బంజారాహిల్స్: అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ దర్శకుడు, నిర్మాత షేక్ నాగుల్ షరీఫ్ పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు సాగర్ సొసైటీలో కార్యాలయం తెరిచి నటీనటుల కోసం ఆడిషన్స్ సైతం మొదలు పెట్టారు. అంతే కాకుండా సినీ ప్రొడక్షన్లకు సంబంధించి ఇన్‌స్టా పేజ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఈ పేజీ అడ్మిన్ బాధ్యతలను తన వద్ద పనిచేస్తున్న టి సృజన్‌కు అప్పగించాడు. కానీ సృజన్ ఇన్‌స్టా ద్వారా కొంత మందిని రకరకాలుగా వేధించడం మొదలు పెట్టాడు.
(చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)
విషయం తెలిసిన నాగుల్ అతన్ని విధుల్లో నుంచి తొలగించాడు. ఈ నెల 6న సృజన్ కార్యాలయానికి వచ్చి నాగుల్‌ను కలిసి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి నాగుల్ ఒప్పుకోలేదు. దీంతో సృజన్ సినీ ప్రొడక్షన్‌కు చెందిన ఇన్‌స్టా పేజీలో సినిమాకు సంబంధించిన విషయాలు తొలగించి అశ్లీల వీడియోలు, ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ చిత్రాలను కొంత మంది మహిళలకు పంపించాడు. విషయం తెలుసుకున్న షేక్ నాగుల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment