‘హాయ్.. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తా’ అంటూ ట్వీటర్‌లో తనను ఫాలో అవుతున్నవాళ్లకు మంచి చాన్స్ ఇచ్చారు శ్రుతీహాసన్. అంతే.. ఆమెకు ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చాయి. వాటిలో ఆసక్తికరమైన కొన్ని ప్రశ్నలు–జవాబులు.
► చెన్నైలో మీకు ఇష్టమైన ప్లేస్?
మా నాన్న అండ్ పియానో ఎక్కడుంటే అది నాకు ఇష్టమైన ప్లేస్.
► మీరు ఏ వస్తువు లేకపోతే జీవించలేరు?
ఫోన్.
► మిమ్మల్ని బాగా విమర్శించేవారు ఎవరు?
నేనే.
► మీకు నేను (ఫ్యాన్) ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు?
నో.. ఐ యామ్ సారీ అని చెప్తాను.
► ట్రెడిషనల్ ఆర్ మోడ్రన్ డ్యాన్స్. వీటిలో ఏది ఇష్టం?
రెండూ ఇష్టం.
► మీ నాన్నగారు స్థాపించిన పార్టీలో చేరి ప్రజా సేవ చేస్తారా?
నా జ్ఞానం, నా అనుభవం సమాజంలో పాజిటివ్ చేంజ్ తీసుకురాగలదు అని నేను నమ్మినప్పుడు తప్పకుండా వస్తా.
► మీరు నటించే నెక్ట్స్ బాలీవుడ్ మూవీ టైటిల్ ఏంటి?
ఇంకా డిసైడ్ కాలేదు.
► ఏ వస్తువు తయారు చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు?
గన్స్.
► క్లాసులు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారా?
అవును.
► ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు?
పెయింటింగ్ అండ్ రీడింగ్.
► మీ మోటివేషన్ లైన్ ఏంటీ?
కష్టపడు. లేకపోతే ఇంటికెళ్లిపో.
► ప్రపంచంలోనే ఏదైనా చేంజ్ చేయగల శక్తి మీకు వస్తే ఏం చేస్తారు?
మహిళలు, చిన్నారులకు హాని చేయాలనుకునే వారి మైండ్‌సెట్‌ను మార్చేస్తా.
► మీరు బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు అందులోంచి బయటకు తీసుకొచ్చేదెవరు?
నా చెల్లెలు అక్షరాహాసన్.
► మీ జీవితంలో అద్భుతమైన క్షణాలు?
నా చెల్లి పుట్టినప్పుడు.
► ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు?
మ్యుజిషియన్.
► లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్. దేన్ని ప్రిఫర్ చేస్తారు?
లైఫ్‌లో నాకు అన్నీ అరేంజ్ చేయడానికి ఒక మనిషిని నేను ఏర్పాటు చేసుకోలేదు. అలాంటప్పుడు నేనెందుకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి.
కష్టపడు.. లేకపోతే ఇంటికెళ్లిపో!
Published Sun, Apr 29 2018 12:06 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment