
ఏఆర్ రెహమాన్, ప్రభాస్
ఇక్కడున్న ఫొటో చూసి ప్రభాస్ హీరోగా నటించనున్న సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా వ్యవహరించనున్నారనే ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్ పెట్టండి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో ఇంకా సినిమా ఫిక్స్ కాలేదు. కావాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటారు. మరి... ఈ ఫొటో సంగతి ఏంటీ? అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.
ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇటలీలో ‘సాహో’ సినిమా సెట్‌లో జరిగాయట. ఈ వేడుకల్లో రెహమాన్ పాల్గొన్నప్పటి ఫొటో ఇదని వైరల్ అవుతోంది. అలాగే ఇటలీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎనెనియో మేరరికోన్‌ని కలిశారు రెహమాన్. ‘‘మేరరికోన్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు రెహమాన్. ఆస్కార్‌కు ఆరుసార్లు మేరరికోన్ నామినేట్ అయ్యారు. 88వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ద హేట్‌ఫుల్ 8’ సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు మేరరికోన్.
Comments
Please login to add a commentAdd a comment