డాట్సన్ బుల్లి కారు వచ్చేసింది.. | Datsun's new small car redi-GO launched at Rs 2.39 lakh | Sakshi
Sakshi News home page

డాట్సన్ బుల్లి కారు వచ్చేసింది..

Published Tue, Jun 7 2016 1:32 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

డాట్సన్ బుల్లి కారు వచ్చేసింది..

డాట్సన్ బుల్లి కారు వచ్చేసింది..

న్యూఢిల్లీ : ప్రారంభ ధరపై వారాల తరబడి ఊహాగానాల అనంతరం డాట్సన్ బుల్లి కారు రెడి-గో మార్కెట్లోకి వచ్చేసింది. బేస్ మోడల్ ధర రూ.2.39లక్షలుగా నిర్ణయిస్తూ రెడి-గోను జపాన్ కార్ మేకర్ డాట్సన్ మంగళవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఐదు వివిధ వేరియంట్లలో ఈ మోడల్ ను తీసుకొచ్చింది. టాప్ మోడల్ ధర రూ.3.34లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీలో) వరకూ ఉండనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అయితే భారత మార్కెట్ ను అంటిపెట్టుకోవడంలో డాట్సన్ గో, గో ప్లస్ మోడల్ లు విఫలమవడంతో, మూడో సారి ఈ మోడల్ తో తన అదృష్టాన్ని ఈ కంపెనీ పరీక్షించుకోనుంది.

రెనాల్ట్ కజిన్ క్విడ్ మాదిరిగానే క్యూసీఎంఎఫ్-ఏ ఫ్లాట్ ఫాం పై దీన్ని తయారుచేశారు. క్విడ్ స్కేటింగ్ ఎస్ యూవీ వైఖరికి భిన్నంగా టాల్-బాయ్ డిజైన్ ను ఈ బుల్లికారు కలిగిఉంది. అయితే క్విడ్ 799 సీసీ మూడు సిలిండర్ల యూనిట్ నే రెడి-గో కూడా కలిగి ఉండనుంది.  పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, ఆకు ఆకారంలో హెడ్ లైట్స్ రెడి-గోకు ప్రత్యేక ఆకర్షణ.  5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్సిమిషన్, పీక్ పవర్ 54పీసీ, మ్యాక్సిమమ్ టార్క్ 72 ఎన్ఎమ్ తో పాటు ఇంధన సామర్థ్యం 25కేఎంపీఎల్ ను రెడి-గో కలిగి ఉంటుందని డాట్సన్ హామీ ఇచ్చింది. ఐదు విభిన్న రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉండనుంది. డాట్సన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ చిన్న కారు బుకింగ్ లు గత నెల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ కారు మార్కెట్లోకి కంపెనీ ఆవిష్కరించడంతో వెంటనే డెలవరీ కూడా ప్రారంభం కాబోతుందని మార్కెట్ వర్గాల సమాచారం.

ఎక్స్ షోరూం ఢిల్లీ లో రెడి-గో వేరియంట్ ధరలు...
డీ వేరియంట్ - రూ.2.39 లక్షలు
ఏ వేరియంట్ - రూ.2.82 లక్షలు
టీ వేరియంట్ - రూ.3.09 లక్షలు
టీ(ఓ) వేరియంట్ - రూ. 3.19లక్షలు
ఎస్ వేరియంట్ - రూ.3.34 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement