ప్రామిస్‌.. మరింత కష్టపడతా! | Ram Charan Tej and Puri Jagannadh Chirutha Movie completes 13 Years | Sakshi
Sakshi News home page

ప్రామిస్‌.. మరింత కష్టపడతా!

Published Tue, Sep 29 2020 2:04 AM | Last Updated on Tue, Sep 29 2020 2:04 AM

Ram Charan Tej and Puri Jagannadh Chirutha Movie completes 13 Years - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్‌ హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘చిరుత’. ఈ సినిమాకి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. 2007 సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం విడుదలైంది. ‘చిరుత’ విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌చరణ్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే 13 ఏళ్లు అయిపోయాయంటే నమ్మలేకపోతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు తలుపుతట్టాయి. కానీ అన్నింటినీ ఎంజాయ్‌ చేశా.

అన్నివేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ప్రామిస్‌.. ఇకముందు మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను’’ అన్నారు. కాగా తన తొలి చిత్రదర్శకుడు పూరి జగన్నాథ్‌ పుట్టినరోజు కూడా సోమవారం కావడంతో ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు రామ్‌చరణ్‌. ‘‘చిరుత’ షూటింగ్‌ సమయంలో ప్రతిరోజూ ఓ తీయని జ్ఞాపకం. ఇప్పటికీ ఆ రోజులను నిన్నలాగే భావిస్తుంటా. ‘చిరుత’ యూనిట్‌కి కృతజ్ఞతలు. థ్యాంక్యూ పూరీగారు. హ్యాపీ బర్త్‌ డే’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement