![Man Morphing Lady Photos Posted In Social Media Arrested Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/8/Hyderabad.jpg.webp?itok=tRxJlZjD)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తన బావతో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె పరువు తీయాలని భావించాడో యువకుడు. సామాజిక మాధ్యమాల నుంచి ఆమె ఫొటో, ఫోన్ నంబర్ సంపాదించాడు. ఫొటో ఎడిటింగ్ యాప్స్‌లలో బాధి తురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి ఫిమేల్ ఎస్కార్ట్‌గా చిత్రీకరించి, అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టి ఫోన్ నంబర్‌తో సహా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు ఫోన్ కాల్స్, సందేశాలు రావటం మొదలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన బాధితురాలు రాచకొండ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఎస్.హరినాథ్ సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన విద్యార్థి మేకల శేషు వెంకట కృష్ణ (20)ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం కోర్ట్ ముందు హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment