చిన్న కారులో పెద్ద పాప | Shruti Hassan Enjoying Holidays In London | Sakshi
Sakshi News home page

చిన్న కారులో పెద్ద పాప

Published Wed, Aug 30 2017 12:56 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

చిన్న కారులో పెద్ద పాప - Sakshi

చిన్న కారులో పెద్ద పాప

కమల్‌హాసన్‌ పెద్ద పాప శ్రుతీహాసన్‌ను చూశారా!? వయసులో పెద్దదవుతున్నా... మనసుకు నచ్చిన పనులు చేసే విషయంలో ఇంకా చిన్నపిల్లే అనుకోవాలేమో! ముఖ్యంగా ఎంజాయ్‌ చేసే విషయంలో. ఇప్పుడీ అమ్మాయి లండన్‌లో ఉన్నారు. సినిమా షూటింగ్‌ కోసం కాదు... సరదాగా ఎంజాయ్‌ చేయడం కోసం వెళ్లినట్టున్నారు.

సోషల్‌ మీడియాలో శ్రుతీ పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు చూస్తే ఎంత ఎంజాయ్‌ చేస్తున్నారో ఇట్టే చెప్పేయొచ్చు. ఇన్‌సెట్‌లో ఫొటో ఉంది చూశారా... అందులో చిన్న కారు ఉంది కదా. లండన్‌ వీధుల్లో సరదాగా నడుస్తున్నప్పుడు అది శ్రుతీ కంట పడింది. చిన్నప్పుటి ఆటలు గుర్తొచ్చినట్టున్నాయి. వెంటనే కారులో కూర్చుని కెమెరా కంటికి ఓ ఫోజిచ్చారు. అదీ ‘చిన్న కారులో పెద్ద పాప’ మేటర్‌!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement