతి సేల్, ఉగాది సేల్, దీపావళి సేల్... ఇలా పండగల సమయంలో పెట్టే డిస్కౌంట్ సేల్స్‌కి చాలా డిమాండ్ ఉంటుంది. చాలామందిని ఈ ఆఫర్స్, సేల్స్ ఎట్రాక్ట్ చేస్తాయి. వారిలో శ్రుతీహాసన్ ఒకరు. కథానాయికగా కోట్లు సంపాదిస్తున్న శ్రుతీహాసన్ కూడా డిస్కౌంట్ సేల్స్‌పై మొగ్గుచూపుతారట. సేల్లోబ్రాండెడ్ దుస్తులు లేకపోయినా కొనుక్కుంటారట. ఆ మాటకొస్తే.. అసలు బ్రాండెడ్ దుస్తులనే శ్రుతి ప్రిఫర్ చేయరట. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘నాకు బ్రాండెడ్ దుస్తులు వేసుకోవడం ఇష్టం ఉండదు. అప్పుడప్పుడూ బ్రాండెడ్ డ్రెస్సుల్లో కనిపిస్తాను కదా. అవన్నీ నేను కొనుక్కున్నవి కాదు. గిఫ్ట్‌గా వచ్చినవే. అలాగే నేనెక్కువగా డిస్కౌంట్ సేల్స్‌లో బట్టలు కొంటుంటాను. రిచ్‌గా కనిపించడానికి బ్రాండెడ్ డ్రెస్సులే వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి కలర్ కాంబినేషన్, శరీరాకృతికి తగ్గ డ్రెస్ సెలక్ట్ చేసుకుంటే చాలు. మామూలు డ్రెస్సుల్లో కూడా గ్రాండ్‌గా కనిపించవచ్చు. నాకు నచ్చని డ్రెస్‌లు ఎంత ఫ్యాషన్‌గా ఉన్నా, భారీ రేటు ఉన్నా, ఏ బ్రాండ్ అయినా వేసుకోను. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని ఫ్రెండ్స్ చెప్పినా నాకు నచ్చినట్టే, సౌకర్యంగా అనిపించే దుస్తులే ధరిస్తా’’ అని చెబుతున్నారు శ్రుతీహాసన్. -
శ్రుతీని మేమే వద్దనుకున్నాం!
‘‘కాల్షీట్స్లో క్లారిటీ లేదు. బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదు... అందుకే ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్ నుంచి తప్పకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ స్టెట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్. సి. దర్శకత్వంలో తేనాండాళ్ ఫిల్మ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని శ్రుతి వ్యాఖ్యలు చేసి, దాదాపు నెల అయ్యింది. ఆ వార్తలపై ఇప్పుడు సంస్థ సీఈఓ హేమా రుక్మిణి స్పందించారు. ‘‘శ్రుతీహాసన్ తనంతట తను తప్పుకోలేదు. ఆమెతో కలిసి పని చేయలేం అని మేమే డిసైడ్ అయ్యాం. ఇది వృత్తిపరమైన నిర్ణయం. శ్రుతీహాసన్ స్థానంలో ఎవర్ని తీసుకోబోతున్నాం అన్నది త్వరలో తెలియజేస్తాం’’ అని హేమా రుక్మిణి అన్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ అందజేయని కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు శ్రుతి ఆరోపించారు. కానీ, హేమ మాత్రం స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయ్యిందంటున్నారు. ‘‘కథ రెడీ అయ్యింది. స్క్రిప్ట్‌ను ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం వస్తే, షూటింగ్ టైమ్‌లో అది ఆటోమెటిక్‌గా జరుగుతుంది’’ అని స్పష్టం చేశారామె.శ్రుతీహాసన్ స్థానంలో నయనతార యాక్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘నయనతార అమేజింగ్ ఆర్టిస్ట్. ఇది వరకు నయనతో వర్క్ చేశాం. ‘సంఘమిత్ర’ లుక్ ఎలా ఉండాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. సంఘమిత్ర ఎవరన్నది త్వరలోనే చెబుతాం’’ అన్నారామె. మరి.. హేమా రుక్మిణి వ్యాఖ్యలకు శ్రుతి స్పందిస్తారా? వెయిట్ అండ్ సీ. -
మాటలు అనడం చాలా ఈజీ!
కమల్‌హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ కాబట్టి శ్రుతీహాసన్ బోలెడంత బిల్డప్ ఇస్తోందని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనికి కారణం ‘సంఘమిత్ర’ సినిమా. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడానికి శ్రుతి అంగీకరించడం, తప్పుకోవడం తెలిసిందే. ‘ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వకపోవడంవల్ల, డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నా’ అని శ్రుతీహాసన్ క్లారిటీ ఇచ్చినా కొంతమంది వినేట్లు లేరు. ఎంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం అంత పెద్ద సినిమాని కాదంటుందా? అని మాట్లాడుకుంటున్నారు. దీనికి శ్రుతి స్పందిస్తూ – ‘‘ఒకరి గురించి మాటలు అనడం చాలా ఈజీ. కానీ, నిజమేంటో తెలుసుకుని అంటే బాగుంటుంది. ఈ సినిమా కోసం రెండేళ్లు కేటాయించాల్సి వస్తుందని నేను తప్పుకున్నానని కొందరి అభిప్రాయం. అది నిజం కాదు. నాక్కావల్సింది స్క్రిప్ట్, డేట్స్ విషయంలో క్లారిటీ. అవి తెలుసుకోవడం నా బాధ్యత. దాన్ని కూడా తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. క్లారిటీ లేకుండా ఎవరూ పని చేయలేరు కదా’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఈ సినిమా కోసం ఆరు నెలలు కత్తి యుద్ధం నేర్చుకున్నారామె. ‘‘అదేం వేస్ట్ కాదు. నేర్చుకున్న కళను వేరే సినిమాకి ఉపయోగిస్తా’’ అని శ్రుతి అన్నారు. -
నా ఫేస్.. నా ఇష్టం
‘‘నా బాడీ నా ఇష్టం. ఎవరెవరో చేసిన కామెంట్స్‌కు నేనెందుకు సమాధానం చెప్పాలి?’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ కూసింత ఎరుపెక్కిన కళ్లతో చెప్పారామె. ఈ కోపానికి కారణం ఏంటంటే... శ్రుతీహాసన్ పెదాలకు సర్జరీ (లిప్ జాబ్) చేయించుకున్నారని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు నిజమేనా? అని శ్రుతీని అడిగితే... ‘‘ఇది నా ఫేస్, నా బాడీ. వీటితో నేను ఏం చేస్తున్నాననేది ఎవరికీ సంబంధించినది కాదు. సోషల్ మీడియాలో జనాలు రాసే రాతల పట్ల నేను చింతించను. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందంగా కనిపించడం మా వృత్తి. మేమూ మనుషులమే. బరువు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసే ఫిగర్ మెయిన్టైన్ చేయడం కష్టం’’ అని పేర్కొన్నారు. -
పెళ్లికి ముందే తల్లవుతా!
లవ్‌లో పడితే లవ్ మ్యారేజ్.. పడకపోతే అమ్మానాన్న చూసిన అబ్బాయితో మ్యారేజ్ అంటుంటారు శ్రుతీహాసన్. ఇంతకీ పెళ్లెప్పుడు? అంటే ‘అది మాత్రం నా చేతుల్లో లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడే’ అంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో శ్రుతి సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారమవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ‘‘ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచించడంలేదు. అదే సరైన అబ్బాయి దొరికితే పెళ్లికి ముందే తల్లవడానికి నాకభ్యంతరం లేదు’’ అన్నారట. సూటిగా సుత్తి లేకుండా శ్రుతి చేసిన ఈ వ్యాఖ్యల గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకుంటున్నారు. మరీ ఇంత ఓపెన్‌గా మాట్లాడేస్తే ఎలా? అని కొందరు అంటుంటే.. స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా మాట్లాడితే తప్పేంటి? అని మరికొందరు అంటున్నారు. అన్నట్లు కమల్‌హాసన్, సారికలు కూడా శ్రుతీహాసన్ పుట్టిన తర్వాతే పెళ్లాడారు. సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? -
నా స్వేచ్ఛకు అడ్డొస్తే కట్ చేస్తా!
నటుడుగా కమలహాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమి ఉండదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వారసురాళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నటి శ్రుతీహాసన్ గురించి చెప్పేతీరాలి. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసి తీరే మనస్తత్వం శ్రుతిది. అదే విధంగా తన భావాలను నిర్భయంగా వెల్లడించడానికి ఏమాత్రం సంకోచించని వ్యక్తిత్వం ఈ బ్యూటీది. ఐరెన్ లెగ్ ముద్ర నుంచి గోల్డెన్ లెగ్‌లా ఎదిగిన శ్రుతీహాసన్ ఇప్పుడు బహుభాషా నటి. అంతే కాదు నటి, గాయని, సంగీతదర్శకురాలు అంటూ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి నటి గురించి వ్యక్తిగతంగా పలు వదంతులు ప్రచారంలో ఉండడం గమనార్హం. ఆ మధ్య నటుడు సిద్ధార్థ్ తదితర నటులతో షికార్లు, ఆ తరువాత మనస్పర్థలు అంటూ పుకార్లు హల్చల్చేశాయి. తాజాగా లండన్‌కు చెందిన మైఖెల్కోర్ సెల్‌తో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం జోరందుకుంది. ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్‌గా రియాక్ట్ అయ్యే శ్రుతీ తన ప్రేమాయణం గురించి మాత్రం గుంబనంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో తనతో సంబంధాలు ఉన్నవారిని పక్కన పెట్టడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ తన స్వేచ్ఛకుగానీ, వ్యక్తిగత విషయాల్లో గానీ ఎవరూ జోక్యం చేసుకోకూడదని తాను భావిస్తానన్నారు. అలా చేస్తే వారెవరైనా, ఎంతటి వారైనా తన జీవితంలో నుంచి తొలగించేస్తానని క్లియర్ కట్‌గా చెప్పేశారు. అయితే తాజా బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్ గురించి మాత్రం శ్రుతీహాసన్ ప్రస్తావించకపోవడం గమనార్హం.