డిస్కౌంట్‌ సేల్‌లో కొంటా! | I do not like to wear branded clothes ... shruti hassan | Sakshi
Sakshi News home page

డిస్కౌంట్‌ సేల్‌లో కొంటా!

Published Wed, Jun 28 2017 12:13 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

డిస్కౌంట్‌ సేల్‌లో కొంటా! - Sakshi

డిస్కౌంట్‌ సేల్‌లో కొంటా!

న్యూ ఇయర్‌ సేల్, సంక్రాంతి సేల్, ఉగాది సేల్, దీపావళి సేల్‌... ఇలా పండగల సమయంలో పెట్టే డిస్కౌంట్‌ సేల్స్‌కి చాలా డిమాండ్‌ ఉంటుంది. చాలామందిని ఈ ఆఫర్స్, సేల్స్‌ ఎట్రాక్ట్‌ చేస్తాయి. వారిలో శ్రుతీహాసన్‌ ఒకరు. కథానాయికగా కోట్లు సంపాదిస్తున్న శ్రుతీహాసన్‌ కూడా డిస్కౌంట్‌ సేల్స్‌పై మొగ్గుచూపుతారట. సేల్‌లోబ్రాండెడ్‌ దుస్తులు లేకపోయినా కొనుక్కుంటారట. ఆ మాటకొస్తే.. అసలు బ్రాండెడ్‌ దుస్తులనే శ్రుతి ప్రిఫర్‌ చేయరట.

ఈ విషయం గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘నాకు బ్రాండెడ్‌ దుస్తులు వేసుకోవడం ఇష్టం ఉండదు. అప్పుడప్పుడూ బ్రాండెడ్‌ డ్రెస్సుల్లో కనిపిస్తాను కదా. అవన్నీ నేను కొనుక్కున్నవి కాదు. గిఫ్ట్‌గా వచ్చినవే. అలాగే నేనెక్కువగా డిస్కౌంట్‌ సేల్స్‌లో బట్టలు కొంటుంటాను. రిచ్‌గా కనిపించడానికి బ్రాండెడ్‌ డ్రెస్సులే వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి కలర్‌ కాంబినేషన్, శరీరాకృతికి తగ్గ డ్రెస్‌ సెలక్ట్‌ చేసుకుంటే చాలు. మామూలు డ్రెస్సుల్లో కూడా గ్రాండ్‌గా కనిపించవచ్చు. నాకు నచ్చని డ్రెస్‌లు ఎంత ఫ్యాషన్‌గా ఉన్నా, భారీ రేటు ఉన్నా, ఏ బ్రాండ్‌ అయినా వేసుకోను. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని ఫ్రెండ్స్‌ చెప్పినా నాకు నచ్చినట్టే, సౌకర్యంగా అనిపించే దుస్తులే ధరిస్తా’’ అని చెబుతున్నారు శ్రుతీహాసన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement