నా స్వేచ్ఛకు అడ్డొస్తే కట్ చేస్తా! | Shruthihasan latest interview | Sakshi
Sakshi News home page

నా స్వేచ్ఛకు అడ్డొస్తే కట్ చేస్తా!

Published Wed, May 3 2017 2:51 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

నా స్వేచ్ఛకు అడ్డొస్తే కట్ చేస్తా!

నా స్వేచ్ఛకు అడ్డొస్తే కట్ చేస్తా!

నటుడుగా కమలహాసన్‌ గురించి కొత్తగా చెప్పాల్సిందేమి ఉండదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వారసురాళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నటి శ్రుతీహాసన్‌ గురించి చెప్పేతీరాలి. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసి తీరే మనస్తత్వం శ్రుతిది.

అదే విధంగా తన భావాలను నిర్భయంగా వెల్లడించడానికి ఏమాత్రం సంకోచించని వ్యక్తిత్వం ఈ బ్యూటీది. ఐరెన్‌ లెగ్‌ ముద్ర నుంచి గోల్డెన్‌ లెగ్‌లా ఎదిగిన శ్రుతీహాసన్‌ ఇప్పుడు బహుభాషా నటి. అంతే కాదు నటి, గాయని, సంగీతదర్శకురాలు అంటూ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి నటి గురించి వ్యక్తిగతంగా పలు వదంతులు ప్రచారంలో ఉండడం గమనార్హం. ఆ మధ్య నటుడు సిద్ధార్థ్‌ తదితర నటులతో షికార్లు, ఆ తరువాత మనస్పర్థలు అంటూ పుకార్లు హల్‌చల్‌చేశాయి.

తాజాగా లండన్‌కు చెందిన మైఖెల్‌కోర్‌ సెల్‌తో చెట్టాపట్టాల్‌ అంటూ ప్రచారం జోరందుకుంది. ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్‌గా రియాక్ట్‌ అయ్యే శ్రుతీ తన ప్రేమాయణం గురించి మాత్రం గుంబనంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో తనతో సంబంధాలు ఉన్నవారిని పక్కన పెట్టడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ తన స్వేచ్ఛకుగానీ, వ్యక్తిగత విషయాల్లో గానీ ఎవరూ జోక్యం చేసుకోకూడదని తాను భావిస్తానన్నారు. అలా చేస్తే వారెవరైనా, ఎంతటి వారైనా తన జీవితంలో నుంచి తొలగించేస్తానని క్లియర్‌ కట్‌గా చెప్పేశారు. అయితే తాజా బాయ్‌ఫ్రెండ్‌ మైఖెల్‌ కోర్‌సెల్‌ గురించి మాత్రం శ్రుతీహాసన్‌ ప్రస్తావించకపోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement