![Shruti Haasan To Star In The American TV Series Treadstone - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/24/shruti-haasan.jpg.webp?itok=sZybgFEj)
శ్రుతీహాసన్
స్టంట్స్ చేయడానికి శిక్షణ పూర్తి చేసుకున్నారు శ్రుతీహాసన్. ఇక వాటిని స్క్రీన్ మీద చూపించడమే ఆలస్యం అంటున్నారామె. ‘ట్రెడ్‌స్టోన్’ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో యాక్ట్ చేయనున్నారు శ్రుతీ. తన పాత్రకు సంబంధించి చాలా యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుందట. దానికోసం కొంత కాలంగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ పూర్తికావడంతో షూటింగ్‌కు రెడీ అయ్యారు. ‘‘చాలా ఏళ్ల తర్వాత నాలో శక్తిని మళ్లీ బయటకు తీసుకు వచ్చారు నా ట్రైనర్ జిల్వీ. తనతో ట్రైనింగ్ చాలా సరదాగా సాగింది’’ అని పేర్కొన్నారు శ్రుతీ. ఈ షూటింగ్‌లో జాయిన్ అవడానికి తైవాన్ వెళ్లారు శ్రుతీ. ఈ సిరీస్‌లో పగలంతా వెయిట్రెస్‌గా పని చేస్తూ రాత్రి హత్యలు చేసే వ్యక్తి పాత్రలో శ్రుతీ కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment