Morphed Photo
-
పుష్ప-2 మేకర్స్‌కు షాక్.. అల్లు అర్జున్ ఫోటో లీక్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినీ ప్రేక్షకుల మోస్ట్ అవైటేడ్ చిత్రం 'పుష్ప-2 ది రూల్'. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా మేకర్స్ ప్రకటించారు. ఇటీవల వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప రూల్ బిగిన్స్ ఇన్ 200 డేస్ అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌కు పుష్ప-2 విడుదలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. (ఇది చదవండి: పుష్ప-2 పై రూమర్స్.. డైరెక్టర్ సుకుమార్ పోస్ట్ వైరల్!) ఇదిలా ఉంటే తాజాగా పుష్ప-2కు సంబంధించిన అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్ సెట్లో అల్లు అర్జున్ చీర కట్టుకుని ఉన్న నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ ఈ ఫోటోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పుష్ప-2 సెట్లోని ఫోటో లీక్ అయిందా? లేదా ఎవరైనా మార్ఫింగ్ చేశారా అంటూ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా షూటింగ్ సెట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సుకుమార్ వెల్లడించారు. మళ్లీ పుష్ప-2 సెట్లో ఫోటో లీక్ కావడంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో వచ్చిన 'పుష్ప-ది రైజ్' బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించంది. పార్ట్-1 సక్సెస్ కావడంతో సీక్వెల్‌గా'పుష్ప 2' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మరో నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. Pushpa 2 the rule leaked picture 💥#Pushpa2TheRule pic.twitter.com/n2eRsW2mdJ — Trending 2024 (@tren_ding20) January 29, 2024 Leaked Pic Of Syndicate King ' PUSHPA RAJ ' Wears Saree in Shooting Spot 🔥🔥🔥#PushpaKaRuleIn200Days #AlluArjun #Pushpa2 #PushpaTheRule #Pushpa2TheRule pic.twitter.com/O7u5N3z39u — FilmiFever (@FilmiFever) January 29, 2024 -
ఆ కీచకుడు నాతో పాటు నా కూతురిని కూడా టార్గెట్ చేశాడు: నటి ఆవేదన
ప్రముఖ నటి ప్రవీణా పోలీసులను ఆశ్రయించింది. గతంలో తనని వేధించిన ఓ కీచకుడు ఇప్పుడు తన కూతురిని టార్గెట్ చేశాడని ఆమె పోలీసులతో వాపోయింది. వివరాలు.. ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్ ఫేం ప్రవీణాను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడు. గతంలో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఆన్లైన్లో షేర్ చేశాడు. విషయం తెలిసి ప్రవీణా కొన్ని నెలల క్రితం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? దీంతో పోలీసుల అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక కొన్ని నెలలు గడిచిన అనంతరం మళ్లీ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఈసారి ప్రవీణాతో ఆమె కూతురు గైరీ నాయర్‌ను కూడా టార్గెట్ చేశాడు. తన కూతురి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్హ స్పెషల్ రోల్? గతంలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతురిని కూడా టార్గెట్ చేశాడని, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన స్నేహితులను, బంధువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. తన చూట్టూ ఉన్న మహిళలను కూడా వదలడం లేదని, వారి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి విడుదల చేస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు మీద 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. తనవి, తన కూతురు, తన బంధువుల మార్ఫింగ్ ఫొటోలను అందరికి షేర్ చేస్తున్నాడని ప్రవీణా ఫిర్యాదు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) -
ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో..
సాక్షి,బంజారాహిల్స్: ఫేస్బుక్ చాటింగ్ ద్వారా టచ్‌లోకి వచ్చిన ఓ అపరిచితుడు మార్పింగ్ చేసిన వీడియోలు పంపిస్తూ బ్లాక్‌మెయిన్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న రాజీవ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అతడి ఫేస్బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి రాజీవ్ తన నెంబర్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత రాజీవ్ ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని వేరొకరి శరీరాలతో కలిసి వీడియోలు తయారు చేసిన దుండగులు అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఫేస్‌బుక్‌లోని స్నేహితుల గ్రూపులకు షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో రూ. 3469 చొప్పున మూడుసార్లు పంపించినా ఇదే తీరులో బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితుడు రాజీవ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి👉🏻 కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం -
వివాహేతర సంబంధం: ఆమె ఫోటో, నంబర్ సంపాదించి..
సాక్షి, హైదరాబాద్: తన బావతో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె పరువు తీయాలని భావించాడో యువకుడు. సామాజిక మాధ్యమాల నుంచి ఆమె ఫొటో, ఫోన్ నంబర్ సంపాదించాడు. ఫొటో ఎడిటింగ్ యాప్స్‌లలో బాధి తురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి ఫిమేల్ ఎస్కార్ట్‌గా చిత్రీకరించి, అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టి ఫోన్ నంబర్‌తో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు ఫోన్ కాల్స్, సందేశాలు రావటం మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు రాచకొండ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఎస్.హరినాథ్ సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన విద్యార్థి మేకల శేషు వెంకట కృష్ణ (20)ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం కోర్ట్ ముందు హాజరుపరిచారు. -
కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా..
Delhi Man Shared Cousin Wife, Morphed Photos: వ్యక్తిగత గొడవల కారణంగా బంధువు భార్యను సోషల్ మీడియాలో వేధించిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని జగత్ పూర్ పుస్తా నివాసి హితేన్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగత్‌పుర్ పుస్తా ఏరియాకు చెందిన హితేన్కు తన బంధువుతో గొడవ జరిగింది. దాంతో హితెన్ కక్షగట్టి ఎలాగైనా తన బంధువుని వేధించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు హితేన్ తన బంధువు భార్య సోషల్‌మీడియా అకౌంట్‌ని టార్గెట్ చేశాడు. అదే పనిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నకిలీ ఖాతాని క్రియేట్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను సామాజిక మాధ్యమంలో నుంచి ఆమె ఫొటోలను డౌన్లోడ్ చేసుకుని, వాటిని అశ్లీల చిత్రాల్లోని యువతుల ఫొటోలతో మార్ఫింగ్ చేసేవాడు. ఆ ఫోటోలను తిరిగి బాధితురాలితో పాటు, ఆమె భర్త స్నేహితులకు కూడా పంపేవాడు. ఈ తంతు గత ఎనిమిది నెలలుగా కొనసాగుతుండంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, ఈ దారుణానికి పాల్పడుతోంది ఆమె బంధువేనని తేలండంతో అతన్ని అరెస్టు చేశారు. కాగా పోలీసులు నిందితుడి కంప్యూటర్ ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించగలిగారు. చదవండి: Vikarabad: ప్రమాదమా.. హత్యా! కారుతో ఢీ: కొట్టి చంపే ప్రయత్నం.. -
ఫేస్బుక్ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్‌కు బెదిరింపులు
బెంగళూరు: ఆన్లైన్ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికి.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. సమాజంలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బెదిరింపులకు పాల్పడే వారిలో ఆడా, మగా అనే తేడా లేదు. తాజాగా ఈ కోవకు చెందిన కేసు ఒకటి బెంగళూరులో వెలుగు చేసింది. ఫేస్బుక్లో పరిచయం అయిన ఓ మహిళ.. స్నేహం ముసుగులో మంచిదానిగా నటిస్తూ.. మోడల్‌కు దగ్గరయ్యింది. ఆ తర్వాత మార్ఫ్డ్ వీడియోలతో ఆమెను బెదిరించసాగింది. మోడల్ ఫిర్యాదుతో పోలీసుల సదరు మహిళ మీద కేసు నమోదు చేశారు. ఆ వివరాలు... కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఔత్సాహిక మోడల్‌కు ఫేస్బుక్లో నిందితురాలు సోనియా పర్నడీస్తో పరిచయం ఏర్పడింది. బాధితురాలు మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో.. సోనియా దాన్ని అవకాశంగా మార్చుకుంది. బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంపితే.. తనకు మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికింది. (చదవండి: ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్) ఆమె మాటలు నమ్మిన బాధితురాలు కొన్ని రోజుల క్రితం సోనియాకు తన వీడియోలు, ఫోటోలు పంపించింది. సోనియా తనకు మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తుందని నమ్మకంగా ఉంది బాధితురాలు. ఈ క్రమంలో ఆమెకు అనుకోని షాక్ తగిలింది. తాను పంపిన ఫోటోలు, వీడియోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫ్ చేసి.. బాధితురాలి మొబైల్‌కి సెండ్ చేసింది సోనియా. (చదవండి: ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు) వాటిని చూసిన బాధితురాలు షాక్ అయ్యింది. తేరుకునేలోపే సోనియా బాధితురాలికి కాల్ చేసి.. ‘‘నీ నగ్న చిత్రాలు పంపకపోతే.. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని’’ బెదిరించసాగింది. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. సోనియాపై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. -
ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్
Neha Sharma About Her Morphed Photo: 'చిరుత' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. తొలి సినిమాతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ భామ ఇటీవలె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నేహా మాట్లాడుతూ.. 2018లో నా ఫోటో ఒకటి మార్ఫింగ్ చేసి దానికి సెక్స్ టాయ్‌ను జత చేశారు. ఆ సమయంలో నేను 'ఇల్లీగల్' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. రోజూ లాగే ఆరోజు కూడా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు అందరూ నాతో విచిత్రంగా ప్రవర్తించారు. ఎవరూ నాతో మాట్లాడలేదు. ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఇందుకు అందరూ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నా. అప్పుడే ఒకరు నా దగ్గరికి వచ్చి ఆ మార్ఫింగ్ ఫోటోను చూపించారు. ఇది నెట్టింట వైరల్ అవుతుందని చెప్పారు. అది చూసి షాక్ అయ్యాను. నాకే ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను. అప్పటికింకా చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నా. ఇలా ఎందుకు చేస్తారు? అంత పనిలేకుండా ఉన్నారా అని చాలా బాధపడ్డా. కానీ నిజం ఏంటో నాకు తెలుసు. కానీ ఏది ఏమైనా ఇలా మార్ఫింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు అని పేర్కొంది. చదవండి: ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ -
'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌ను మార్ఫింగ్ చేసిన డేవిడ్ భాయ్.. తారక్‌గా కేన్ మామ
హైదరాబాద్: అతను బ్యాట్ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి.. కెమెరా ముందుకు వస్తే సోషల్ మీడియాలో లైకుల లెక్కలు మిలియన్లు దాటేస్తాయి.. ఆసీస్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గానైనా, సన్‌రైజర్స్ కెప్టెన్‌గానైనా పరుగుల వరద పారాల్సిందే.. అతడే ఆసీస్ ముద్దు బిడ్డ, సన్‌రైజర్స్ చిచ్చర పిడుగు డేవిడ్ వార్నర్. ఈ డైలాగ్ ఛాయలు ఎక్కడో తగులుతున్నట్టుగా ఉంది కదూ. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని పాపులర్ డైలాగ్ ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇటీవలే విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ బైక్‌పై వెళ్తుంటారు. అయితే, సహజంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వార్నర్.. ఈ ఫోటోను ఆలస్యం చేయకుండా మార్ఫింగ్ చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. మార్ఫింగ్ ఫోటోలో బైక్ నడుపుతున్న ఎన్టీఆర్ తలకు బదులుగా తన సహచరుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ తలను తగిలించాడు. వెనక కూర్చున్న రామ్ చరణ్ తలకు బదులుగా తన ఫొటోను తగిలించాడు. యాస్ యూజ్యువల్గానే ఈ పోస్ట్‌కు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. క్షణల్లో వేల సంఖ్యలో లైకులు వచ్చిపడ్డాయి. ఎస్ఆర్హెచ్ అభిమానులైతే కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఫొటోను చూసిన ఎస్ఆర్ఎస్ సహచరుడు రషీద్ ఖాన్ వెంటనే స్పందించాడు. ‘హెల్మెట్ గైస్’ అంటూ ట్రోల్ చేశాడు. కాగా, ఇదే ఫొటోకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా రషీద్ లానే స్పందించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫొటోలకు హెల్మెట్లు పెట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఉందని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా ఆర్ఆర్ఆర్ బృందం మరో ట్వీట్ చేస్తూ ఇది పరిపూర్ణంగా లేదని, నంబరు ప్లేట్ మిస్సయిందని గుర్తు చేశారు. మధ్యలో కల్పించుకున్న అభిమానులు ఆ బైక్‌కు హెడ్ లైట్ కూడా లేదని సరదా కామెంట్లతో హోరెత్తించారు. చదవండి: Sachin Tendulkar: ఆ రికార్డుకు సరిగ్గా 14 ఏళ్లు.. నేటికీ చెక్కుచెదరలేదు -
యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఓ అపరిచిత యువతి.. వ్యక్తికి మార్ఫింగ్ ఫోటోలు పంపి బ్లాక్మెయిల్ చేసిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. మాగడి పట్టణానికి చెందిన వ్యక్తికి రెండు రోజుల క్రితం అపరిచిత నంబర్ నుండి కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్లో మాట్లాడుకున్నారు. తరువాత యువతితో తాను సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటోలు, చాటింగ్ చేసిన వీడియో వచ్చాయి. దాంతోపాటు డబ్బులు పంపించాలని, లేదంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపు మేసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చదవండి: Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం బ్లాక్‌మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను -
దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!
జెరూసలెం: సోషల్ మీడియాలో దేని గురించి అయినా పోస్ట్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేస్తే.. నెటిజనులు ఓ రేంజ్లో ఆడుకుంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీలు, రాజకీయ నాయుకులు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పెద్ద కుమారుడు యాయిర్ (29) కూడా అలాంటి అత్యత్సాహమే ప్రదర్శించి చివరికి భారతీయులకు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే యాయిర్ ఇటీవల భారతీయుల ఇష్ట దైవం దుర్గామాత ముఖం స్థానంలో.. నెతన్యాహు అవినీతి కేసుల్లో ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్న లియత్ బెన్ ఆరి ముఖాన్ని మార్ఫ్ చేసిన ఫోటోను షేర్ చేశాడు. అయితే ఇది కాస్తా వివాదానికి దారితీసింది. (ఇజ్రాయెల్ ప్రధానిపై సంచలన ఆరోపణలు.. చార్జిషీట్!) దీనిపై భారత్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు యాయిర్. ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడమే కాక.. భారతీయులను క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశాడు. ‘నేను ఇది కావాలని చేసింది కాదు. ఇజ్రాయెల్ రాజకీయ నేతలను ఉద్దేశించి ఓ సెటైరికల్ పేజీలో మీమ్‌ను పంచుకున్నాను. ఆ మీమ్‌లో ఉన్నది భారతీయులకు ఎంతో ఆరాధ్య దైవమయిన దుర్గా మాతా అని నాకు తెలియదు. దీని గురించి భారత మిత్రుల నుంచి వచ్చిన సందేశాలతో నిజం తెలుసుకున్నాను. వెంటనే ఆ ట్వీట్ తొలగించాను. నన్ను క్షమించండి’ అని ట్వీట్లో పేర్కొన్నాడు యాయిర్. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో విపక్షాలు నెతన్యాహుపై విరుచుకుపడుతున్నాయి. యాయిర్ కూడా అదే మూడ్‌లో దుర్గామాత ఫోటోను మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) -
నకిలీ ఫోటో వైరల్, చిన్మయి వివరణ
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద వైరల్ అవుతున్న తన ఫోటోపై వివరణ ఇచ్చారు. అది మార్ఫింగ్ ఫోటో అని ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ఇటీవల, లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితుడైన వివాదాస్పద గురువు నిత్యానందతో చిన్మయి, ఆమె తల్లి కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఫోటోను వివరీతంగా షేర్ చేసిన నెటిజనులు ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో స్పందించక తప్పని పరిస్థితుల్లో ఈ ఫోటోపై వివరణ ఇచ్చారు. అయినా షేరింగ్స్ ఆగలేదు. ఈ ఫోటో నకిలీదని నిర్ధారించిన తర్వాత ఈ అభిమానులు మరలా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశారు. కావాలనే ఇలా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఫోటోను షేర్ చేశారు. అయితే చిన్మయి ట్వీట్ తరువాత, మార్ఫింగ్ ఫోటో షేర్ చేసిన ట్విటర్ యూజర్ తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం. తన నలుగురు కుమార్తెలను నిత్యానంద ఆశ్రమంలో చట్టవిరుద్ధంగా నిర్బంధించి, వేధింపులకు గురిచేశారంటూ ఒక కుటుంబం చేసిన ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో ‘సేవ్ గరల్స్ ఫ్రమ్ నిత్యానంద’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అయింది. సాధారణంగా ఇలాంటి సమస్యలపై తరచుగా స్పందించే చిన్మయి ఈ సమస్యపై కూడా స్పందించారు. మతపరమైన స్వాములు, భక్తి ముసుగులో జరుగుతున్న ఇలాంటి అక్రమాలుఎన్నిసార్లు వెలుగులోకి వస్తున్నా..ఇవి ఎంత ప్రమాదకరమైనవి అనేదానిపై పదేపదే ఆధారాలు ఉన్నప్పటికీ, ప్రజలు అర్థం చేసుకోలేక వారి మాయలో పడిపోతున్నారని చిన్మయి ట్వీట్ చేశారు. దీనిక ప్రతిగా స్పందించిన ఒక వినియోగదారుడు నిత్యానంద నుంచి చిన్మయి, ఆమె తల్లి ప్రసాదం స్వీకరిస్తున్నట్టుగా ఉన్న ఒక ఫేక్ ఫోటో షేర్ చేయడంతో దుమారం రేగింది. తమిళం, తెలుగుతోపాటు అనేక ఇతర భాషలలో పలు సూపర్ హిట్ పాటలతో చిన్మయి ప్రాచుర్యం పొందారు. అంతేకాదు త్రిష, సమంతా వంటి టాప్ హీరోయిన్లకు తన గొంతు అరువిచ్చి ఆయా పాత్రలకు ప్రాణం పోసారు. దీనితోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో మీ టూ ఉద్యమంలో చిన్మయి పాత్ర చాలా చురుకైనది. చదవండి : ‘నా కుమార్తెను చంపేశారు’: నిత్యానంద మరో అకృత్యం I dont why these fans are doing this all over again after I have established that this photo is fake. Are they doing this for free or is this paid? https://t.co/pHirTu6500 pic.twitter.com/j4GhpRCHGr — Chinmayi Sripaada (@Chinmayi) November 25, 2019 -
మార్ఫింగ్ ఫొటోలతో సోనియాపై దుష్ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలనాటి శృంగార దృశ్యాలంటూ సోషల్ మీడియా ‘ఫేస్బుక్’లో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ 2019’ పేరిట వెలిసిన ఫేస్బుక్ పేజీ వీటిని ఎక్కువగా ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఆ ఫొటోలు సోనియా గాంధీవి కావు. మొట్టమొదటి జేమ్స్ బాండ్ చిత్రం ‘డాక్టర్ నో’లో హీరోయిన్గా నటించిన స్విస్ తార ‘ఉర్సులా ఆండ్రెస్’ వి. ఆ చిత్రంలో ఆమె మొదటి జేమ్స్ బాండ్ హీరో స్కాటిష్ నటుడు ‘సయాన్ కానరీ’తో కలిసి నటించారు. ‘డాక్టర్ నో’ చిత్రం వర్కింగ్ స్టిల్స్‌ను లైట్‌గా మార్ఫింగ్ చేసి ‘సోనియా గాంధీ అలనాటి శృంగార దృశ్యాలు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో ఎక్స్‌పోజింగ్‌లో ఉర్సులా ఆండ్రెస్ పెట్టింది పేరవడంతో నాటి కుర్రకారు ఆమెను ముద్దుగా ‘ఉర్సులా అన్‌డ్రెస్’ అని పిలుచుకునేవారు. ఆ మాటకొస్తే సోనియా గాంధీ ఫొటోలంటూ తప్పుడు ఫొటోలలో దుష్ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓ మగవాడి తొడపై కూర్చున్న అలనాటి ‘బార్ వెయిట్రెస్’ సోనియా గాంధీ అంటూ ఇటీవల కూడా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి ఆ ఫొటో హాలివుడ్ నటి ‘రీస్ విథర్స్పూన్’ది. ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోనియా ఫొటోగా ప్రచారం చేశారు. 2004లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సోనియా గాంధీ ప్రధాని అవుతారని ప్రచారం జరిగినప్పుడు కూడా సోనియా ‘బార్ డ్యాన్సర్’గా పనిచేసినప్పటి ఫొటో అంటూ ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. నాటి హాలివుడ్ అందాల నటి మార్లిన్ మాన్రో ఫొటో మార్ఫింగ్ చేశారు. వాస్తవానికి సోనియా గాంధీకి ‘బార్ వెయిట్రెస్ గానో బార్ డ్యాన్సర్’గానో పనిచేయాల్సిన అవసరం లేదు, రాలేదు. ఆమె తండ్రి స్టెఫానో ఇటలీలో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో సోనియా గాంధీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సు చేస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ పరిచయం అవడంతో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. -
ఫొటో షేర్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలతో కొందరు అకతాయిలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తిని నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని దాద్రికి చెందిన రహిషుద్దీన్గా గుర్తించారు. రహిషుద్దీన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్‌లో బాబా రాందేవ్ ఫొటోను షేర్ చేశారు. అయితే దీనిపై ఆ గ్రూప్‌లోని కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రహిషుద్దీన్ బాబా రాందేవ్ ప్రతిష్టను దిగజార్చేలా.. ఫొటో మార్ఫింగ్‌కు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ స్పందిస్తూ.. మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్‌ను అవమానపరచడానికి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా నిందితుడు మాత్రం స్నేహితుడు పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని చెబుతున్నాడు. -
ప్రణబ్ కూతురు భయపడ్డట్టే..!
న్యూఢిల్లీ: ‘‘నాన్న(ప్రణబ్) ఏం మాట్లాడుతారనేది ఆర్ఎస్ఎస్ పట్టించుకోదు, ఆయన వచనాలేవీ వాళ్లకు గుర్తుండవు.. కొన్ని విజువల్స్ తప్ప!!’’ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లడానికి కొద్ది గంటల ముందు ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ చేసిన వ్యాఖ్యలివి. శుక్రవారం తాజాగా ఆమె మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.. ‘‘దేనిగురించైతే నేను భయపడ్డానో అదే జరిగింది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే హెచ్చరించా. కార్యక్రమం ముగిసి కొన్ని గంటలు కూడా గడవక ముందే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నీచమైన చర్యలకు పాల్పడుతున్నాయి..’’ అని షర్మిష్ట పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగింది?: ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి ప్రసంగించిన ప్రణబ్.. ‘‘భారతదేశమంటే హిందువులు, సిక్కులు, ముస్లింలు తదితర మతాలు, కులాల, ప్రాంతాలు, భాషల సమాహారం. ఇది మాత్రమే జాతీయవాదం. అంతేగానీ ఒకే దేశం-ఒకే మతం-ఒకే ప్రాంతం అన్న భావనే మనకు వర్తించదు..’’ అని ఉద్ఘాటించారు. ప్రసంగానికి ముందు వేదికపైనున్న నేతలంతా నిలబడి ‘ఆర్ఎస్ఎస్ సెల్యూట్’ చేయగా, ప్రణబ్‌దా మాత్రం అటెన్షన్లో ఉన్నారే తప్ప ఆర్ఎస్ఎస్ సెల్యూట్ చేయలేదు. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ప్రణబ్ ఫొటో ఒకటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కిళ్ళలో విపరీతంగా షేర్ అయింది. అందులో ప్రణబ్ ఆర్ఎస్ఎస్ తరహాలో నలుపు టోపీ ధరించి, సేవక్ స్టైల్లో సెల్యూట్ చేస్తున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. సదరు ఫొటో వైరల్ కావడంతో షర్మిష్ట మళ్లీ స్పందించారు. తాను హెచ్చరించినట్లే జరిగిందని వ్యాఖ్యానించారు. బర్నల్ అమ్మకాలు హై జంప్!: కరడుగట్టిన కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీకి రాజగురువు అయిన ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లడంపై సొంతపార్టీ నేతలే ఘాటుగా స్పందించడం తెలిసిందే. ఇక గురు, శుక్రవారాల్లో సోషల్ మీడియా అంతటా ప్రణబ్‌ను గురించిన చర్చే ఎక్కువగా నడిచింది. పెద్దాయన చర్యతో ఒళ్లుమండిన కాంగ్రెస్ నేతలు బర్నల్(గాయాలకు పూసుకోడానికి) కోసం వెతుకులాడుతున్నారని బీజేపీ శిబిరం జోకులు పేల్చింది. దుకాణాల్లో బర్నల్ దొరకట్లేదని, బర్నల్ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా దూసుకెళుతున్నాయని సెటైర్లు వేసింది. అయితే, ప్రణబ్, ఆర్ఎస్ఎస్ అగ్రనేతల సమక్షంలో వారి మౌలిక సిద్ధాంతాలపై సున్నిత విమర్శలు చేయడంతో సీన్ రివర్స్ అయింది. ‘‘ఇప్పుడా బర్నల్ కావలసింది మీకే..’’ అంటూ కాంగ్రెస్ శిబిరం కౌంటర్ విసిరింది. (ఆర్ఎస్ఎస్ కేంద్రంలో ప్రణబ్ ఏం మాట్లాడారు?) -
మార్ఫింగ్ ఫోటో.. పోలీసులకు వర్మ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోను మార్ఫింగ్ చేశాడంటూ రచయిత జయ కుమార్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. నగ్నంగా ఉన్న మహిళ ఫోటోకు తన తలను అంటించి.. ఆ ఫోటోను జయ కుమార్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడంటూ వర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ తన స్క్రిప్ట్ అంటూ జయకుమార్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తనకు న్యాయం చేయాలంటూ హీరో నాగార్జునను కోరుతూ జయకుమార్ ఓ ట్వీట్ కూడా చేశాడు. కొన్నాళ్ల క్రితం వర్మ, పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్టీ అనే అడల్ట్ చిత్రం తెరకెక్కించగా.. అది కూడా తన కథేనంటూ జయకుమార్ ఆరోపించాడు. జయకుమార్ సర్కార్-3 చిత్రానికి రచనా సహకారం అందించాడు. -
ఆ ఫొటో పెట్టారని వాట్సప్ అడ్మిన్ అరెస్టు!
బెంగళూరు: కర్ణాటకలో ఓ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టయ్యాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్‌లో ఓ పోస్టు పెట్టినందుకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునన్నారు. కర్ణాటకలో వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడిని అరెస్టు చేయడం ఇదే ప్రథమం. ఉత్తర కన్నడ జిల్లాలోని మురుదేశ్వర్ ప్రాంతానికి చెందిన సన్నథమ్మ నాయక్ (30) ’ద బాల్సే బాయ్స్’పేరిట ఓ వాట్సప్ గ్రూప్‌ను నడుపుతున్నాడు. ఆటో డ్రైవర్ అయిన అతను ఇటీవల ప్రధాని మోదీ మీద అసభ్యకరమైన పోస్టు పెట్టడమే కాకుండా.. అశ్లీలంగా, అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ప్రధాని మోదీ ఫొటోను కూడా సర్క్యులేట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
శ్రీవారి ఫోటోలో చంద్రబాబు
-
సోషల్ మీడియా.. ఉతికి ఆరేస్తోంది!
వరదల్లో చిక్కుకున్న చెన్నై నగరంలో ఏరియల్ సర్వే చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను మార్ఫింగ్ చేసి అభాసుపాలైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), అందుకు క్షమాపణ చెప్పినా సోషల్ మీడియా శాంతించడం లేదు. ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు అదే ప్రధాని మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. వాషింగ్ మిషన్‌లో ఉతకడానికి వేసిన బట్టలను మోదీ తదేకంగా చూస్తున్నట్టు, ఇండియా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు, తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్న బాబా రాందేవ్ యాడ్‌ను చూస్తున్నట్టు, తన తరఫున రిపోర్టింగ్ చేస్తున్న అనుపమ్ ఖేర్‌ను చూస్తున్నట్టు, ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీరును గమనిస్తున్నట్టు, చెన్నైలో ఫొటో మార్ఫింగ్ ద్వారా వెలసిన అమ్మ బాహుబలి ఫొటోను తదేకంగా చూస్తున్నట్టు.. ఇలా ఒకటేమిటి.. ఎవరికి తోచినట్టు వారు ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంలో పోటీ పడుతున్నారు. వాటికి సందోర్భోచిత వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు. చెన్నై నగరంలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి గురువారం నగరానికి వచ్చిన ప్రధాని మోదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసిన విషయం తెల్సిందే. మోదీ హెలికాప్టర్ విండో నుంచి నగరాన్ని చూస్తున్నప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉండడంతో అందులో నుంచి ఏమీ కనిపించడం లేదు. ముందుగా ఇదే ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పీఐబీ, విండో నుంచి నగర పరిస్థితి కనిపించడం లేదని భావించి, నగర పరిస్థితికి సంబంధించిన మరో ఫొటోను ఫొటోషాప్‌లో కట్ అండ్ పేస్ట్ ద్వారా అతికించింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి అంతకుముందు పోస్ట్ చేసిన అసలు ఫొటోను తొలగించింది. ఇంతలోనే ఈ విషయాన్ని గమనించిన సోషల్ మీడియా పీఐబీ చేసిన తప్పును ఉతికి ఆరేసింది. అలా చేసినందుకు తీవ్రంగా విచారిస్తున్నట్టు పీఐబీ వివరణ కూడా ఇచ్చింది. అయినా సరే, సోషల్ మీడియా కూడా మీడియానే కదా! -
ఫేస్బుక్లో అసభ్య ఫొటో.. విద్యార్థిని ఆత్మహత్య
ఫేస్బుక్ పేజీలో తన ఫొటోను మార్ఫింగ్ చేసి, అసభ్య ఫొటోను అప్లోడ్ చేయడంతో అవమానభారం తట్టుకోలేని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ విద్యార్థిని తనకు ఆన్లైన్లో పరిచయం అయిన ఫైజల్ ఇమ్రాన్ ఖాన్ అనే స్నేహితుడు తన ఫొటోను మార్ఫింగ్ చేసి, అసభ్య ఫొటోను ఫేస్‌బుక్‌లోకి అప్లోడ్ చేయడం చూసింది. ఆ ఫొటోతో పాటు.. అతడు ఆమె ఫోన్ నెంబర్లను కూడా ఇచ్చాడు. దాంతో మొత్తం జరిగిన సంఘటన అంతటినీ వివరిస్తూ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఖాన్‌తో పాటు అతడి స్నేహితులు దీపక్, సతీష్ అనే ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.