బరువు పెరిగిన శ్రుతి | Shruti Haasan gained weight for her role | Sakshi
Sakshi News home page

బరువు పెరిగిన శ్రుతి

Published Tue, Oct 31 2017 5:13 AM | Last Updated on Tue, Oct 31 2017 5:13 AM

Shruti Haasan gained weight for her role

తమిళసినిమా: చక్కనమ్మ చిక్కినా అందమే.. అనేది నాటి మాట. ముద్దు గుమ్మ బొద్దుగా మారినా అందమే అనేది నేటి మాట. ఇంతకీ అసలు విషయమేమిటంటే కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతున్న బ్యూటీ శ్రుతీహాసన్‌. అమ్మడు తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో బిజీబిజీగా నటిస్తూ చెక్కర్లు కొడుతోంది. సుందర్‌ సి రూపొందిస్తున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్రలో నటించడానికి సిద్ధమైన శ్రుతి అకస్మాత్తుగా అందులో నుంచి పక్కకు తప్పుకుంది.

అయితే ఆ తర్వాత ఆమె కొత్తగా ఏ చిత్రానికి కమిట్‌ కాలేదు. ప్రస్తుతం శ్రుతి చేతిలో శభాష్‌ నాయుడు చిత్రం మాత్రమే ఉంది. గత కొంత కాలంగా చిత్ర షూటింగ్‌లు లేకపోవడంతో శ్రుతి మునుపటి వలే అందాలకు మెరుగులు దిద్దుకోకపోవడంతో భారీగా బరువు పెరిగిపోయింది. ఇటీవల  ఒక దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రుతి బరువెక్కిన అందాలతో కాస్త బబ్లీగా కనిపించే ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement