defame
-
అమెరికాలో గాంధీ విగ్రహానికి అవమానం
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు విఫల యత్నం చేశారు. భారత్‌లో వ్యవసాయ చట్టాల రద్దుకి డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిక్కు అమెరికన్లు వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం ఎదుట శనివారం నిరసన ప్రదర్శనకు దిగారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, వర్జీనియా నుంచి వందలాది మంది సిక్కు యువత కార్లతో ర్యాలీ చేస్తూ వాషింగ్టన్ చేరుకున్నారు. గాంధీ విగ్రహం ఎదుట వారు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండగా ఖలిస్తాన్ వేర్పాటు వాదులు జెండాలు చేతపట్టుకొని వారి మధ్యలోకి దూసుకువచ్చారు. ప్రత్యేక ఖలిస్తాన్ నినాదాలు చేస్తూ జెండాలతో గాంధీ విగ్రహం ముఖాన్ని కప్పేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. చదవండి: నెజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్! అక్కడున్న సీక్రెట్ ఏజెంట్లలో ఒకరు విగ్రహాలను ధ్వంసం చేయడం చట్ట ప్రకారం నేరమని అక్కడ్నుంచి వెళ్లిపోమంటూ సలహా ఇవ్వడంతో వారు పారిపోయారు. ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఈ దుశ్చర్యని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలంటూ అమెరికా విదేశాంగ శాఖని కోరింది. దుండగులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విగ్రహాల ధ్వంసం, కట్టడాలపై దాడులు, స్మృతి చిహ్నాలను అవమానించినా పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక చట్టం తీసుకువచ్చారు. ఈ చట్ట ప్రకారం దుండగుల్ని శిక్షించాలంటూ భారత రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో మహాత్ముని విగ్రహాన్ని అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న అటల్ బిహారి వాజ్‌పేయి ఆవిష్కరించారు. -
ఫొటో షేర్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలతో కొందరు అకతాయిలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తిని నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని దాద్రికి చెందిన రహిషుద్దీన్గా గుర్తించారు. రహిషుద్దీన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్‌లో బాబా రాందేవ్ ఫొటోను షేర్ చేశారు. అయితే దీనిపై ఆ గ్రూప్‌లోని కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రహిషుద్దీన్ బాబా రాందేవ్ ప్రతిష్టను దిగజార్చేలా.. ఫొటో మార్ఫింగ్‌కు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ స్పందిస్తూ.. మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్‌ను అవమానపరచడానికి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా నిందితుడు మాత్రం స్నేహితుడు పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని చెబుతున్నాడు. -
'మా రాష్ట్రానికి ఇంకెంతకాలం ఈ అపవాదు?'
పాట్నా: తమ రాష్ట్రంపై ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని బిహార్ ఉప ముఖ్యమంత్రి లాలూ తనయుడు తేజస్వి యాదవ్ అన్నారు. చక్కగా ఉన్న తమ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని పైకి తెస్తూ బిహార్‌కు అపఖ్యాతిని మూటగట్టే ప్రయత్నాన్ని బీజేపీ, దాని మిత్రపక్షాలు చేస్తున్నాయని అలాంటి పనులు వెంటనే నిలిపేయాలని అన్నారు. 'బిహార్‌కు వ్యతిరేక రాజకీయాలు ఆపండి. రాష్ట్ర అభివృద్ధికోసం మా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది. శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య లేదు. బిహార్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేం చాలా స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాం' అని తేజస్వి అన్నారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించేందుకు తాము సంసిద్దులై ఉన్నామని, సమన్యాయ పాలనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.