న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం నిస్పాన్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్ లో తన మూడవ మోడల్ కారుని లాంచ్ చేసింది. 2014, 15 సం.రాల్లో గో, గో ప్లస్ రెండు కార్లను లాంచ్ చేసిన నిస్పాన్ తాజాగా డాట్సన్ బ్రాండ్ కింద ఓ కొత్తకారును ఆవిష్కరించింది. చిరు ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా ఈ కాంపాక్ట్ కార్ తో వినియోగదారులను ఊరించేందుకు రడీ అవుతోంది. మారుతి ఆల్టో, హుందాయ్ ఇయాన్ లాంటి చిన్న కార్లకు పోటీగా ఈ ఏడాది జూన్ కల్లా మార్కెట్లలో హల్ చల్ చేయనుంది. రెడీ గో అనే పేరుతో వస్తున్న దీని ధరను అధికారికంగా ప్రకటించకపోయినప్నటికీ దీని ధర రూ.2.5 లక్షల నుంచి రూ.4.42 లక్షల(ఢిల్లీ ఎక్స్ షో రూం) వరకు ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
మే నెలలో బుకింగ్ ప్రారంభిస్తామని కంపెనీ నిస్సాన్ ఎండీ అరుణ్ మల్హోత్రా వెల్లడించారు. జూన్ కల్లా దీన్ని వినియోగదారులకు తమ కారును డెలివరీ చేస్తామన్నారు. ఈ కార్లు కావాల్సిన వాళ్లు బుకింగ్ లు ప్రాంరభించవచ్చనీ ఈ మధ్యలో ధరని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ సీనియర్లు అంటున్నారు. మరోవైపు ఈ కార్లను కొనుక్కునేందుకు సామాన్య ప్రజానీకానికి రుణాలిచ్చే స్కీమ్ లను కూడా అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.
కాగా గత ఏడాది గో ప్లస్ అనే కంపాక్ట్ అనే మల్టీ పర్పస్ కార్లను నిస్సాన్ , డాట్సన్ బ్రాండ్ తో లాంచ్ చేసింది. చిన్న చిన్ననగరాలను టార్గెట్ చేయడం ద్వారా తన కొనుగోళ్లను పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది. గత ఏడాది నిర్దేశించుకున్న 10 శాతం లక్ష్యాన్ని మిస్ అయిన నిస్సాన్, 2020 సం.రానికి కార్ల మార్కెట్ లో 5 శాతం వాటాను కొల్లగొట్టేందుకు ప్రణాళికలతో ముందు కెళుతోంది.
ఊరిస్తున్న నిస్సాన్ కాంపాక్ట్ కారు
Published Fri, Apr 15 2016 12:59 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM
Advertisement