PRAVEENA
-
విద్యాప్రవీణ
మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్‌ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ. రాజస్థాన్‌లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది. చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు. స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్స్ట్రక్షన్ వర్కర్‌తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు. ‘సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్‌గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది. ‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు. సర్పంచ్‌గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ. బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్‌ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు. ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది. ‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్‌కు చెప్పి స్కూల్‌కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ. -
ఆ కీచకుడు నాతో పాటు నా కూతురిని కూడా టార్గెట్ చేశాడు: నటి ఆవేదన
ప్రముఖ నటి ప్రవీణా పోలీసులను ఆశ్రయించింది. గతంలో తనని వేధించిన ఓ కీచకుడు ఇప్పుడు తన కూతురిని టార్గెట్ చేశాడని ఆమె పోలీసులతో వాపోయింది. వివరాలు.. ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్ ఫేం ప్రవీణాను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడు. గతంలో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఆన్లైన్లో షేర్ చేశాడు. విషయం తెలిసి ప్రవీణా కొన్ని నెలల క్రితం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? దీంతో పోలీసుల అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక కొన్ని నెలలు గడిచిన అనంతరం మళ్లీ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఈసారి ప్రవీణాతో ఆమె కూతురు గైరీ నాయర్‌ను కూడా టార్గెట్ చేశాడు. తన కూతురి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్హ స్పెషల్ రోల్? గతంలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతురిని కూడా టార్గెట్ చేశాడని, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన స్నేహితులను, బంధువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. తన చూట్టూ ఉన్న మహిళలను కూడా వదలడం లేదని, వారి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి విడుదల చేస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు మీద 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. తనవి, తన కూతురు, తన బంధువుల మార్ఫింగ్ ఫొటోలను అందరికి షేర్ చేస్తున్నాడని ప్రవీణా ఫిర్యాదు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) -
సారీ.. నిన్ను ఓడిపోయేలా చేశాను
గతేడాది రిలీజైన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఆడియన్స్‌కు ఎంతగా నచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన ఉత్తమ చిత్రమంటూ పొగడ్తల వర్షాలు కురిపించారు. రానా సమర్పించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మహా వెంకటేశ్ డైరెక్ట్ చేయగా, తెలుగు మూలాలున్న అమెరికన్ డాక్టర్ పరుచూరి ప్రవీణ నిర్మించారు. ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లిస్ట్‌లో ‘కేరాఫ్ కంచరపాలెం’ సెలెక్ట్ కాలేదు. కారణం నిర్మాత అమెరికన్ కావడమే. ఈ విషయాన్ని ట్వీటర్లో పేరొన్నారు ప్రవీణా పరుచూరి. ‘‘సారీ వెంకటేశ్ మహా. కేవలం నా వల్ల నీ కష్టాన్ని, శ్రమని నేషనల్ అవార్డ్ వాళ్లు అనర్హంగా భావించారు. నా వల్లే నువ్వోడిపోయావ్. నేనే నిన్ను ఓడిపోయేలా చేశాను’’ అని తన బాధను వ్యక్తపరిచారు. దీనికి దర్శకుడు వెంకటేశ్ మహా సమాధానమిస్తూ – ‘‘అది మీ తప్పు కాదు. ఇంకా ఆ పాత రూల్స్‌తోనే నడుస్తున్న మన దేశానిది. ఒక ఇండియన్ డైరెక్టర్, ఇండియన్ యాక్టర్స్‌తో ఇండియా వాళ్ల కోసం తీసిన సినిమా ఇండియన్ నేషనల్ అవార్డ్స్‌కు అర్హత సాధించకపోవడమేంటో నాకు అర్థం కావడం లేదు. మార్పుకు సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు. -
‘డేర్’ ఆఫ్ కంచరపాలెం
సినిమా చేయడానికి కథ కావాలి. కథకులు కావాలి.. యాక్టర్లు కావాలి. దర్శకుడు కావాలి.. క్యాష్ కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు కావాల్సింది ‘డేర్’. అంటే.. ధైర్యం. ఎత్తులు పొత్తులు కాదు. డేర్ అన్న ఎత్తుగడ కావాలి. టాలీవుడ్లో ‘కంచరపాలెం’ చిన్న ఊరు. కానీ ఇవాళ అది చాలా పెద్ద పేరు. కంగ్రాట్స్.. ఒక్కసారిగా అందరూ మీ గురించి మాట్లాడుకునేలా చేశారు.. విజయ ప్రవీణ, వెంకటేశ్ మహా: థ్యాంక్స్. హానెస్ట్‌గా చేసిన ప్రయత్నం సక్సెస్ అయినందుకు మేం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంత హిట్ ఇచ్చాక క్రేజీ ఆఫర్స్ వస్తాయి. మీరు న్యూయార్క్‌లో ఫిల్మ్ కోర్స్ చేస్తానంటున్నారు? వెంకటేశ్ మహా: నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా తెలుసుకోవడం ఇంట్రెస్ట్. మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ఉంటాయి. వీఎఫ్ఎక్స్ మీద ఆరు నెలలు క్రాష్ కోర్స్ చేయాలని వెళ్తున్నాను. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఫీల్డ్. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. సో.. మనల్ని మనం అప్డేటెడ్గా ఉంచుకోవాలి. జనరల్‌గా ఆర్థిక కష్టాలుంటే వచ్చిన సినిమాలు ఒప్పేసుకునేవారేమో. న్యూయార్క్ వెళ్లాలనుకుంటున్నారంటే మీరు సౌండ్ పార్టీయేనా? వెంకటేశ్: (నవ్వేస్తూ) అస్సలు కాదండీ. అసలా సౌండ్ కూడా వినిపించనంత దూరం. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను 17 ఏళ్లకే ఇండిపెండెంట్‌గా ఉందాం అని బయటకి వచ్చేశాను. డిగ్రీ డ్రాప్ అవుట్. చిన్నప్పటి నుంచి జీవితంలో స్ట్రగుల్ ఉండబట్టే ఇంత మంచి సినిమా వచ్చిందని నమ్ముతాను. సినిమా అనేది మీ లైఫ్‌లోకి ఎప్పుడొచ్చింది? వెంకటేశ్: నా చిన్నప్పుడంతా సినిమా మధ్యలోనే పెరిగాను. ఇంట్లో మారాం చేస్తుంటే మా అమ్మ డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమని చెప్పేది. అలా నాలుగో తరగతి నుంచి ఒంటరిగా సినిమాలకు వెళ్లడం నేర్చుకున్నాను. నేను పెరిగే కొద్దీ సినిమాల మీద ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి వేరే దాంట్లో అవకాశం లేక సినిమాల్లోకి వచ్చారా? వెంకటేశ్: అలా ఏమీ కాదండీ. ఒకవేళ నేను సినిమాల్లో రాకపోయుంటే ఓ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్‌గా ఉండేవాడ్ని, లేదా బీపీఓ కంపెనీలో డీసెంట్‌గా సంపాదిస్తూ ఉండేవాడ్ని. ఏదో ఓ పని మాత్రం చేసేవాడ్ని. సినిమా అంటే ప్యాషన్ . అందుకే వచ్చాను. సినిమా ప్రయత్నాలు.. ఆ ఎక్స్పీరియన్స్? వెంకటేశ్: నిజానికి యాక్టర్ అవుదాం అని హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించా. ‘గడ్డం పెంచు తమ్ముడూ.. అవకాశం ఇచ్చేస్తాం’ అనేవారు. అలా గడ్డం పెంచుతూనే ఉండేవాడ్ని. ఈలోపు ఆ సినిమాలు రిలీజ్ అయ్యేవి. అవకాశాలు చాలా అరుదుగా వచ్చేవి. ఈలోపు ‘నాన్న’ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చేసినది యు ట్యూబ్‌లో వ్యూస్ కోసం కాదు... నన్ను నేను ‘సెల్ఫ్ చెక్’ చేసుకోవడానికే. మంచి పేరు వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసిన యు ట్యూబ్ చానల్ వాళ్లు నన్ను ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉండమన్నారు. అసలు ప్రొడక్షన్ డిజైన్ అంటే ఏంటీ? అని గూగుల్‌లో తెలుసుకున్నాను. ఓ ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత ‘రంగం’ అనే డ్యాన్స్ స షోకి కో డైరెక్టర్‌గా చేశాను. నా లైఫ్‌లో నాకు వచ్చిన ప్రతీ చాన్స్‌ని కాదనుకుండా అంది పుచ్చుకున్నాను. వెంకట్‌లానే మీకూ ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదా? విజయ ప్రవీణ: ఇండస్ట్రీలో నాకు పరిచయాలు ఏమీ లేవు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. కానీ స్క్రీన్ మీద కనిపించాలనో, ఆఫ్ స్క్రీన్ ఏదైనా చేయాలనో.. ఇలా ఏదీ అనుకోలేదు. ఇండస్ట్రీలో ఉండాలి.. పెద్ద పొజిషన్లో ఉండాలి అనుకున్నాను. కానీ ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు. మెడిసిన్ చదివాను. కార్డియాలజిస్ట్‌గా చేస్తున్నాను. నాకు ఒకరు అవకాశం ఇచ్చే బదులు ఇండస్ట్రీలో నాకు అవకాశం నేనే ఇచ్చుకోవాలనుకున్నాను. సినిమా నిర్మించాలనుకున్నాను. నా సంపాదనతో సినిమా తీస్తే నాకు నచ్చింది తీసుకోవచ్చు అని అనుకున్నాను. అలానే తీశాను. ‘కంచరపాలెం’లాంటి సినిమాలు బ్యాకింగ్ ఉంటేనే వెలుగులోకి వస్తాయి. సురేశ్‌బాబుగారు ఆ స్టెప్ తీసుకోవడానికి మీరు కారణం.. దాని గురించి? వెంకట్ సిద్దారెడ్డి: ఈ సినిమాను గతేడాది డిసెంబర్ 26న చూశాను. ఫస్ట్ 15 నిమిషాలు చూడగానే ఈ సినిమాలో ఏదో ఉందని డిసైడ్ అయ్యాను. వెంటనే సురేశ్‌బాబుగారికి ఫోన్ చేశాను. ‘ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్వెల్లో మీరు అనౌన్స్ చేయాలి సార్’ అన్నాను. ఆయన ఏదో పనిలో ఉండి క్లైమాక్స్‌లో వచ్చి ‘ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్ ప్రజెంట్ చేస్తుంది’ అని చెప్పారు. రానా తన భుజాల మీద వేసుకొని ప్రివ్యూ షోలు వేశారు. ఫస్ట్ సినిమాను ఎడిట్ చేద్దాం.. కొన్నిచోట్ల స్లోగా ఉందనుకున్నాం. కానీ మన రోజువారి జీవితాల్లో ఇలానే కదా ఉండేది. అన్నీ చకచకా జరిగిపోవు కదా. ఇది సినిమా కాదు జీవితం. వెంకటేశ్ మహా చక్కగా క్యాప్చర్ చేశాడు. ఈ సినిమా క్రెడిట్ అంతా వెంకటేశ్‌కే. ఇంతకు ముందు తమిళం, మలయాళ భాషల్లో ఇలాంటి సినిమాలు వచ్చేవి అని మాట్లాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు మనం కూడా వాటికి పోటీగా.. కాదు.. కాదు వాటి కంటే మంచి సినిమా తీశాం అని కాలర్ ఎగరేసుకొని తిరగొచ్చు. (‘కేరాఫ్ కంచరపాలెం’ పోస్టర్) విజయగారూ.. ఆపరేషన్ థియేటర్ నుంచి సినిమా థియేటర్‌కి రావడం ఎలా ఉంది? విజయ: అక్కడంతా (ఆపరేషన్ థియేటర్) నిశబ్దంగా ఉంటుంది. ఇక్కడేమో ఈలలు, గోల, చప్పట్లు. కొత్త ఎక్స్పీరియన్స్. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఓ మంచి అనుభూతి కలిగింది. నేను కావాలనుకున్న అనుభూతి ఇది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కార్డియాలజిస్ట్‌గా గుండె జబ్బులు నయం చేసేవారు. ఇప్పుడేమో సినిమా ద్వారా హృదయాలను ఆహ్లాదంగా మార్చారు. మొత్తానికి ఎక్కడున్నా ఆరోగ్యాన్ని వదలరు. విజయ: (నవ్వుతూ). వినడానికి చాలా బాగుంది. అయితే ఇక్కడ అడ్జెస్ట్ అవ్వడానికి టైమ్ పట్టేలా ఉంది. 2 ఏళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఇంత కష్టపడ్డాక వచ్చిన సక్సెస్ రుచి చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా. (నవ్వుతూ) మల్టీప్లెక్స్‌లు సందర్శించాం. అక్కడ అంతా హౌస్‌ఫుల్ (చెమర్చిన కళ్లతో). నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది. వెంకటేశ్: (మధ్యలో అందుకుంటూ) హలో మా ఇండియన్స్ కి ఎమోషన్స్ ఉన్నాయి. ఏదైనా డీప్‌గా అర్థం చేసుకుంటాం. మీరు అమెరికాలో పెరిగిన ఇండియన్ కదా.. మా అంతగా మీకు ఎమోషన్స్ ఉండవేమో (నవ్వులు). ‘ఇలాంటి సినిమా కావాలి’ అని ఓ ప్రొడ్యూసర్‌గా మీక్కావల్సింది కోరుకున్నారా? విజయ: ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడు 3000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. నీ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్‌కి ఎప్పుడూ నో చెప్పను. వేరే ఎవరి కోసమో కాదు. ఇది నా కోసం నేను తీసుకుంటున్న సినిమా. ముందు నాకు నచ్చాలన్నాను. నేను వెంకటేశ్ నుంచి ఎదురు చూసింది రెగ్యులర్ సినిమా కాదు. ‘హానెస్ట్ సినిమా’. వెంకటేశ్: ఈవిడ మాత్రం తన కోసం సినిమా చేయ మంది. నేను మాత్రం జనాల కోసమే తీశానండి. వెంకటేశ్‌కి, మీకు పరిచయం ఎలా ఏర్పడింది? విజయ: సినిమా తీయాలనుకున్నప్పుడు ఇండియాలో అపర్ణా మల్లాది అనే ఫ్రెండ్ ద్వారా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఏం ఫార్మాలిటీలు ఉంటాయి? అనే విషయం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఆమె ద్వారానే మహాని కలిశాను. మేం ముగ్గురం ఆ రోజంతా.. దాదాపు 8 గంటలు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ముగ్గురు అనే కన్నా ఇద్దరు అంటే కరెక్ట్. ఎందుకంటే నేను వెంకట్‌ని అసలు పట్టించుకోలేదు. సరిగ్గా ఆ రోజు నా ఫోన్ పోయింది. ఎక్కడెక్కడికి వెళ్లామో ఫోన్ వెతుక్కుంటూ మళ్లీ ఆ ఏరియాలకి వెళ్లాం. దొరకలేదు. సరే.. సాయంత్రం స్టార్‌బక్స్‌లో కూర్చున్నాం. అప్పటి వరకు మహాతో మూడు ముక్కలు కూడా మాట్లాడలేదు. అప్పుడు మహాతో అపర్ణ ‘నీ స్టోరీ ఐడియా వీడియో విజయకి ఎందుకు చూపించకూడదు’ అన్నారు. మహా వీడియో చూపించాడు. నాకు విపరీతంగా నచ్చేసింది. ఆ షాట్ చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వెంటనే నేను తనని అడిగిన క్వశ్చన్‘స్క్రిప్ట్ రెడీయా?’ అని. రెడీ అన్నాడు. రెండో ప్రశ్న బడ్జెట్ ఎంత? అని అడిగితే.. ఇంత అని చెప్పాడు. వెంటనే సినిమా చేసేద్దాం అన్నాను. వెంకటేశ్: విజయ అలా చెప్పిన మరుసటి రోజు మార్నింగే కంచరపాలెం బస్ ఎక్కాను. ముందు నిర్మాతగా మాత్రమే చేయాలనుకున్నారు. తర్వాత ఈ సినిమాలో ‘సలీమా’ క్యారెక్టర్ కూడా చేశారు. ఆ నిర్ణయం ఎవరిది? విజయ: సినిమా తీసే ప్రాసెస్‌లో ఓసారి ఆడిషన్స్ చాలా కష్టం అని అంటే నేను ఆడిషన్ ఇస్తాను అని చెప్పాను. నన్ను యాక్ట్ చేయమన్నారు. కొన్ని సీన్స్ ఇచ్చారు.. చేశాను. ఆ తర్వాత పాటలు పాడమన్నారు. ‘ఇప్పటికింకా నా వయసు’ పాటకు డ్యాన్స్ చేయమన్నారు. చేశా. బట్.. అదంతా సరదాగా చేసినదే. సినిమాలో క్యారెక్టర్ చేస్తానని అప్పుడు అనుకోలేదు. వెంకటేశ్: ముందు సలీమా పాత్రకు వేరే అమ్మాయిని అనుకున్నాం. తన కాలు విరిగిపోయింది. అప్పుడు ప్రవీణ ఇచ్చిన ఆడిషన్స్ గురించి మా అసిస్టెంట్ డైరెక్టర్ గుర్తు చేశాడు. మళ్లీ ఆ వీడియో చూశాను. సలీమా క్యారెక్టర్‌కి విజయ సరిపోతుందనిపించింది. విజయ: మహా ఫోన్ చేసి, క్యారెక్టర్ చేయమని అడిగితే అర్థం కాలేదు. ‘నాకైతే చేయడానికి ఇష్టమే. నీకు నమ్మకం ఉందా’ అంటే, ఉందన్నాడు. చేసేశాను. వెంకటేశ్: స్కైప్ కాల్స్‌లో ఓ నెల రోజులు వర్క్‌షాప్ చేయాలనుకున్నాం. ప్రవీణ ఆ యాసను 15 రోజుల్లోనే పట్టేసింది. మరి యాక్టింగ్‌లో కంటిన్యూ అవుతారా? విజయ: అవ్వాలి. ఒకవేళ మహా మళ్లీ సినిమా తీస్తా అంటే తప్పకుండా. తను చాలా గ్రేట్ డైరెక్టర్. యాక్టింగ్ ఈజ్ పర్సనల్ అని ఫీల్ అవుతాను. మనం.. మనం అనే విషయం మరచిపోయి వేరే వాళ్లలా ట్రాన్ ఫార్మ్ అవ్వగలగాలి. సినిమాలైతే కచ్చితంగా నిర్మిస్తా. ఎందుకంటే అది చేయకపోతే చచ్చిపోతా కాబట్టి. సినిమా పరంగా ప్రస్తుతానికి బాగున్నా. అమెరికాలో నా ఆఫీస్‌లో మాత్రం హ్యాపీగా లేరు (నవ్వుతూ). ప్రాజెక్ట్ కోసం అటూ ఇటూ తిరుగుతున్నాను కదా. అమెరికాలో ఫ్రెండ్స్‌కి ఈ సినిమా చూపించారా? విజయ: చూపించాను. సబ్ టైటిల్స్‌తో చూస్తూ ఏదైనా ఫీల్ మిస్ అవుతారేమో అనుకున్నాను కానీ బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ నవ్వాలో అక్కడే నవ్వారు. ఎక్కడ ఏడవాలో అక్కడే కనెక్ట్ అయ్యారు. వాళ్లందరికీ రాజు అనే క్యారెక్టర్ తెగ నచ్చాడు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే రాజు కలలోకి వచ్చాడట. ఎంత గొప్ప క్యారెక్టర్ అని అభినందించింది. దర్శకుడికి సోషల్ రెస్పాన్సిబులిటీ ఉండాలా? వెంకటేశ్: దర్శకుడికి అని కాదు. ఆర్టిస్ట్‌కి. అది చిత్రకారుడికి కావచ్చు. రచయితకు, నటుడికి ఎవ్వరికైనా ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్ట్‌ల పని వాళ్ల కాలంలో జరిగిన సంఘటనలు, మన కల్చర్ భవిష్యత్ తరాల వారికి అందజేయడం. మన పూర్వీకులు రాయబట్టే మనం చరిత్ర చదువుకుంటున్నాం. మన సినిమాల గురించి మాట్లాడుకుంటే అప్పట్లో ‘ఆకలి రాజ్యం’ సినిమా తీసుకుందాం. అందులోని నిరుద్యోగ సమస్య అయినా, కమ్యూనిజం భావాలైనా చూస్తే రక్తం ఉడుకుతుంది. ఇప్పుడు తీసే సినిమాలు నెక్ట్స్ జనరేషన్‌కి ఎంతో కొంత నేర్పించాలని నమ్ముతాను. విజయ: మాస్ సినిమా, కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా అని కాదు. గుడ్ సినిమా. ‘గుడ్ ఫిల్మ్ ఈజ్ ఏ గుడ్ ఫిల్మ్’. జానర్ ఏదైనా సరే. నేను ఐటమ్ సాంగ్స్ ఎంజాయ్ చేస్తాను. మన సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్స్‌కి ఏ పనీ ఉండదు. అలా ఫ్రేమ్ నిండుగా ఉండటం కోసం ఉంటారు. అది మారాలి. ప్రతి క్యారెక్టరైజేషన్ కీ సినిమాలో పని ఉండాలి. ఈ సినిమా మంచి రిజల్ట్ ఇవ్వకపోయుంటే? వెంకటేశ్: సినిమా స్టార్ట్ చేసినప్పుడే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం అని మాకు తెలుసు. ‘నేనింతే’ సినిమా క్లైమాక్స్‌లో రవితేజ ఓ మాట చెబుతాడు. ‘సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తాం. హిట్ అయినా ఇంకోటి చేస్తాం. హిట్ అయిపోయింది అని మూట కట్టుకొని వెళ్ళిపోం కదా’. రిజల్ట్‌తో సంబంధం లేకుండా మా కథలు చెబుతూనే ఉంటాం. విజయ: ఏమో.. నా కేస్‌లో వేరేలా ఉండేదేమో. ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడే కొన్ని హద్దులు పెట్టుకొని వచ్చాను. డాక్టర్ని కదా. చిన్న ఆల్గోరిథమ్ గీసుకొని వచ్చాను. సినిమా నాకు నచ్చినట్టు రావాలనుకున్నాను. అలా కాకుండా వేరేలా జరిగి ఉంటే ఆల్రెడీ నా జాబ్, దాని టెన్షన్స్ ఉండనే ఉన్నాయి. మళ్లీ తలనొప్పి అవసరమా? అనుకునేదాన్నేమో. కానీ ఒకసారి సినిమా సెట్ ఎక్స్పీరియన్స్ చేశాక ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తూనే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఫిల్మ్ మేకింగ్ అనేది మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది. విజయగారు అంత నమ్మారని ప్రెషర్ ఏమైనా? వెంకటేశ్: తను ఈ సినిమా ఓకే అనేప్పుడు రిటర్న్ ఏం ఆశించలేదు. వండర్ఫుల్ సినిమా కావాలనుకుంది. మంచి సినిమా తీయాలంటే మనం సక్రమంగా పని చేస్తే ఆటోమేటిక్‌గా సినిమా రిలీజ్ తర్వాత దాని పని అది సక్రమంగా చేసుకుంటుంది. (నవ్వుతూ) విజయ: సినిమా నిర్మాణం అంటేనే గ్యాంబ్లింగ్. ఎక్కడ వస్తుందో.. ఎక్కడ పోతుందో తెలియదు. అందుకే నేను ఎవరి డబ్బుతోనూ రిస్క్ చేయదలచుకోలేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో సినిమా తీయాలనుకున్నాను. ఫస్ట్ అటెమ్ట్‌లో పోయినా ఓకే అనుకునే వచ్చాను. ఓ భారతీయురాలిగా అమెరికాలో మీ ఎక్స్పీరియన్స్? విజయ: మా ఏరియాలో, మా స్కూల్లో అన్ని చోట్లా నేనొక్కదాన్నే ఇండియన్ రూట్స్ ఉన్న అమ్మాయిని. మా అమ్మ రెండు జడలు వేసి పంపించేది. స్కూల్లో ఏడిపించేవారు. జడలు లాగేవాళ్లు. ఎగతాళి చేసేవాళ్లు. నేను చాలా సీరియస్‌గా గొడవలు పడిన సందర్భాలున్నాయి. భారతీయులంటే చిన్న చూపు. అమెరికన్స్ కు ఇండియన్ సినిమాలంటే ఎలాంటి అభిప్రాయం ఉంది? విజయ: అమెరికన్స్‌కు ఇండియన్ సినిమాలంటే హిందీ సినిమాలే. ఆ పాటలు, ఆ డ్రీమ్ సీక్వెన్స్ చూసి వెటకారం చేస్తారు. ఇండియన్ యాక్టర్స్ పాపులర్ అవుతున్నారు. కానీ మన తెలుగు సినిమాకు ఆ స్థాయి గుర్తింపు రావడం లేదని ఎప్పుడూ ఓ చిన్న బాధ అయితే ఉండేది. నాకు ఇష్టం అయినదాన్ని హేళన చేయడం తట్టుకోలేకపోయా. అయితే కొన్ని సంవత్సరాలు మన తెలుగు సినిమాలు ఫ్లాట్ అయ్యాయని ఒప్పుకుంటాను. అప్పుడు కోపం వచ్చింది. కొన్నేళ్లు తెలుగు సినిమాలు చూడటం మానేశాను. నా జాబ్‌తో సగం టైమ్ సరిపోయేది. అంత బిజీలో రెండు గంటలు కేటాయించాలంటే న్యాయం అనిపించేది కాదు. అప్పట్లో కచ్చితంగా ఓ రేప్ సీన్ ఉండాలని ఫిక్స్ అయ్యేవారు. అవసరం లేకపోయినా అవి వచ్చేవి. వయలెన్స్ విపరీతంగా ఉండేది. సినిమాల్లో అంత వయలెన్స్ చూసి మన నార్మల్ లైఫ్‌లో కూడా అది కామన్ అనుకుంటున్నాం. వెంకటేశ్: ఈ విషయంలో నేను నీతో ఏకీభవించడం లేదు. హింస అనేది కొత్తగా మనం పుట్టించలేదు. సొసైటీలో ఉన్నదాన్ని తీసుకున్నాం. కానీ మనం చేసిన పొరపాటేంటే దాన్ని హైలైట్ చేయడం. మనం ఏదైనా ఎక్కువే చేస్తాం. ఈ జర్నీలో మీరు పర్సనల్‌గా ఫీల్ అయిన బెస్ట్ మూమెంట్స్ విజయ: నాకు ఈ జర్నీలో రెండు పీక్ మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి మహా నాకీ ఐడియాని చూపించినప్పుడు. ఆ తర్వాత డిసెంబర్ 26. సురేశ్‌బాబుగారు ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు. కెరీర్ గోల్స్ ఏంటీ? వెంకటేశ్: గర్వం, పొగరు అని అనుకోండి కానీ నా వరకూ నేను అనుకునేది ఏంటంటే తెలుగు సినిమా అనగానే మనకు కొంతమంది గుర్తొస్తారు కదా. ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి, ఎన్టీఆర్, నాగేశ్వరరావు.. ఇలా నా పేరు కూడా ఆ వంద మందిలో ఉండాలని ఆకాంక్ష. ఈ రోజుల్లో ఐడెంటిఫికేషన్ రావడం చాలా కష్టం. ప్రతి వారం ఓ పది సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం తెచ్చుకోవడం కష్టం. నా వల్ల ఇండస్ట్రీ మారిపోవాలనడంలేదు. కొత్త జనరేషన్, న్యూ వేవ్ సినిమాలు కూడా ఇంకా రావాలనుకుంటున్నాను. ఫైనల్లీ నెక్ట్స్ ప్లాన్? విజయ: సినిమాలు కంటిన్యూ చేస్తాను. నిర్మించడమే కాదు.. మంచి క్యారెక్టర్ అనిపిస్తే నటిస్తాను కూడా. వెంకటేశ్ ఓ మంచి ఐడియా చెప్పాడు. దాని మీద వర్కవుట్ చేయాలనుకుంటున్నాను. వెంకటేశ్: ఆరు నెలలు కోర్స్ చేసే ప్లాన్ ఉంది. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇంకా ఏమీ సైన్ చేయలేదు. ‘కంచరపాలెం’ వైపు లైఫ్ టర్న్ అయింది. నెక్ట్స్ టర్న్ గురించి మళ్లీ చెబుతాను. – డి.జి.భవాని -
‘జల్లికట్టు’ యువత కొత్త పార్టీ
సాక్షి, చెన్నై: జల్లికట్టు ఉద్యమానికి నేతృత్వంవహించిన యువతలోని పలువరి ఆధ్వర్యంలో‘ నాదేశం...నాహక్కు’ పేరుతో తమిళనాడులో శనివారం కొత్త పార్టీ ఆవిర్భవించింది. రుంబాక్కంలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ పార్టీని ప్రకటించారు. ఇందులో కన్వీనర్లుగా ఎబినేజర్, సత్య, ప్రవీణ, సుకన్య, కార్తీ, స్వతంత్ర దేవి, ప్రకాష్, ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఈ పార్టీ జెండాను జాతీయ పతాకం తరహాలో రూపొందించారు. మధ్యలో సంకెళ్లు తెంచుకున్న యువకుడి చిత్రాన్ని పొందుపరిచారు. -
లీడ్ ఇండియా జిల్లా టాపర్‌గా ప్రవీణ
రాజోలు : లీడ్ ఇండియా ప్రతిభా పరీక్షల్లో బి.సావరం శోభన పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని జిల్లెళ్ల మెర్సీ ప్రవీణ జిల్లా టాపర్‌గా నిలిచిందని కరస్పాండెంట్ ఆంటోని గురువారం తెలిపారు. ఈ మేరకు లీడ్ ఇండియా సంస్థ ప్రవీణకు బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేసిందన్నారు. ప్రతిభా పరీక్షల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజోలు, సోంపల్లి, బి.సావరం సర్పంచ్‌లు మట్టా కృష్ణకుమారి, పొలమూరి శ్యాంబాబు, కుంపట్ల మంజులతాదేవితోపాటు ఉపాధ్యాయులు ప్రవీణను అభినందించారు. -
రైతులకు మరిన్ని సేవలందించాలి
జిల్లా సహకారశాఖ అధికారి ప్రవీణ పెనుగుదురు(కరప) : ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా రైతులకు మరిన్ని సేవలందించాలని జిల్లా సహకారశాఖ అధికారి (డీసీఓ) టి.ప్రవీణ సూచించారు. మండలంలోని పెనుగుదురు సొసైటీ కార్యాలయం వద్ద జ్వోతి ప్రజ్వలన చేసి 63వ సహకార వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడంతో పాటు, వారిని చైతన్య పరచి అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించాలన్నారు. కార్యాలయాల్లో స్ట్రాంగ్‌రూంలు ఏర్పాటు చేసి బంగారు ఆభరణాలపై రైతులకు రుణాలు అందజేయాలని సూచించారు. సహకార సంఘాలు లాభాలు సాధించేలా పాలకవర్గాలు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు, మండల వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు చీకాల అప్పలరాజు ఏడురంగుల సహకార జెండా ఆవిష్కరించారు. జిల్లా సహకార ఎడ్యుకేషనల్ ఆఫీసర్, వారోత్సవాల ప్రత్యేకాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు సూచనలిచ్చారు. విద్యార్థులకు ఇంగ్లిష్ నిఘంటువులను డీసీఓ ప్రవీణ అందజేశారు. సీఈఓ తిబిరిశెట్టి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు చీపురపల్లి జయేంద్రబాబు, డైరెక్టర్లు కలవల రాజు, టి.గోవిందు తదితరులు పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి కృషి బోట్‌క్లబ్ : రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని డీసీసీబీ చైర్మ¯ŒS వరపుల రాజా తెలిపారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సోమవారం సహకార వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సంవత్సరం రైతులకు దీర్ఘకాలిక రుణాలు రూ.102 కోట్లు ఇచ్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు చెప్పారు. స్వల్ప కాలిక రుణాలు రూ.720 కోట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సిబ్బంది పాల్గొన్నారు. -
మిస్ కూవాగం ‘ప్రవీణ’
సాక్షి, చెన్నై : మిస్ కూవాగం-2015గా మదురైకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ ప్రవీణ ఎంపికయ్యారు. కూత్తాండవర్ ఆలయం సన్నిధిలో తాళి బొట్లను ధరించి ఆనందోత్సాహంలో ిహజ్రాలు మునిగారు. రాత్రంతా జాగారంతో ఐరావంతుడి సేవలో తరించారు. విల్లుపురం జిల్లా కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం మంగళవారం జరిగింది. కూత్తాండవర్(ఐరావంతుడు)ను ఆరాధించే హిజ్రాలు ఈ వేడుక నిమిత్తం వేలాదిగా కూవాగంకు తరలి వచ్చారు. హిజ్రాల పెళ్లి సందడి వేళకు సిద్ధం అయ్యారు. ముందు గా విల్లుపురం జిల్లా హిజ్రాల సంఘం నేత రాధా నేతృత్వంలో మిస్ కూవాగం పోటీలు జరిగాయి. ఇందులో తన అద్భుతమైన నటన తో ఆహూతుల్ని కట్టి పడేసిన తూత్తుకుడి శ్రీ వైకుంఠంకు చెందిన హిజ్రా రీమా ఉత్తమ నృత్య కారిణిగా, ఉత్తమ హిజ్రాగా ఎంపికయ్యారు. ర్యాంప్‌పై వయ్యారాలను ఒలక బోస్తూ, అందగత్తెలకు తామేమి తీసి పోమన్నట్టుగా తమప్రతిభను చాటుకున్న చెన్నైకు చెందిన నమిత, కేరళకు చెందిన ప్రీతి, చెన్నైకు చెందిన రహస్య మొదటి మూడు స్థానాల్ని కైవశం చేసుకున్నారు. ఇక, తమ కోసం పార్లమెంట్లో గలం విప్పిన ఎంపీ తిరు చ్చి శివను ఈసందర్భంగా హిజ్రాల సంఘం ఘనంగా సత్కరించుకుంది. సినీ నృత్యదర్శకురాలు కళ, నటుడు విమల్, నటీమణులు షకీలా, అనురాధా, బాలాంబిక ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ వేడుకలకు హాజరు అయ్యారు. చివరగా మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్లు పరమేశ్వరన్, సుదర్శనం న్యాయ నిర్ణేతలుగా జరిగిన మిస్ కూవాగంలో కిరీటాన్ని మదురైకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ ప్రవీణ తన్నుకు వెళ్లారు. రెండో స్థానంలో తూత్తుకుడికి చెందిన సుజి, మూడో స్థానాన్ని మదురైకు చెందిన హరిణి కైవశం చేసుకున్నారు. మిస్ కూవాగం-2015గా ఎంపికైన ప్రవీణకు నటి షకీల కిరీ టాన్ని అలంకరింప చేశారు. ఈసందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ, హెఐవీ బాధిత హిజ్రాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. చీకటిలో ఉన్న హిజ్రాలు వెలుగులోకి వచ్చి బయటి ప్రపంచాన్ని చూడాలని పిలుపునిచ్చారు. చదువును మధ్యలో ఆపేసిన హిజ్రాల విద్యాభ్యాసం కొనసాగింపు, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెళ్లి సందడి మిస్ కూవాగం పోటీల అనంతరం హిజ్రాల పెళ్లి సందడికి సిద్ధం అయ్యారు. మధ్యాహ్నం పెళ్లి కూతుర్ల వలే ముస్తాబయ్యారు. ఆనందం గా, సరదాగా తమ వాళ్లతో కలసి షాపింగ్‌లో మునిగారు. ఎవరికి వారు తమకు తోచినట్టుగా తాళి బొట్లను కొనుగోలు చేసి సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం లో కూత్తాండవర్ విశ్వరూప ప్రదర్శన వేడుకలో పాల్గొని తమ ఆరాధ్యుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి అక్కడి పూజారుల చేత తాళి కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగారు. రాత్రంతా ఆలయ పరిసరాల్లో జాగారం చేస్తూ, ఆట పాటలతో ఆనందం తాండవం చేసిన హిజ్రా లు బుధవారం వితంతువులు మారనున్నారు. -
జోగిపేట పీఠం మాదే
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట పీఠంపై ఆశావహులంతా కన్నేశారు. ఈ సారి చైర్పర్సన్ అయ్యే ఛాన్స్ బీసీ మహిళకు దక్కడంతో పోటీ తీవ్రమైంది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించి చైర్పర్సన్ గిరీ కొట్టేదామని ప్లాన్‌లో ఉన్న కాంగ్రెస్‌లో ఈ పోటీ మరీ తీవ్రంగా ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు చైర్పర్సన్ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. కాకపోతే చైర్పర్సన్ పోస్టు ఆశిస్తూ నామినేషన్ వేసిన అందరికీ బీ-ఫారం ఇచ్చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులంతా పీఠం తమదంటే తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగు స్తంభాలాట కాంగ్రెస్ తరఫున చైర్పర్సన్గిరీని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్. సురేందర్‌గౌడ్ ఉన్నారు. అందువల్లే ఆయన తన భార్య కవితను 18వ వార్డు నుంచి బరిలో నిలిపారు. ఇక ఇదేఆశతో మాజీ ఎంపీపీ హెచ్ రమాగౌడ్ కూడా తన భార్య ప్రవీణను 16 వార్డు నుంచి పోటీలో ఉంచారు. వీరిద్దరిలాగే జోగిపేట పీఠంపై కన్నేసిన డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నారాయణగౌడ్ కూడా తన భార్య శోభారాణిని 10వ వార్డులో ఉంచి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇదేకోవలోనే మాజీ సర్పంచ్ డాకూరి జోగినాథ్ కూడా తన భార్య స్వర్ణలతో 1వ వార్డు నుంచి పోటీ చేయించారు. మరోవైపు ఇంతవరకూ చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్, ఆశావహులందరికీ టికెట్లను ఖరారు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అభ్యర్థులు మాత్రం ఎవరికి వారు తమ వార్డుల్లో తనను గెలిపిస్తే చైర్మన్ అవుతామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం నెలకొంది. ఇంతకీ చైర్పర్సన్ ఎవరవుతారంటూ వాకబు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం మెజార్టీ స్థానాలు కొల్లగొట్టి పీఠం కైవసం చేసుకోవడం, లేదా విజేతలను దారికితెచ్చుకుని అవసరమైతే చైర్పర్సన్గిరీ అయినా ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న నలుగురిలో ముగ్గురు గౌడ సామాజిక వర్గం కాగా, మరొకరు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారు.