మార్ఫింగ్‌ ఫోటో.. పోలీసులకు వర్మ ఫిర్యాదు | RGV Complaint Against Jayakumar Over Morph Photo | Sakshi
Sakshi News home page

Published Mon, May 21 2018 4:25 PM | Last Updated on Mon, May 21 2018 4:28 PM

RGV Complaint Against Jayakumar Over Morph Photo  - Sakshi

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోను మార్ఫింగ్‌ చేశాడంటూ రచయిత జయ కుమార్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. నగ్నంగా ఉన్న మహిళ ఫోటోకు తన తలను అంటించి.. ఆ ఫోటోను జయ కుమార్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నాడంటూ వర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. 

అయితే నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ఆఫీసర్‌ తన స్క్రిప్ట్‌ అంటూ జయకుమార్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తనకు న్యాయం చేయాలంటూ హీరో నాగార్జునను కోరుతూ జయకుమార్‌ ఓ ట్వీట్‌ కూడా చేశాడు. కొన్నాళ్ల క్రితం వర్మ, పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవాతో జీఎస్టీ అనే అడల్ట్‌ చిత్రం తెరకెక్కించగా.. అది కూడా తన కథేనంటూ జయకుమార్‌ ఆరోపించాడు. జయకుమార్‌ సర్కార్‌-3 చిత్రానికి రచనా సహకారం అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement