
Neha Sharma About Her Morphed Photo: 'చిరుత' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. తొలి సినిమాతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ భామ ఇటీవలె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నేహా మాట్లాడుతూ.. 2018లో నా ఫోటో ఒకటి మార్ఫింగ్ చేసి దానికి సెక్స్ టాయ్‌ను జత చేశారు.
ఆ సమయంలో నేను 'ఇల్లీగల్' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. రోజూ లాగే ఆరోజు కూడా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు అందరూ నాతో విచిత్రంగా ప్రవర్తించారు. ఎవరూ నాతో మాట్లాడలేదు. ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఇందుకు అందరూ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నా. అప్పుడే ఒకరు నా దగ్గరికి వచ్చి ఆ మార్ఫింగ్ ఫోటోను చూపించారు.
ఇది నెట్టింట వైరల్ అవుతుందని చెప్పారు. అది చూసి షాక్ అయ్యాను. నాకే ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను. అప్పటికింకా చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నా. ఇలా ఎందుకు చేస్తారు? అంత పనిలేకుండా ఉన్నారా అని చాలా బాధపడ్డా. కానీ నిజం ఏంటో నాకు తెలుసు. కానీ ఏది ఏమైనా ఇలా మార్ఫింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు అని పేర్కొంది.
చదవండి: ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్
Comments
Please login to add a commentAdd a comment