redi-go
-
అమ్మకాల్లో దూసుకుపోతున్న 'చిన్నకారు'
న్యూఢిల్లీ: మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు పోటీగా జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో ప్రవేశపెట్టిన చిన్న కారు 'రెడి-గో' అమ్మకాల్లో దూసుకుపోతోంది. 23 రోజుల్లోనే 3 వేల కార్లు అమ్ముడయ్యాయి. జూన్ 7 నుంచి ప్రారంభమైన 'రెడి-గో' అమ్మకాలకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర తెలిపారు. 23 రోజుల్లో 3 వేల కార్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. వినియోగదారులకు పెద్ద సంఖ్యలో కార్లు డెలివరీ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 274 సేల్స్ అండ్ సర్వీసెస్ అవుట్‌లెట్స్ ద్వారా 'రెడి-గో' అమ్మకాలు సాగిస్తున్నామన్నారు. 'రెడి-గో' పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్లో నిర్ణయించారు. డాట్సన్ ఈ కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నారు. డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని, వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని నిస్సాన్ కంపెనీ తెలిపింది. -
డాట్సన్ బుల్లి కారు వచ్చేసింది..
న్యూఢిల్లీ : ప్రారంభ ధరపై వారాల తరబడి ఊహాగానాల అనంతరం డాట్సన్ బుల్లి కారు రెడి-గో మార్కెట్లోకి వచ్చేసింది. బేస్ మోడల్ ధర రూ.2.39లక్షలుగా నిర్ణయిస్తూ రెడి-గోను జపాన్ కార్ మేకర్ డాట్సన్ మంగళవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఐదు వివిధ వేరియంట్లలో ఈ మోడల్ ను తీసుకొచ్చింది. టాప్ మోడల్ ధర రూ.3.34లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీలో) వరకూ ఉండనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అయితే భారత మార్కెట్ ను అంటిపెట్టుకోవడంలో డాట్సన్ గో, గో ప్లస్ మోడల్ లు విఫలమవడంతో, మూడో సారి ఈ మోడల్ తో తన అదృష్టాన్ని ఈ కంపెనీ పరీక్షించుకోనుంది. రెనాల్ట్ కజిన్ క్విడ్ మాదిరిగానే క్యూసీఎంఎఫ్-ఏ ఫ్లాట్ ఫాం పై దీన్ని తయారుచేశారు. క్విడ్ స్కేటింగ్ ఎస్ యూవీ వైఖరికి భిన్నంగా టాల్-బాయ్ డిజైన్ ను ఈ బుల్లికారు కలిగిఉంది. అయితే క్విడ్ 799 సీసీ మూడు సిలిండర్ల యూనిట్ నే రెడి-గో కూడా కలిగి ఉండనుంది. పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, ఆకు ఆకారంలో హెడ్ లైట్స్ రెడి-గోకు ప్రత్యేక ఆకర్షణ. 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్సిమిషన్, పీక్ పవర్ 54పీసీ, మ్యాక్సిమమ్ టార్క్ 72 ఎన్ఎమ్ తో పాటు ఇంధన సామర్థ్యం 25కేఎంపీఎల్ ను రెడి-గో కలిగి ఉంటుందని డాట్సన్ హామీ ఇచ్చింది. ఐదు విభిన్న రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉండనుంది. డాట్సన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ చిన్న కారు బుకింగ్ లు గత నెల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ కారు మార్కెట్లోకి కంపెనీ ఆవిష్కరించడంతో వెంటనే డెలవరీ కూడా ప్రారంభం కాబోతుందని మార్కెట్ వర్గాల సమాచారం. ఎక్స్ షోరూం ఢిల్లీ లో రెడి-గో వేరియంట్ ధరలు... డీ వేరియంట్ - రూ.2.39 లక్షలు ఏ వేరియంట్ - రూ.2.82 లక్షలు టీ వేరియంట్ - రూ.3.09 లక్షలు టీ(ఓ) వేరియంట్ - రూ. 3.19లక్షలు ఎస్ వేరియంట్ - రూ.3.34 లక్షలు -
ఊరిస్తున్న నిస్సాన్ కాంపాక్ట్ కారు
న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం నిస్పాన్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్ లో తన మూడవ మోడల్ కారుని లాంచ్ చేసింది. 2014, 15 సం.రాల్లో గో, గో ప్లస్ రెండు కార్లను లాంచ్ చేసిన నిస్పాన్ తాజాగా డాట్సన్ బ్రాండ్ కింద ఓ కొత్తకారును ఆవిష్కరించింది. చిరు ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా ఈ కాంపాక్ట్ కార్ తో వినియోగదారులను ఊరించేందుకు రడీ అవుతోంది. మారుతి ఆల్టో, హుందాయ్ ఇయాన్ లాంటి చిన్న కార్లకు పోటీగా ఈ ఏడాది జూన్ కల్లా మార్కెట్లలో హల్ చల్ చేయనుంది. రెడీ గో అనే పేరుతో వస్తున్న దీని ధరను అధికారికంగా ప్రకటించకపోయినప్నటికీ దీని ధర రూ.2.5 లక్షల నుంచి రూ.4.42 లక్షల(ఢిల్లీ ఎక్స్ షో రూం) వరకు ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మే నెలలో బుకింగ్ ప్రారంభిస్తామని కంపెనీ నిస్సాన్ ఎండీ అరుణ్ మల్హోత్రా వెల్లడించారు. జూన్ కల్లా దీన్ని వినియోగదారులకు తమ కారును డెలివరీ చేస్తామన్నారు. ఈ కార్లు కావాల్సిన వాళ్లు బుకింగ్ లు ప్రాంరభించవచ్చనీ ఈ మధ్యలో ధరని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ సీనియర్లు అంటున్నారు. మరోవైపు ఈ కార్లను కొనుక్కునేందుకు సామాన్య ప్రజానీకానికి రుణాలిచ్చే స్కీమ్ లను కూడా అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. కాగా గత ఏడాది గో ప్లస్ అనే కంపాక్ట్ అనే మల్టీ పర్పస్ కార్లను నిస్సాన్ , డాట్సన్ బ్రాండ్ తో లాంచ్ చేసింది. చిన్న చిన్ననగరాలను టార్గెట్ చేయడం ద్వారా తన కొనుగోళ్లను పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది. గత ఏడాది నిర్దేశించుకున్న 10 శాతం లక్ష్యాన్ని మిస్ అయిన నిస్సాన్, 2020 సం.రానికి కార్ల మార్కెట్ లో 5 శాతం వాటాను కొల్లగొట్టేందుకు ప్రణాళికలతో ముందు కెళుతోంది.