birth day celebrates
-
ప్రామిస్.. మరింత కష్టపడతా!
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్ హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘చిరుత’. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2007 సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదలైంది. ‘చిరుత’ విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌చరణ్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే 13 ఏళ్లు అయిపోయాయంటే నమ్మలేకపోతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు తలుపుతట్టాయి. కానీ అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్నివేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ప్రామిస్.. ఇకముందు మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను’’ అన్నారు. కాగా తన తొలి చిత్రదర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు కూడా సోమవారం కావడంతో ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు రామ్‌చరణ్. ‘‘చిరుత’ షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఓ తీయని జ్ఞాపకం. ఇప్పటికీ ఆ రోజులను నిన్నలాగే భావిస్తుంటా. ‘చిరుత’ యూనిట్‌కి కృతజ్ఞతలు. థ్యాంక్యూ పూరీగారు. హ్యాపీ బర్త్ డే’’ అన్నారు. -
బర్త్‌డే స్పెషల్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించనున్నారు. శనివారం నివేదా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కథానాయికగా ఖరారు చేసిన విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ‘రెడ్’ చిత్రబృందం సమక్షంలో గోవాలో జరిగాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. -
ఆ భయం పోయింది
దుబాయ్‌లో మస్త్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు కాజల్ అగర్వాల్. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న ఓ ప్రైవేట్ జూలోకి వెళ్లారట. అక్కడి జంతువులతో సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. ఈ విషయాన్నే కాజల్ చాలా ఎగై్జటింగ్‌గా చెబుతున్నారు. ‘‘కొన్ని జంతువులంటే నాకు చాలా భయం ఉండేది. వాటిని ఇంత క్లోజ్‌గా చూస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఆ భయం పోయింది. ఇలా నా భయం దూరం కావడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. నా బర్త్‌డే సెలబ్రేషన్ విభిన్నంగా, మంచి అనుభూతితో జరిగినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కాజల్. ఇక కాజల్ సినిమాల ప్రస్తావనకు వస్తే.. ఆమె తెలుగులో ఒక కథానాయికగా నటించిన ‘రణరంగం’ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. శర్వానంద్ హీరో. అలాగే తమిళంలో కాజల్ నటించిన ‘కోమలి, ప్యారిస్ ప్యారిస్’ విడుదలకు సిద్ధమయ్యాయి. కమలహాసన్ ‘ఇండియన్ 2’లో కథా నాయికగా నటించనున్నారు. మరోవైపు ‘మను చరిత్ర’ అనే సినిమాను సమర్పిస్తున్నారు. -
ఓన్లీ ఫన్
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్... వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం సెట్స్‌లో నో ఫ్రస్ట్రేషన్. ఓన్లీ ఫన్. ఎందుకంటే అనిల్ రావిపూడి బర్త్‌డే. ఈ సందర్భంగా అనిల్ కేక్ కోశాక.. చిత్ర కథానాయికలు తమన్నా, మెహరీన్‌లు ఇలా కేక్ పూసి, ఫన్ చేశారు. అన్నట్లు సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
అనుకోని అతిథి!
ఇక్కడున్న ఫొటో చూసి ప్రభాస్ హీరోగా నటించనున్న సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా వ్యవహరించనున్నారనే ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో ఇంకా సినిమా ఫిక్స్ కాలేదు. కావాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటారు. మరి... ఈ ఫొటో సంగతి ఏంటీ? అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇటలీలో ‘సాహో’ సినిమా సెట్లో జరిగాయట. ఈ వేడుకల్లో రెహమాన్ పాల్గొన్నప్పటి ఫొటో ఇదని వైరల్ అవుతోంది. అలాగే ఇటలీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎనెనియో మేరరికోన్ని కలిశారు రెహమాన్. ‘‘మేరరికోన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు రెహమాన్. ఆస్కార్‌కు ఆరుసార్లు మేరరికోన్ నామినేట్ అయ్యారు. 88వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ద హేట్‌ఫుల్ 8’ సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు మేరరికోన్. -
నేను అనుకున్నవన్నీ జరుగుతాయి
‘‘మనందరి ప్రేమాభిమానాల్లో ఏయన్నార్‌గారు ఎప్పుడూ నిలిచి ఉంటారు. ఈ సినిమా చేయడానికి మూడు కారణాలు. స్క్రిప్ట్, అశ్వనీదత్‌గారు, నాని’’ అన్నారు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. గురువారం అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఒక సీత కథ’ తర్వాత అశ్వనీదత్‌గారు 24 ఏళ్ల వయసులో తెల్లవారుజామున 4 గంటలకు ఎన్టీఆర్‌గారి ఇంటి ముందు నిల్చున్నారు సినిమా కోసం. ఎన్టీఆర్‌గారు ‘ఎదురులేని మనిషి’ సినిమా చేశారు. పెద్ద హిట్ అయింది. ఆయన ఫొటోనే ఈ సంస్థ లోగోలో ఉంటుంది. సాధారణంగా నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. మల్టీస్టారర్ చేస్తే నానీతో చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అతని డైలాగ్ డెలీవరీ చక్కగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఓ అందమైన అమ్మాయి ఆకాంక్షను నాకు హీరోయిన్గా తీసుకువచ్చారు. రష్మికకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అన్నింటినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ మన (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) నెల. నాన్నగారి బర్త్‌డే. మొగుడు పెళ్లాల సినిమాలు ఒకే రోజు రిలీజవుతాయా? అయ్యాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రెండూ బాగా ఆడాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూస్ చూసి సమంత కంగారు పడింది. ఏం ఫర్లేదు.. సాయంత్రానికి ఓకే అవుతాయి అన్నాను. సెట్ అయింది. నా సినిమాకు కలెక్షన్స్ రావడం లేదు అంది. సండేకి సెట్ అవుతుంది అన్నాను.. అయింది. ఈ 27న వస్తున్న ‘దేవదాస్’ని కూడా నాన్నగారు చూసుకుంటారు. గణేశ్, దసరా పండగ మధ్యలో ‘దేవదాస్’ పండగ వస్తుంది. నవ్వులు.. ఓన్లీ నవ్వులే. సీక్వెల్ చేద్దామా నానీ? తప్పకుండా చేద్దాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూసినప్పటి నుంచి తాతగారు అనే పేరు వింటే మా తాతకంటే ఏయన్నార్‌గారు కనిపిస్తారు. నాగార్జున ఇంత అందంగా ఉంటారు. రోజూ ఏం తింటున్నారో, తాగుతున్నారో కనుక్కోమని నా అసిస్టెంట్స్‌కి చెప్పాను. అది ట్రై చేసి ఆయనలా అయిపోదాం అని. కానీ మనం తినేవే తింటున్నారు సర్ అని చెప్పారు. మామూలువే తిని మామూలువే తాగితే ఆయనెందుకు అలా ఉన్నారు? మనమంతా ఇలా ఎందుకు ఉన్నాం? ఆ అందానికి కారణం సరదాగా ఉండటమే. ప్యూర్‌గా ఉండటమే. లోపల ఏం పెట్టుకోరు. అశ్వనీదత్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో నా ఆల్బమ్ చూసి ‘నీకెందుకు యాక్టింగ్ బాగా చదువుకో’ అన్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నాను. స్వప్నా, నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ ముందు గొడవపడ్డాం. సినిమా హిట్. ఈ సినిమా స్టార్ట్ కాకముందే గొడవపడ్డాం. సినిమా బ్లాక్బాస్టర్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అందర్నీ బాగా హ్యాండిల్ చేశాడు. మణిగారితో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు. ‘‘మామయ్యా మజాకా. బంగార్రాజు పాత్ర తర్వాత అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాని నా ఫేవరెట్ కోస్టార్’’ అన్నారు సమంత. ‘‘అన్నయ్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ పోస్టర్ చూసి ‘ఏమున్నాడు మా అన్నయ్య’ అన్నాను. ఇప్పుడు మా నాన్నగారిని చూసి ‘ఏమున్నాడయ్యా బాబు మా నాన్న’ అనాలనిపిస్తుంది. నాని అంటే నాకిష్టం. యాక్టింగ్‌లో తన ఈజ్ కుళ్లు తెప్పిస్తోంది’’ అన్నారు అఖిల్. ‘‘వైజయంతీలో సినిమా చేయడం హానర్‌గా ఫీలవుతున్నాను. నాగార్జునగారితో అప్పట్లో ఓ ఫొటో దిగాను. బయటా హీరోలానే ఉన్నాడమ్మా అని మా అమ్మగారితో అంటే, సినిమా చేయమన్నారు. అది నెరవేరడానికి 4 ఏళ్లు పట్టింది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. అశ్వనీ దత్ మాట్లాడుతూ: ‘‘నా అభిమాన నటులు నాగేశ్వరరావుగారు ఒకరు. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన హీరో నాగార్జున. నాకు రెండో సినిమా చేస్తున్న హీరో నాని. యంగ్ డైరెక్టర్స్ అందరూ ట్రెండ్ మారుస్తున్నా రు. ఈ సంస్థను నడిపిస్తుంది రెండు మహాశక్తులు. వయాకామ్ ఒకరైతే, స్వప్నా–ప్రియాంకలు మరొకరు’’ అన్నారు. ‘‘ఈ లెగసీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని వయాకామ్ ప్రతినిథి అజిత్ అన్నారు.‘‘అక్కినేని గారి పుట్టినరోజంటే నాకు పండగే. నా గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటాడు. తండ్రికి మించిన తనయుడు లాగా నాగార్జున కూడా నవయువకుడిలా ఉంటాడు. మనం గర్వించదగ్గ నిర్మాత అశ్వనీదత్. ఈ ‘దేవదాస్’ కూడా ఆ ‘దేవదాసు’ అంత పేరు సంపాదించాలి. నాని చేసిన సినిమాలన్నీ హిట్టే’’ అన్నారు సుబ్బిరామిరెడ్డి. ‘‘నన్ను పరిచయం చేసింది దత్గారే. నాగార్జునతో మళ్లీ సినిమా చేయడం రహ్యాపీ’’ అన్నారు మణిశర్మ. -
కూల్చడానికి ముహూర్తాలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నిర్మాణం చేపట్టడానికి ముహూర్తం కావాలి తప్ప, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏవరైనా ముహూర్తం చూస్తారా? అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారు. కోదండరామ్ జన్మదినం సందర్భంగా టీజేఎస్ కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని, 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారన్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల ప్రచార కమిటీలు పని చేస్తున్నాయని, ఇంటింటికి జన సమితి కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇతర కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత మరో 25 నియోజకవర్గాల్లో కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో నిరుద్యోగ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వారిని, యోగేందర్ యాదవ్ లాంటి వారిని వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామన్నారు. ప్రగతికి పది సూత్రాల పేరుతో జయశంకర్ మానవ వనరుల కేంద్రం టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తోందన్నారు. త్వరలోనే దానిని ప్రజల్లోకి తీసుకొస్తామన్నారు. జనం రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, అది టీజేఎస్‌తోనే సాధ్యం అవుతుందని నమ్ముతున్నారన్నారు. గిట్టుబాటు ధరకు ప్రాధాన్యం.. మాదక ద్రవ్యాలను ఆపడం, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. రుణమాఫీతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిరుద్యోగులకు భృతి అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీజేఎస్ పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీజేఏస్‌ను రాజకీయ పార్టీగా గుర్తించిందని, జాతీయ ఎన్నికల సంఘం గర్తించాల్సి ఉందని కోదండరామ్ వివరించారు. మరో పది రోజుల్లో ఆ గుర్తింపు వస్తుందని, ముందస్తు ఎన్నికలకు టీజేఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికల గుర్తుకోసం ఇప్పటికే ఈసీకి దరఖాస్తు చేశామని ఆయన అన్నారు. అయితే గుర్తు ఏదనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. పిల్లలకు ఒక పూట అన్నం పెట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులున్న రాష్ట్రంలో మనం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో మంచి పాలన జరిగిందని ఏ ఒక్కరితోనైనా పాలకులు అనిపించగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారో.. చేయరో.. కూడా చూడాలన్నారు. కేసీఆర్ సభల పేరుతో జనాన్ని తరలిస్తే.. తాము జనం వద్దకే పోయి పలకరిస్తున్నామన్నారు. నియోజకవర్గాల్లో బలపడ్డాకే పొత్తుల విషయం మాట్లాడుతామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో 10 వేల మందితో సమావేశం పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పైసలున్నోళ్లంతా ఓ పక్కన ఉంటే.. పైసలు లేనోళ్లంత ఓ పక్కన ఉంటారని టీజేఎస్ అధ్యక్షుడు వివరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నేతలు వెంకట్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, జోత్స్న తదితరులు పాల్గొన్నారు. -
అవును.. మేం విడిపోయాం!
హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ అనిస్టన్ 49వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆమె ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటున్నారు. కానీ ఆ వేడుకలో ఆమె భర్త జస్టిన్ థెరో మాత్రం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదంటే.. అక్కడున్న ఆమె ఫ్రెండ్స్‌కి తెలుసు. కానీ అక్కడున్న అందరికీ అయితే తెలీదు. తెలీదు కాబట్టి వాళ్లంతా పుకార్లు పుట్టిస్తారు. జస్టిన్ ఎందుకు లేడనే పుకార్లు. అంత దూరం ఎందుకు పోవడం అనుకుంది జెన్నిఫర్. జస్టిన్‌తో కలిసి ఒక కంబైన్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.. ‘అవును.. మేమిద్దరం విడిపోయాం!’ అని. 2015లో పెళ్లి చేసుకున్న జస్టిన్, జెన్నిఫర్‌ల బంధం మూడేళ్లు కాకముందే విడాకుల వరకు వెళ్లింది. నిజానికి 2017లోనే ఈ ఇద్దరూ విడిపోయినా ఆ విషయాన్ని ప్రైవేటుగానే ఉంచేద్దాం అనుకున్నారట. కాకపోతే, జెన్నిఫర్ బర్త్‌డే తర్వాత గాసిప్స్ వస్తాయన్న అనుమానం రావడంతో, ఎట్టకేలకు తాము విడిపోయినట్లు అనౌన్స్ చేసేశారు. ‘‘భార్యాభర్తలుగా కొనసాగలేం అని అనుకున్నాక ఇద్దరం విడిపోవాలనే నిర్ణయించుకున్నాం. అయితే విడిపోయాకా మేమిద్దరం బెస్ట్ఫ్రెండ్స్గానే కొనసాగుతాం’’ అని ఇద్దరూ కలిసి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గతంలో బ్రాడ్‌పిట్‌తో కూడా జెన్నిఫర్ ఇలా ఎలాంటి గొడవలు లేనప్పుడే సామరస్యంగా విడిపోయింది. -
స్పెషల్ బర్త్‌డే
‘ఇవాళ నా బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే టూ మీ...’ అంటూ తనకూ తానే విషెష్ చెప్పుకుంటూ ప్రతీ సంవత్సరం సరదాగా తన ఆత్మీయులతో కలిసి బర్త్‌డే పార్టీలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రుతీహాసన్. 2016లో తండ్రి కమల్‌హాసన్‌తో చెన్నైలో తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. గతేడాది తన క్లోజ్ ఫ్రెండ్స్, హీరోయిన్ తమన్నాతో కలిసి జరుపుకున్నారు. మరి ఈ ఏడాది శ్రుతీహాసన్ బర్త్‌డేను ఎక్కడ? ఎవరితో జరుపుకుంటారో అని ఔత్సాహికరాయుళ్లు ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తికి కారణం మైఖేల్ కోర్సెల్. లండన్‌కి చెందిన ఈ థియేటర్ ఆర్టిస్ట్‌తో శ్రుతి లవ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ ‘నా మనసులో మైఖేల్‌కి స్పెషల్ ప్లేస్ ఉంది’ అని మాత్రం అన్నారు. ఈసారి ఈ స్పెషల్ మేన్తోనే శ్రుతి తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారట. అందుకే తన పాత స్నేహితులు కొంతమంది, మైఖేల్‌తో కలిసి ఆమె లాస్ ఏంజెల్స్ వెళ్లారని సమాచారం. శ్రుతి ఫ్యాన్స్ ఆల్రెడీ ట్విట్టర్, ఫేస్బుక్లో అడ్వాన్స్ విషెస్‌తో సందడి చేస్తున్నారు. ‘‘నా బర్త్‌డేకు మెసేజ్‌ల వర్షం కురిపిస్తున్న అభిమానులందరికీ చాలా పెద్ద హగ్. ఈ ప్రేమాభిమానాలే మీరు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్’’ అని సోషల్ మీడియా ద్వారా శ్రుతి పేర్కొన్నారు. అన్నట్లు శ్రుతీహాసన్ బర్త్‌డే ఎప్పుడో చెప్పలేదు కదూ.. రేపే. -
ఘనంగా శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలు
హైదరాబాద్: ఈ ఫొటోలో అందరి మధ్యలో ఉన్న వృద్ధురాలి పేరు బుగ్గమ్మ. వయసు 103 సంవత్సరాలు. తన కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, ముని మనవరాళ్ల సమక్షంలో ఆదివారం బుగ్గమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జియాగూడ సబ్జిమండి నీలకంఠనగర్‌లో నివసిస్తున్న బుగ్గమ్మకు 13 మంది సంతానం.