బాబా రాందేవ్(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలతో కొందరు అకతాయిలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తిని నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని దాద్రికి చెందిన రహిషుద్దీన్‌గా గుర్తించారు.
రహిషుద్దీన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్‌లో బాబా రాందేవ్ ఫొటోను షేర్ చేశారు. అయితే దీనిపై ఆ గ్రూప్‌లోని కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రహిషుద్దీన్ బాబా రాందేవ్ ప్రతిష్టను దిగజార్చేలా.. ఫొటో మార్ఫింగ్‌కు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ స్పందిస్తూ.. మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్‌ను అవమానపరచడానికి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా నిందితుడు మాత్రం స్నేహితుడు పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment