South TV Actress Praveena Morphed Photos With Daughter Leaked In Online - Sakshi
Sakshi News home page

Actress Praveena: ఆ కీచకుడు నాతో పాటు నా కూతురిని కూడా టార్గెట్‌ చేశాడు: నటి ఆవేదన

Published Wed, Jan 4 2023 2:10 PM | Last Updated on Wed, Jan 4 2023 3:15 PM

South Tv Actress Praveena Morphed Photos With Daughter Leaked - Sakshi

ప్రముఖ నటి ప్రవీణా పోలీసులను ఆశ్రయించింది. గతంలో తనని వేధించిన ఓ కీచకుడు ఇప్పుడు తన కూతురిని టార్గెట్‌ చేశాడని ఆమె పోలీసులతో వాపోయింది. వివరాలు.. ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్‌ ఫేం ప్రవీణాను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్‌ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడు. గతంలో ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌లో షేర్‌ చేశాడు. విషయం తెలిసి ప్రవీణా కొన్ని నెలల క్రితం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చదవండి: తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?

దీంతో పోలీసుల అతడిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక కొన్ని నెలలు గడిచిన అనంతరం మళ్లీ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఈసారి ప్రవీణాతో ఆమె కూతురు గైరీ నాయర్‌ను కూడా టార్గెట్‌ చేశాడు. తన కూతురి ఫొటోలను కూడా మార్ఫింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

చదవండి: మహేశ్‌-త్రివిక్రమ్‌ సినిమాలో అల్లు అర్హ స్పెషల్‌ రోల్‌?

గతంలో తన ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతురిని కూడా టార్గెట్‌ చేశాడని, మార్ఫింగ్‌ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన స్నేహితులను, బంధువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. తన చూట్టూ ఉన్న మహిళలను కూడా వదలడం లేదని, వారి ఫొటోలను కూడా మార్ఫింగ్‌ చేసి విడుదల చేస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు మీద 100 ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి.. తనవి, తన కూతురు, తన బంధువుల మార్ఫింగ్‌ ఫొటోలను అందరికి షేర్‌ చేస్తున్నాడని ప్రవీణా ఫిర్యాదు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement