Michael Corsell
-
స్పెషల్ బర్త్‌డే
‘ఇవాళ నా బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే టూ మీ...’ అంటూ తనకూ తానే విషెష్ చెప్పుకుంటూ ప్రతీ సంవత్సరం సరదాగా తన ఆత్మీయులతో కలిసి బర్త్‌డే పార్టీలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రుతీహాసన్. 2016లో తండ్రి కమల్‌హాసన్‌తో చెన్నైలో తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. గతేడాది తన క్లోజ్ ఫ్రెండ్స్, హీరోయిన్ తమన్నాతో కలిసి జరుపుకున్నారు. మరి ఈ ఏడాది శ్రుతీహాసన్ బర్త్‌డేను ఎక్కడ? ఎవరితో జరుపుకుంటారో అని ఔత్సాహికరాయుళ్లు ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తికి కారణం మైఖేల్ కోర్సెల్. లండన్‌కి చెందిన ఈ థియేటర్ ఆర్టిస్ట్‌తో శ్రుతి లవ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ ‘నా మనసులో మైఖేల్‌కి స్పెషల్ ప్లేస్ ఉంది’ అని మాత్రం అన్నారు. ఈసారి ఈ స్పెషల్ మేన్తోనే శ్రుతి తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారట. అందుకే తన పాత స్నేహితులు కొంతమంది, మైఖేల్‌తో కలిసి ఆమె లాస్ ఏంజెల్స్ వెళ్లారని సమాచారం. శ్రుతి ఫ్యాన్స్ ఆల్రెడీ ట్విట్టర్, ఫేస్బుక్లో అడ్వాన్స్ విషెస్‌తో సందడి చేస్తున్నారు. ‘‘నా బర్త్‌డేకు మెసేజ్‌ల వర్షం కురిపిస్తున్న అభిమానులందరికీ చాలా పెద్ద హగ్. ఈ ప్రేమాభిమానాలే మీరు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్’’ అని సోషల్ మీడియా ద్వారా శ్రుతి పేర్కొన్నారు. అన్నట్లు శ్రుతీహాసన్ బర్త్‌డే ఎప్పుడో చెప్పలేదు కదూ.. రేపే. -
ఇప్పట్లో పెళ్లి లేదు
లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లి, అనుష్కా శర్మ ఒక ఇంటివాళ్లయ్యారు. కన్నుల పండువగా ఈ జంట వివాహ వేడుక జరిగింది. ఇప్పుడు అందరి దృష్టీ మిగతా సెలబ్రిటీ లవ్ బర్డ్స్‌పై పడింది. దీపికా–రణవీర్‌సింగ్, శ్రుతీహాసన్–మైఖేల కోర్సెల్.. ఇలా కొన్ని జంటల గురించి మాట్లాడుకుంటున్నారు. విరాట్, అనుష్కల్లా వీళ్లు కూడా పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముందు పెళ్లి చేసుకోబోయేది శ్రుతి–మైఖేల్ అని కూడా చాలామంది ఫిక్స్ అయ్యారు. చెన్నైలో ఇటీవల జరిగిన నటుడు అధవ్ పెళ్లిలో శ్రుతి–మైఖేల్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది. లండన్ కుర్రాడు మైఖేల్ ఎంతో ఇష్టంగా తమిళ వేష్టీ (పంచె) కట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకోవడంతో కచ్చితంగా దేశీ అల్లుడు అవుతాడని ఊహిస్తున్నారు. పైగా వివాహ వేడుకలో కమల్‌హాసన్, శ్రుతి, మైఖేల్ వరుసగా కూర్చుని ఉండటంతో పెళ్లికి తండ్రి నుంచి కూతురికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనే సంకేతం అందింది. అటు తల్లి సారికకు కూడా సమ్మతమే అని, త్వరలో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటుందని చాలామంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ‘‘ఇప్పట్లో పెళ్లి లేదు’’ అని శ్రుతి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి.. మైఖేల్‌తో లవ్‌లో ఉన్నది నిజమేనా? అంటే.. శ్రుతి తన పర్సనల్ మేటర్స్ని ఎవరి దగ్గరా డిస్కస్ చేయరని, అయితే ప్రస్తుతానికి ఆమె దృష్టంతా సినిమాల పైనే ఉందని అంటున్నారు. మరి... శ్రుతి మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే లండన్ నుంచి మైఖేల్ ఇక్కడికి రావడం, అడపా దడపా శ్రుతి అక్కడికి వెళ్లడం, తమిళ సంప్రదాయాన్ని ఆచరించి, మైఖేల్ పంచె కట్టుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. -
నా స్వేచ్ఛకు అడ్డొస్తే కట్ చేస్తా!
నటుడుగా కమలహాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమి ఉండదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వారసురాళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నటి శ్రుతీహాసన్ గురించి చెప్పేతీరాలి. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసి తీరే మనస్తత్వం శ్రుతిది. అదే విధంగా తన భావాలను నిర్భయంగా వెల్లడించడానికి ఏమాత్రం సంకోచించని వ్యక్తిత్వం ఈ బ్యూటీది. ఐరెన్ లెగ్ ముద్ర నుంచి గోల్డెన్ లెగ్‌లా ఎదిగిన శ్రుతీహాసన్ ఇప్పుడు బహుభాషా నటి. అంతే కాదు నటి, గాయని, సంగీతదర్శకురాలు అంటూ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి నటి గురించి వ్యక్తిగతంగా పలు వదంతులు ప్రచారంలో ఉండడం గమనార్హం. ఆ మధ్య నటుడు సిద్ధార్థ్ తదితర నటులతో షికార్లు, ఆ తరువాత మనస్పర్థలు అంటూ పుకార్లు హల్చల్చేశాయి. తాజాగా లండన్‌కు చెందిన మైఖెల్కోర్ సెల్‌తో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం జోరందుకుంది. ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్‌గా రియాక్ట్ అయ్యే శ్రుతీ తన ప్రేమాయణం గురించి మాత్రం గుంబనంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో తనతో సంబంధాలు ఉన్నవారిని పక్కన పెట్టడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ తన స్వేచ్ఛకుగానీ, వ్యక్తిగత విషయాల్లో గానీ ఎవరూ జోక్యం చేసుకోకూడదని తాను భావిస్తానన్నారు. అలా చేస్తే వారెవరైనా, ఎంతటి వారైనా తన జీవితంలో నుంచి తొలగించేస్తానని క్లియర్ కట్‌గా చెప్పేశారు. అయితే తాజా బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్ గురించి మాత్రం శ్రుతీహాసన్ ప్రస్తావించకపోవడం గమనార్హం.