
లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లి, అనుష్కా శర్మ ఒక ఇంటివాళ్లయ్యారు. కన్నుల పండువగా ఈ జంట వివాహ వేడుక జరిగింది. ఇప్పుడు అందరి దృష్టీ మిగతా సెలబ్రిటీ లవ్ బర్డ్స్‌పై పడింది. దీపికా–రణవీర్‌సింగ్, శ్రుతీహాసన్–మైఖేల కోర్సెల్.. ఇలా కొన్ని జంటల గురించి మాట్లాడుకుంటున్నారు. విరాట్, అనుష్కల్లా వీళ్లు కూడా పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముందు పెళ్లి చేసుకోబోయేది శ్రుతి–మైఖేల్ అని కూడా చాలామంది ఫిక్స్ అయ్యారు. చెన్నైలో ఇటీవల జరిగిన నటుడు అధవ్ పెళ్లిలో శ్రుతి–మైఖేల్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది. లండన్ కుర్రాడు మైఖేల్ ఎంతో ఇష్టంగా తమిళ వేష్టీ (పంచె) కట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకోవడంతో కచ్చితంగా దేశీ అల్లుడు అవుతాడని ఊహిస్తున్నారు. పైగా వివాహ వేడుకలో కమల్‌హాసన్, శ్రుతి, మైఖేల్ వరుసగా కూర్చుని ఉండటంతో పెళ్లికి తండ్రి నుంచి కూతురికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనే సంకేతం అందింది.
అటు తల్లి సారికకు కూడా సమ్మతమే అని, త్వరలో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటుందని చాలామంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ‘‘ఇప్పట్లో పెళ్లి లేదు’’ అని శ్రుతి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి.. మైఖేల్‌తో లవ్‌లో ఉన్నది నిజమేనా? అంటే.. శ్రుతి తన పర్సనల్ మేటర్స్‌ని ఎవరి దగ్గరా డిస్కస్ చేయరని, అయితే ప్రస్తుతానికి ఆమె దృష్టంతా సినిమాల పైనే ఉందని అంటున్నారు. మరి... శ్రుతి మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే లండన్ నుంచి మైఖేల్ ఇక్కడికి రావడం, అడపా దడపా శ్రుతి అక్కడికి వెళ్లడం, తమిళ సంప్రదాయాన్ని ఆచరించి, మైఖేల్ పంచె కట్టుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment