
కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తాడో లేదో నాట్ ష్యూర్ గానీ, శృతి హాసన్ మ్యారేజ్‌లోకి రావడం ఆల్‌మోస్ట్ కన్‌ఫామ్డ్ అంటున్నారు. స్వీట్ హార్ట్ నెక్ లైన్ కట్ ఉన్న ఓ తెల్లటి మ్యాక్సీ డ్రెస్ వేసుకుని, జుట్టును బన్ను లాగా ముడేసుకుని, చెవులకు రెండు స్టేట్‌మెంట్ దుద్దులు పెట్టుకుని ఎంతో క్యాజువల్‌గా, ఎంతో సింపుల్‌గా తన సంతోషం బయట పడకుండా బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సేల్‌తో, తల్లి సారికతో కలిసి ఓ హై క్లాస్ రెస్టారెంట్‌లో లంచ్ చేశారట శృతి హాసన్!
రెండేళ్ల నుంచీ శృతి, కోర్సేల్ ప్రేమాయణం చక్కర్లు కొడుతున్న సిట్యుయేషన్‌లో సారికకు కోర్సేల్‌ని కలిపించడంలో పెడర్థం ఏమీ లేదు.. మ్యారేజ్ అర్థమే ఉందని మీడియా అంటోంది. దానికి తోడు సారిక చేతిలో అందమైన పూల గుచ్ఛం ఉంది కాబట్టి కాబోయే అల్లుడు గారే ఇచ్చారని, ఆవిడ స్వీకరించింది కాబట్టి పెళ్లి జరగడం ఖాయమనీ మీడియా మితిమీరి ఎక్సయిట్ అయిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment