‘‘డల్లాస్‌లోని అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడి వారు చూపించిన ప్రేమాభిమానాలతో మాటలు కూడా రావటం లేదు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నామా? లేక డల్లాస్ వచ్చామా? అని కూడా అర్థం కావటం లేదు. నాపై ప్రేమతో ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇంyì యన్ మూవీ ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు.
అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రామ్ చరణ్, ‘దిల్’ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ–‘‘ఓవర్‌సీస్‌లోని ప్రేక్షకులు ముందుగా సినిమాను చూస్తారు. అందుకే ఇక్కడి నుంచే ప్రమోషన్స్ ను మొదలు పెడుతున్నాం.
మా ‘గేమ్ చేంజర్’కు మీ ఆశీస్సులు కావాలి. ‘దిల్’ రాజు, శిరీష్‌గార్లకు కృతజ్ఞతలు. ఇంత పెద్ద ప్రీ రిలీజ్ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించిన రాజేష్ కల్లెపల్లి అండ్ టీమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ టైటిల్ పెట్టినప్పుడే సరికొత్తగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా డల్లాస్‌ను సెలక్ట్ చేసుకున్నాం. ఇంత భారీగా ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇక్కడ నిర్వహించటం ఇదే తొలిసారి. టైటిల్‌కి తగ్గట్టు ఈవెంట్‌ని ఘనంగా చేయాలని ఇక్కడ చేశాం. దానికి రాజేష్ కల్లెపల్లి ముందుకొచ్చి సపోర్ట్ చేశారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: కార్తీక్ సుబ్బరాజ్, సహ నిర్మాత: హర్షిత్, కెమెరా: ఎస్. తిరుణ్ణావుక్కరసు, సంగీతం: ఎస్‌ఎస్ తమన్, లైన్ ప్రోడ్యూసర్స్: నరసింహా రావు .ఎన్, ఎస్.కె. జబీర్.
Comments
Please login to add a commentAdd a comment