
'మా రాష్ట్రానికి ఇంకెంతకాలం ఈ అపవాదు?'
పాట్నా: తమ రాష్ట్రంపై ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని బిహార్ ఉప ముఖ్యమంత్రి లాలూ తనయుడు తేజస్వి యాదవ్ అన్నారు. చక్కగా ఉన్న తమ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని పైకి తెస్తూ బిహార్కు అపఖ్యాతిని మూటగట్టే ప్రయత్నాన్ని బీజేపీ, దాని మిత్రపక్షాలు చేస్తున్నాయని అలాంటి పనులు వెంటనే నిలిపేయాలని అన్నారు.
'బిహార్కు వ్యతిరేక రాజకీయాలు ఆపండి. రాష్ట్ర అభివృద్ధికోసం మా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది. శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య లేదు. బిహార్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేం చాలా స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాం' అని తేజస్వి అన్నారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించేందుకు తాము సంసిద్దులై ఉన్నామని, సమన్యాయ పాలనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.