పెళ్లికి ముందే తల్లవుతా! | Shruti Haasan Controversial Comments | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందే తల్లవుతా!

Published Thu, May 25 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

పెళ్లికి ముందే తల్లవుతా!

పెళ్లికి ముందే తల్లవుతా!

లవ్‌లో పడితే లవ్‌ మ్యారేజ్‌.. పడకపోతే అమ్మానాన్న చూసిన అబ్బాయితో మ్యారేజ్‌ అంటుంటారు శ్రుతీహాసన్‌. ఇంతకీ పెళ్లెప్పుడు? అంటే ‘అది మాత్రం నా చేతుల్లో లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడే’ అంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో శ్రుతి సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారమవుతోంది.

ఆ ఇంటర్వ్యూలో ‘‘ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచించడంలేదు. అదే సరైన అబ్బాయి దొరికితే పెళ్లికి ముందే తల్లవడానికి నాకభ్యంతరం లేదు’’ అన్నారట. సూటిగా సుత్తి లేకుండా శ్రుతి చేసిన ఈ వ్యాఖ్యల గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకుంటున్నారు. మరీ ఇంత ఓపెన్‌గా మాట్లాడేస్తే ఎలా? అని కొందరు అంటుంటే.. స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌గా మాట్లాడితే తప్పేంటి? అని మరికొందరు అంటున్నారు. అన్నట్లు కమల్‌హాసన్, సారికలు కూడా శ్రుతీహాసన్‌ పుట్టిన తర్వాతే పెళ్లాడారు. సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement