Small Car
-
బజాజ్ ‘క్యూటీ’ కమింగ్ : చిన్నకార్లకు దెబ్బే
సాక్షి, ముంబై: ఎంట్రీ లెవల్ కారుకోసం ఎదురు చూస్తున్న భారత వినియోగదారులకు శుభవార్త. వాణిజ్య అవసరాలకే వాడుతున్న క్వాడ్రిక్ సైకిళ్లను ఇకపై వ్యక్తిగత అవసరాలకు కూడా వినియోగించుకో వచ్చని నవంబరు 20న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఈ నేపథ్యంలో టాటా నానో కారు తరహాలో ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన చిన్నకారును ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెటేందుకు సిద్ధమవుతోంది. ‘క్యూటీ’ పేరుతో క్వాడ్రిక్ సైకిల్‌ను ఫిబ్రవరి 2019లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. బజాజ్ క్యూటీ ధర సుమారు రూ.2.60లక్షల నుంచి రూ.3లక్షల వరకూ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను తక్కువ వెలువరిస్తుందట. లీటరు కు 30కి.మీ. పైనే మేలేజీ, గంటకు 70కి.మీ. వేగంతో ప్రయాణించగలదని అంచనా. భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నగరాలకు ఈ క్యూటీ అనువుగా ఉండనుంది. ప్రస్తుతం క్యూటీని కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రభుత్వం వ్యక్తిగత అవకాశాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చంటూ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణ వాహన రంగంలో పెను మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో టాటా మోటార్స్, ఎం అండ్ ఎండ్ మరో రెండు సంవత్సరాల్లో తమ సరికొత్త వాహనాలను లాంచ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అలాగే మారుతి, హ్యుందాయ్ తమ వ్యూహాలను మార్చుకొని అతి తక్కువ ధరలో ఎంట్రీ లెవల్ కార్లను లాంచ్ చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. పట్టణాల్లో ప్రయాణాలకు క్యూటీ చక్కగా సరిపోతుంది. ద్విచక్రవాహనంతో పోలిస్తే, భద్రత విషయంలోనూ మంచి ప్రమాణాలను పాటించాం. టూ-వీలర్‌కు ఎంతైతే నిర్వహణ ఖర్చు అవుతుందో దీనికి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంతేకాదు, అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను సైతం తక్కువగా వెలువరిస్తుందని వెల్లవడించారు. కాగా యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో క్వాడ్రిక్ సైకిల్ విక్రయిస్తున్న బజాజ్ ఆటోక్యూటీని తొలిసారి 2012లో ఆవిష్కరించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రోడ్డువాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి భారత్‌లో అనుమతి లభించలేదు. -
చిన్న కారులో పెద్ద పాప
కమల్‌హాసన్ పెద్ద పాప శ్రుతీహాసన్‌ను చూశారా!? వయసులో పెద్దదవుతున్నా... మనసుకు నచ్చిన పనులు చేసే విషయంలో ఇంకా చిన్నపిల్లే అనుకోవాలేమో! ముఖ్యంగా ఎంజాయ్ చేసే విషయంలో. ఇప్పుడీ అమ్మాయి లండన్‌లో ఉన్నారు. సినిమా షూటింగ్ కోసం కాదు... సరదాగా ఎంజాయ్ చేయడం కోసం వెళ్లినట్టున్నారు. సోషల్ మీడియాలో శ్రుతీ పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇట్టే చెప్పేయొచ్చు. ఇన్సెట్లో ఫొటో ఉంది చూశారా... అందులో చిన్న కారు ఉంది కదా. లండన్ వీధుల్లో సరదాగా నడుస్తున్నప్పుడు అది శ్రుతీ కంట పడింది. చిన్నప్పుటి ఆటలు గుర్తొచ్చినట్టున్నాయి. వెంటనే కారులో కూర్చుని కెమెరా కంటికి ఓ ఫోజిచ్చారు. అదీ ‘చిన్న కారులో పెద్ద పాప’ మేటర్!! -
నిస్సాన్ డాట్సన్ రెడి-గో వచ్చేసింది
♦ ధర రూ.2.38-3.34 లక్షల రేంజ్లో ♦ 25.17 కి.మీ. మైలేజీ న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో కొత్త చిన్న కారు మోడల్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ రెడి-గో పేరుతో అందిస్తున్న ఈ పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్లో నిర్ణయించామని నిస్సాన్ ఇండియా కంపెనీ తెలిపింది. డాట్సన్ రెడి గో కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నామని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర చెప్పారు. చిన్న కారు అంటే భారత్‌లో ఉన్న అంచనాలను ఈ డాట్సన్ గో మార్చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం నుంచే విక్రయాలు ప్రారంభించామని తెలిపారు. ధరల పోరు షురూ! రెడీ గో రాకతో ఎంట్రీ-లెవల్ సెగ్మంట్లో ధరల యుద్ధానికి తెర లేవనున్నదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ కారు మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులంటున్నారు. ఈ కార్ల ధరలు రూ.2.5 లక్షల నుంచి రూ4.42 లక్షల రేంజ్లో ఉన్నాయి. మూడో డాట్సన్ కారు: డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని, వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని అరుణ్ పేర్కొన్నారు. -
డాట్సన్ బుల్లి కారు వచ్చేసింది..
న్యూఢిల్లీ : ప్రారంభ ధరపై వారాల తరబడి ఊహాగానాల అనంతరం డాట్సన్ బుల్లి కారు రెడి-గో మార్కెట్లోకి వచ్చేసింది. బేస్ మోడల్ ధర రూ.2.39లక్షలుగా నిర్ణయిస్తూ రెడి-గోను జపాన్ కార్ మేకర్ డాట్సన్ మంగళవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఐదు వివిధ వేరియంట్లలో ఈ మోడల్ ను తీసుకొచ్చింది. టాప్ మోడల్ ధర రూ.3.34లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీలో) వరకూ ఉండనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అయితే భారత మార్కెట్ ను అంటిపెట్టుకోవడంలో డాట్సన్ గో, గో ప్లస్ మోడల్ లు విఫలమవడంతో, మూడో సారి ఈ మోడల్ తో తన అదృష్టాన్ని ఈ కంపెనీ పరీక్షించుకోనుంది. రెనాల్ట్ కజిన్ క్విడ్ మాదిరిగానే క్యూసీఎంఎఫ్-ఏ ఫ్లాట్ ఫాం పై దీన్ని తయారుచేశారు. క్విడ్ స్కేటింగ్ ఎస్ యూవీ వైఖరికి భిన్నంగా టాల్-బాయ్ డిజైన్ ను ఈ బుల్లికారు కలిగిఉంది. అయితే క్విడ్ 799 సీసీ మూడు సిలిండర్ల యూనిట్ నే రెడి-గో కూడా కలిగి ఉండనుంది. పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, ఆకు ఆకారంలో హెడ్ లైట్స్ రెడి-గోకు ప్రత్యేక ఆకర్షణ. 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్సిమిషన్, పీక్ పవర్ 54పీసీ, మ్యాక్సిమమ్ టార్క్ 72 ఎన్ఎమ్ తో పాటు ఇంధన సామర్థ్యం 25కేఎంపీఎల్ ను రెడి-గో కలిగి ఉంటుందని డాట్సన్ హామీ ఇచ్చింది. ఐదు విభిన్న రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉండనుంది. డాట్సన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ చిన్న కారు బుకింగ్ లు గత నెల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ కారు మార్కెట్లోకి కంపెనీ ఆవిష్కరించడంతో వెంటనే డెలవరీ కూడా ప్రారంభం కాబోతుందని మార్కెట్ వర్గాల సమాచారం. ఎక్స్ షోరూం ఢిల్లీ లో రెడి-గో వేరియంట్ ధరలు... డీ వేరియంట్ - రూ.2.39 లక్షలు ఏ వేరియంట్ - రూ.2.82 లక్షలు టీ వేరియంట్ - రూ.3.09 లక్షలు టీ(ఓ) వేరియంట్ - రూ. 3.19లక్షలు ఎస్ వేరియంట్ - రూ.3.34 లక్షలు -
బుల్లి షి‘కారు’...
తిక్క లెక్క బుజ్జాయిల సైజుకు సరిపోయే ఈ బుల్లి కారులో షికారు చేస్తున్న ఈ సరదా బుల్లోడిని చిత్రంగా చూస్తున్నారా..? ఈ కారును తయారు చేసింది ఇతగాడే. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని కారల్టన్లో ఉండే ఈ కుర్ర ఇంజనీరు పేరు ఆస్టిన్ కోల్సన్. కేవలం 63.5 సెంటీమీటర్ల ఎత్తు, 65.41 సెంటీమీటర్ల వెడల్పు, 126.47 సెంటీమీటర్ల పొడవు ఉండేలా ఈ కారును రూపొందించాడు. రోడ్ల మీద ఇది మామూలు కార్ల మాదిరిగానే ఇంచక్కా పరుగులు తీయగలదు. ప్రపంచంలోనే అతి బుల్లికారుగా ఇది గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది. -
ప్రీమియం చిన్న కార్లపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న కార్లలో ప్రీమియం సెగ్మెంట్‌పై టాటా మోటార్స్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రీమియం హాచ్బ్యాక్ సెగ్మెంట్లో విస్టా వీఎక్స్టెక్ను, నానో కార్ల విభాగంలో న్యూ నానో ట్విస్ట్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో టాటా మోటార్స్ నేషనల్ సేల్స్ హెడ్ ఆశిష్ ధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ 8 శాతం వాటాను కలిగి ఉందని, ఈ కొత్త మోడల్స్‌తో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతీ నెలా విస్టా 800 కార్ల అమ్మకాలతో హైదరాబాద్ అతిపెద్ద మార్కెట్‌గా ఉందని, తాజా కొత్త మోడల్‌తో ఈ అమ్మకాల సంఖ్య రెట్టింపు అవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. టచ్‌స్క్రీన్‌తో కూడిన మల్టీ మీడియా, జీపీఎస్ నావిగేషన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలు కలిగిన విస్టా వీఎక్స్ టెక్ ధరల శ్రేణి (హైదరాబాద్ ఎక్స్ షోరూం) రూ. 4.96 లక్షల నుంచి రూ. 6.11 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. న్యూ నానో ట్విస్ట్ ధర రూ. 2.46 లక్షలుగా ఉంది. అధిక మైలేజ్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ (ఈపీఏఎస్) వంటి ఫీచర్స్‌ను నానో ట్విస్ట్‌లో పొందుపర్చినట్లు ఆశిష్ తెలిపారు. -
మంచం కింద మొసలి
జింబాబ్వేకు చెందిన 40 ఏళ్ల విట్టాల్ పొద్దున నిద్రలేచేసరికి షాక్ తిన్నాడు.... తాను రాత్రంతా ఓ మొసలికి అడుగు దూరంలో పడుకున్నానని తెలిసి... ఇంతకీ విషయం ఏంటంటారా... నీళ్లలో ఉండాల్సిన మొసలి అనుకోకుండా విట్టాల్ ఉంటున్న ఇంట్లోకి వచ్చేసింది... ఏకంగా ఆయన బెడ్రూంలో మంచం కింద దూరి రాత్రంతా గడిపింది... మంచంపైన నిద్రపోయిన విట్టాల్ ఈ విషయాన్ని మాత్రం గమనించలేకపోయాడు. ఉదయం వంటమనిషి తన రూంలోంచి కేకలు వేయుడంతో ఆయనకు అసలు విషయం తెలిసింది. దీంతో 150 కేజీలు బరువు, ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని మంచం కింది నుంచి లాగి, సమీపంలోని చిగ్విడీ డ్యాంలో వదిలేశాడు. పొడవైన ‘పిల్లి’.. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న ఈ ‘పిల్లి’ పేరు హెర్క్యులస్. పొడవెంత ఉందో చూశారా? 10 అడుగులు! వాస్తవానికి ఇది లైగర్. ఇది కూడా పిల్లి జాతికి చెందినదే. ఆడ పులి, సింహానికి పుట్టినదన్నమాట. దీంతో పిల్లి జాతికి చెందిన వాటిలో అత్యంత పెద్ద జంతువుగా దీని పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిపోయింది. 418 కిలోల బరువున్న హెర్క్యులస్ అమెరికాలోని దక్షిణ కరోలినా సఫారీ పార్కులో ఉంటోంది. పొట్టి కారు... బొమ్మ కారు కాదు.. నిజమైన కారే. అందుకే ప్రపంచంలోనే అత్యంత చిన్న కారు(రోడ్డుపై ప్రయాణించే సామర్థ్యం కలది)గా ఇది గిన్నిస్ బుక్-2014లోకి దూసుకుపోయింది. 25 అంగుళాల ఎత్తు, 2 అడుగుల 1.75 అంగుళాల వెడల్పు, 4 అడుగుల 1.75 అంగుళాల పొడవున్న ఈ కారును తయారుచేసింది ఈయనే. పేరు ఆస్టిన్ కౌల్సన్ (అమెరికా).