స్పెషల్‌ బర్త్‌డే | The Actor & Singer Can't Live Without Sweets. Here's Proof! | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ బర్త్‌డే

Published Sat, Jan 27 2018 1:06 AM | Last Updated on Sat, Jan 27 2018 1:09 AM

The Actor & Singer Can't Live Without Sweets. Here's Proof! - Sakshi

శ్రుతీహాసన్

‘ఇవాళ నా బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే టూ మీ...’ అంటూ తనకూ తానే విషెష్‌ చెప్పుకుంటూ ప్రతీ సంవత్సరం సరదాగా తన ఆత్మీయులతో కలిసి బర్త్‌డే పార్టీలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు శ్రుతీహాసన్‌. 2016లో తండ్రి కమల్‌హాసన్‌తో చెన్నైలో తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. గతేడాది తన క్లోజ్‌ ఫ్రెండ్స్, హీరోయిన్‌ తమన్నాతో కలిసి జరుపుకున్నారు. మరి ఈ ఏడాది శ్రుతీహాసన్‌ బర్త్‌డేను ఎక్కడ? ఎవరితో జరుపుకుంటారో అని ఔత్సాహికరాయుళ్లు ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తికి కారణం మైఖేల్‌ కోర్సెల్‌.

లండన్‌కి చెందిన ఈ థియేటర్‌ ఆర్టిస్ట్‌తో శ్రుతి లవ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ ‘నా మనసులో మైఖేల్‌కి స్పెషల్‌ ప్లేస్‌ ఉంది’ అని మాత్రం అన్నారు. ఈసారి ఈ స్పెషల్‌ మేన్‌తోనే శ్రుతి తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ప్లాన్‌ చేశారట. అందుకే  తన పాత స్నేహితులు కొంతమంది, మైఖేల్‌తో కలిసి ఆమె లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లారని సమాచారం. శ్రుతి ఫ్యాన్స్‌ ఆల్రెడీ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో అడ్వాన్స్‌ విషెస్‌తో సందడి చేస్తున్నారు. ‘‘నా బర్త్‌డేకు మెసేజ్‌ల వర్షం కురిపిస్తున్న అభిమానులందరికీ చాలా పెద్ద హగ్‌. ఈ ప్రేమాభిమానాలే మీరు నాకు ఇచ్చే బెస్ట్‌ గిఫ్ట్‌’’ అని సోషల్‌ మీడియా ద్వారా శ్రుతి పేర్కొన్నారు. అన్నట్లు శ్రుతీహాసన్‌ బర్త్‌డే ఎప్పుడో చెప్పలేదు కదూ.. రేపే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement