chirutha
-
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
-
ఏలూరు జిల్లాలో చిరుత సంచారం
-
చిరుత పులి కలకలం
ద్వారకాతిరుమల: మండలంలోని ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్‌లో శనివారం రాత్రి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. స్థానిక వీరాంజనేయ దాబా సమీపంలో చిరుత సంచారాన్ని చూసిన పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీస్, రెవిన్యూ, అటవీశాఖ అధికారులకు అందించారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ ఏలూరు రేంజ్ అధికారి ఎస్వీకే కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి కె.కుమార్‌సింగ్, సిబ్బంది, భీమడోలు సీఐ జోసఫ్ విల్సన్, పలువురు రెవెన్యూ అధికారులు చిరుత పులి పాదముద్రలను గుర్తించి, వాటిని పరిశీలించారు. అవి చిరుత పులి జాడలేనని నిర్ధారించారు. అనంతరం స్థానిక అందానమ్మ చెరువు, శ్రీ కార్తీకేయ ఫ్లైయాష్ బ్రిక్స్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో జాడలు గుర్తించారు. ఆ సమీప ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దాంతో ప్రజలు, శని, ఆదివారాల్లో చర్చిలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు గ్రామంలో టాంటాం వేయించారు. ద్వారకానగర్తో పాటు భీమడోలు, పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. -
రాజమండ్రి నుంచి మకాం మార్చిన చిరుత
-
‘చిరుత’ హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ!
రాబోయే లోక్‌సభ ఎన్నికల ద్వారా బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ తెలిపారు. బిహార్‌లోని భాగల్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. మహాఘట్బంధన్ సీట్ల పంపకంపై చర్చల తర్వాత తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన కుమార్తెకు నియోజకవర్గం నుంచి టిక్కెట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేహా శర్మ 2007లో తెలుగులో రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘చిరుత’ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. “కాంగ్రెస్‌కి భాగల్పూర్ నియోజకవర్గం కావాలి. అది మా కంచుకోట. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. మాకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్‌పై ఆధారపడి ఉంది. పార్టీ నన్ను అడిగితే నేను పోటీ చేస్తాను లేదా బహుశా నా కుమార్తె నేహా శర్మ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని అజయ్ శర్మ అన్నారు. బిహార్‌లో ‘ఇండియా’ కూటమి సీట్ల భాగస్వామ్య ప్రకటన ఈ వారంలో ఉంటుందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) హాజీపూర్, జముయితో సహా 5 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనుంది. హిందుస్థానీ ఆవాస్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. 2019లో బీహార్‌లోని 40 సీట్లకు గాను ఎన్డీఏ 39 స్థానాలను కైవసం చేసుకుంది. -
తిరుమల: ఎట్టకేలకు చిక్కిన చిరుత.. ఆపరేషన్ సక్సెస్
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కింది. దీంతో ఇకపై నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా సంచరించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో చిరుత.. బోను దాకా వచ్చిపడకుండా పోతోంది అది. అలా వారం గడిచింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిక్కింది. ఈ చిరుత పట్టివేతతో.. ఆపరేషన్ చిరుత ముగిసినట్లేనని అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో.. ఇకపై భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించే అవకాశం ఉందని అంటున్నారు. టీటీడీ అప్రమత్తత చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. విజయవంతమయ్యారు. మరో 500 ట్రాప్ కెమెరాల ఏర్పాటు చిరుత చిక్కిన ప్రదేశాన్ని సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు పరిశీలించారు. ‘‘చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించాం. ఇది మగ చిరుత. రెండేళ్ల వయసుంది. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు నిరంతరం ఉంటాయి. నడకమార్గంలో ప్రస్తుతం 300 కెమెరాలు ఉన్నాయి. మరో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. -
ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్
Neha Sharma About Her Morphed Photo: 'చిరుత' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. తొలి సినిమాతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ భామ ఇటీవలె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నేహా మాట్లాడుతూ.. 2018లో నా ఫోటో ఒకటి మార్ఫింగ్ చేసి దానికి సెక్స్ టాయ్‌ను జత చేశారు. ఆ సమయంలో నేను 'ఇల్లీగల్' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. రోజూ లాగే ఆరోజు కూడా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు అందరూ నాతో విచిత్రంగా ప్రవర్తించారు. ఎవరూ నాతో మాట్లాడలేదు. ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఇందుకు అందరూ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నా. అప్పుడే ఒకరు నా దగ్గరికి వచ్చి ఆ మార్ఫింగ్ ఫోటోను చూపించారు. ఇది నెట్టింట వైరల్ అవుతుందని చెప్పారు. అది చూసి షాక్ అయ్యాను. నాకే ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను. అప్పటికింకా చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నా. ఇలా ఎందుకు చేస్తారు? అంత పనిలేకుండా ఉన్నారా అని చాలా బాధపడ్డా. కానీ నిజం ఏంటో నాకు తెలుసు. కానీ ఏది ఏమైనా ఇలా మార్ఫింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు అని పేర్కొంది. చదవండి: ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ -
సింగిరికోనలో చిరుత దాడి
నారాయణవనం (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని సింగిరికోన ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం చిరుతపులి దాడిలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు (58), మంజులాదేవి (48) ద్విచక్ర వాహనంపై సింగిరికోనకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. నారాయణవనం నుంచి సుమారు 6.5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని ఆలయానికి అర కిలోమీటరు దూరంలో వెదురు పొదల వద్ద వీరిపై చిరుతపులి దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై దూకిన చిరుత మంజులాదేవి తలపై పంజాతో గాయపరచింది. కుదుపుతో కింద పడిన సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి. అదే సమయంలో ఆలయ దర్శనానికి వస్తున్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత సమీపంలోని పొదల్లోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన మంజులాదేవి, సుబ్రహ్మణ్యంలను పుత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంజులాదేవికి సుమారు 25 కుట్లు పడ్డాయి. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలో ఆలయ దర్శనానికి వెళ్తున్న నగరికి చెందిన దంపతులపై మరోసారి చిరుత దాడికి యత్నించింది. వీరు తప్పించుకుని ఆలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సింగిరికోనలోని భక్తులను ఖాళీ చేయించారు. ప్రస్తుతం సింగిరికోనకు రాకపోకలను నిషేధించామని, తదుపరి అనుమతులు వచ్చేవరకు ఎవరూ రావొద్దని ఎస్ఐ ప్రియాంక మీడియా ద్వారా భక్తులకు సూచించారు. అటవీ సమీప గ్రామాల్లో వలంటీర్ల ద్వారా అప్రమత్తం చేస్తామని తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం
-
ప్రామిస్.. మరింత కష్టపడతా!
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్ హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘చిరుత’. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2007 సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదలైంది. ‘చిరుత’ విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌చరణ్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే 13 ఏళ్లు అయిపోయాయంటే నమ్మలేకపోతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు తలుపుతట్టాయి. కానీ అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్నివేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ప్రామిస్.. ఇకముందు మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను’’ అన్నారు. కాగా తన తొలి చిత్రదర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు కూడా సోమవారం కావడంతో ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు రామ్‌చరణ్. ‘‘చిరుత’ షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఓ తీయని జ్ఞాపకం. ఇప్పటికీ ఆ రోజులను నిన్నలాగే భావిస్తుంటా. ‘చిరుత’ యూనిట్‌కి కృతజ్ఞతలు. థ్యాంక్యూ పూరీగారు. హ్యాపీ బర్త్ డే’’ అన్నారు. -
నమ్మలేక పోతున్నా
సరిగ్గా పదకొండేళ్ల క్రితం హీరో రామ్‌చరణ్ తొలి సినిమా ‘చిరుత’ సెప్టెంబర్ 28నే రిలీజ్ అయ్యింది. అంటే రామ్‌చరణ్ ఇండస్ట్రీలో పదకొండు సంవత్సరాలను పూర్తి చేశారు. ‘మగధీర, ఎవడు, ధృవ, రంగస్థలం’ వంటి సినిమాలతో నటునిగా తనదైన పేరు సంపాదించుకున్నారు. ‘‘నేను సినిమా పరిశ్రమలోకి వచ్చి అప్పుడే పదకొండేళ్లు పూర్తయ్యా యంటే నమ్మలేకపోతున్నాను. నిన్ననే నటించడం స్టార్ట్ చేశాననే ఫీలింగ్ కలుగుతోంది. నా ఈ జర్నీలో భాగమైన నా దర్శకులు నిర్మాతలతో పాటు మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ఇప్పటి వరకు తను నటించిన సినిమాల పోస్టర్స్ అన్నింటినీ కలిపి ఓ ఫొటోలా తయారు చేసి, ఫేస్బుక్లో షేర్ చేశారు చరణ్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది. -
మెగా హీరోతో పూరి నెక్ట్స్..?
కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రస్తుతం ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తనయుడు ఆకాష్ ను హీరోగా రీ లాంచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా విషయంలో పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తరువాత పూరి ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. చిరుత సినిమాతో తను హీరోగా పరిచయం చేసిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తో పూరి ఓ సినిమాను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సీనియర్ నిర్మాత కేయస్ రామారావు నిర్మించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాతో పాటు, బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు చరణ్. ఈ రెండు సినిమాల తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో చరణ్, పూరితో సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి. -
చిరుత సంచారంపై విచారణ
ఊట్కూర్ : మండలంలోని జీర్ణహల్లి, ఊట్కూర్, పెద్దపొర్ల శివారు పొలాల్లో చిరుతపులి సంచరిస్తున్నదని సమాచారం తెలుసుకొని గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఊ ట్కూర్, జీర్ణహల్లి, పెద్దపొర్ల గ్రామాలలోని రైతులను, గ్రామస్తులను కలిసి వివరాలను సేకరించారు. ఊట్కూర్‌లోని దంతన్‌పల్లి రైతులు నక్క తాయప్ప, బాలప్ప, వెంకటప్ప తదితర రైతులను కలిసి వివరాలు సేకరించారు. రైతులు భయపడి చిరుతను చంపేందుకు పొలాలకు విద్యుత్ ప్రసారం, విషగుళికలు, చిరుతపై దాడులు చేయరాదని అటవీశాఖ అధికారులు హఫీజ్, విజయ్ కుమార్ తెలిపారు. చిరుత కనపడితే సమాచారం ఇవ్వాలని, ఉన్నతాధికారులకు తెలిపి చిరుతను పట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, ఎం. లక్ష్మారెడ్డి, రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత సంచారం
ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు చండ్రుగొండ: అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు లభించాయి. పాదాల గుర్తుల ఆధారంగా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. గతనెల 3వ తేదీన ఇదే ప్రాంతంలోని అడవుల్లో రెండు చిరుత పులులను విషప్రయోగం చేసి హతమార్చిన విషయం తెలిసిందే. విధుల్లో భాగంగా అటవీప్రాంతంలో సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్న సెక్షన్ అధికారిణి దేవికి ఈ చిరుత పులి పాదాల గుర్తులు కనిపించాయి. సమాచారాన్ని ఆమె శాఖ ఉన్నతాధికారులకు అందించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమీపంలో నీటివనరులున్న ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబ్బుగూడెం అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తోంది వాస్తవమేనని రామవరం రేంజర్ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. మేకలు, పశువుల కాపరులు అటుగా వెళ్లవద్దని సూచించారు. -
‘చిరు’ చెమటలు
♦ తిరుమలలో ఆరు చిరుతల సంచారం ♦ కట్టడి చేయకపోతే తప్పదు మూల్యం ♦ వేడుక చూస్తున్న టీటీడీ, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగాలు ♦ స్థానికులు, భక్తుల్లో పెరిగిన ఆందోళన సాక్షి, తిరుమల: తిరుమలలో మొత్తం ఆరు చిరుతలు సంచరిస్తున్నాయి. గతంలో ఒక్కోటిగానే తిరిగేవి. ప్రస్తుతం అవి రెండేసి చొప్పున జట్టుగా కలసికట్టుగా తిరుగుతున్నాయి. ప్రధానంగా గోగర్భం మఠాల నుంచి రింగ్‌రోడ్డు, గ్యాస్‌గోడౌన్ మీదుగా స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ తూర్పుప్రాంతం నుంచి దివ్యారామం వరకు సంచరిస్తున్నాయి. ఇవే టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే బీటైపు, డీటైపు క్వార్టర్సుల వరకు తిరుగుతున్నాయి. అలాగే జింకలపార్కు నుంచి అవ్వాచారి కోన, అలిపిరి కాలిబాటమార్గం మీదుగా దివ్యారామం, రెండో ఘాట్‌రోడ్డు ద్వారా శ్రీవారి మెట్టు వరకు వస్తున్నాయి. రాత్రి, పగలూ పెరిగిన చిరుతల సంచారం జూన్ మొదటి వారం నుంచి చిరుతల సంచారం మరింత పెరిగింది. తరచూ ఇవి ఏదో ఒకచోట జనం కంట కనబడుతున్నాయి. జూన్ 10న అటవీ ప్రాంతంలోని హంపీ మఠంలోకి చిరుత చొరబడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత బాలాజీనగర్, రింగ్‌రోడ్డు, జీఎన్సీ టోల్గేట్, 56వ మలుపు వద్ద రోజూ పగలూ.. రాత్రి అని తేడా లేకుండా చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతల సంచార తీవ్రతను ఎత్తి చూపే క్రమంలోనే సాక్షి బృందం చిరుతలు సంచిరిస్తున తీరును ఫొటోలు చిత్రీకరించి ప్రచురించింది. ఆ తర్వాత కూడా ఈనెల 15న స్థానిక కల్యాణవేదికలోకి చిరుత చొరబడింది. దాన్ని చూసిన భక్తులు, పౌరోహిత సంఘం సిబ్బంది వణికిపోయారు. ఇలా చిరుతల్ని ఎక్కడికక్కడ భక్తులు, స్థానికులు సెల్ఫోన్లలో బంధిస్తూ ఆ సమాచారాన్ని ఎప్పడికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా బదిలీ చేస్తున్నారు. తాజాగా, సోమవారం రాత్రి నర్సింగ్ సదన్‌లోకి చిరుత చొరబడంతో కలకలం రేపింది. ఫలితంగా టీటీడీ యంత్రాంగం కలవరపాటుకు గురైంది. దీంతో ఎప్పుడు ఏ మార్గంలో చిరుత వస్తుందోనని ఇటు టీటీడీ సిబ్బంది, భక్తులతోపాటు స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. నామమాత్రంగానే బోన్ల ఏర్పాటు చిరుతల సంచారంపై టీటీడీ, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగాలు తిరుమల బాలాజీనగర్ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపేసుకున్నాయి. చిరుతలను బంధించే ఉద్దేశం లేనపుడు బోన్లు ఎందుకు ఏర్పాటు చేసినట్టు? అన్న విషయంపై వారి వద్ద ఎలాంటి వివరణ లేదు. సంచరించే చిరుతల్ని బంధిస్తే వాటి స్థానంలో కొత్త చిరుతలు చేరుతాయని చెబుతున్నారు. దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
అనంతపురంలో చిరుత బీభత్సం