సోషల్‌ మీడియాలో టిక్‌టాక్‌గా..! | Youth Fallowing Social Media App Tic Toc | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ యాప్‌తో యువత హల్‌చల్‌

Published Sat, Dec 29 2018 9:19 AM | Last Updated on Mon, Mar 11 2019 11:12 AM

Youth Fallowing Social Media App Tic Toc - Sakshi

వర్షిణి , మహబూబ్‌ షేక్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘నాకు నచ్చింది, వచ్చింది చేస్తాను. నాలోని ప్రతిభను ప్రదర్శిస్తాను. కొత్తగా ఆలోచిస్తాను’ ఇదీ నేటి యువత తీరు. ఇవే ఆలోచనలతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్, ప్రోత్సాహం లేకున్నా సోషల్‌ మీడియా వేదికగా నటనలో దుమ్ము దులిపేస్తున్నారు కొందరు. తమ నటన, డ్యాన్సులతో లక్షల్లో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటున్నారు. అందరూ ఒకప్పుడు డబ్‌స్మాష్‌లు చేయగా.. ఇప్పుడు సోషల్‌ మీడియా మొత్తం టిక్‌టాక్‌తో మారుమోగుతోంది. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌లోని మ్యూజిక్‌ క్లిప్స్‌కు తమ నటనను జోడిస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఒకే ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారుతున్నవారు కొందరైతే.. ఏకంగా షార్ట్‌ఫిల్మ్, సినీ, సీరియల్‌ అవకాశాలను దక్కించుకుంటున్నారు ఇంకొందరు. తమ నటనా ప్రావీణ్యంతో తెలుగు టిక్‌టాక్‌లో అత్యధిక ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న కొందరి పరిచయమిదీ...  

వర్షిణి    
మాది హైదరాబాద్‌నే. ఇక్కడే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాను. సినిమాల్లోని చిన్న చిన్న డైలాగ్స్‌ చెబుతూ వాటిని అనుకరించేదాన్ని. ఇంట్లో, ఫ్రెండ్స్‌ చాలా బాగుందని చెప్పేవారు. అలా జూన్‌లో టిక్‌టాక్‌లో తొలిసారి సినిమా కామోడీ వీడియోను అప్‌లోడ్‌ చేశాను. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తర్వాత ఎమోషనల్, డైలాగ్స్‌ వీడియోస్‌ చేశాను. టిక్‌టాక్‌ యూజర్స్‌ నా వీడియోస్‌కి ఫ్యాన్స్‌గా మారడం పెరిగింది. ఇప్పుడు టిక్‌టాక్‌లో 6లక్షల మంది ఫ్యాన్స్, 8లక్షల హార్ట్స్‌ను సంపాదించాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంట్లో అమ్మానాన్న, మామయ్యల సపోర్ట్‌ చాలా ఉంది. నన్ను బాగా ప్రోత్సహించారు. ఈ వీడియోస్‌తో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పెద్ద సినిమా ఆడిషన్‌ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది.  

మహబూబ్‌ షేక్‌  
బీటెక్‌ బాబునే కానీ డ్యాన్స్, నటన అంటే చాలా ఇష్టం. ఏడాది నుంచి ఇన్‌స్ట్రాగామ్, డబ్‌స్మాష్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాను. సరదాగా సాగిన ఈ ప్రయాణం సోషల్‌ మీడియాలో క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. టిక్‌టాక్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మ్యూజికల్లీ టిక్‌టాక్‌ ద్వారా సోషల్‌ మీడియా యూజర్లకు చాలా దగ్గరయ్యాను. టిక్‌టాక్‌లో 6లక్షల మంది ఫ్యాన్స్, 6లక్షల హార్ట్స్‌ ఉన్నాయి. ఇన్‌స్ట్రాగామ్‌లో 2లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 1.5లక్షల సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. సోషల్‌ మీడియా యూజర్స్‌ వల్లే ఇది సాధ్యమైంది. మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. ఇప్పటికే రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. షూటింగ్‌ దశలో ఉన్నాయి.  

స్నిగ్ధాగౌడ్‌  
నేనూ హైదరాబాదీనే. ఇక్కడే చదివాను. ఎంబీఏ బెంగళూర్‌లో చేశాను. హైదరాబాద్‌లో వాల్యూ ల్యాబ్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా చేస్తున్నాను. సరదాగా ఆరు నెలల క్రితం ఒక వీడియోను టిక్‌టాక్‌లో చేశాను. అరే.. బాగా చేశావని ఫ్రెండ్స్‌ చెబితే తర్వాత ‘చిన్న పిల్ల జీలకర్రతో కొట్టు బాబాయ్‌’ అనే వీడియో చేశాను. అది చాలా వైరల్‌ అయింది. దీంతో మరిన్ని చిన్న పిల్లలు, డైలాగ్స్, డ్యాన్స్‌ టిక్‌టాక్‌ వీడియోస్‌ చేశాను. టిక్‌టాక్‌ యూజర్స్‌ నేను చేసిన వీడియోలను కలుపుతూ వీడియోస్‌ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. కొందరు బయట కూడా గుర్తు పడుతున్నారు. ఇప్పటికి 4.2 లక్షల మంది ఫ్యాన్స్, 1.4 మిలియన్‌ హార్ట్స్‌ వచ్చాయి. టిక్‌టాక్‌ యూజర్స్‌కి చాలా థ్యాంక్స్‌. 

శ్రీనిధిరెడ్డి , దివ్యశ్రీ

మిశాల్‌ జైన్‌
మాది కాకినాడ దగ్గర రామచంద్రాపురం. బీబీఎం చేశాను. చిన్న వీడియోస్, షార్ట్‌ఫిల్మ్స్, డబ్‌స్మాష్‌లు చేసేవాణ్ణి. దీంతోపాటు జాబ్‌ చేశాను. కానీ సెట్‌ కాదని అనిపించింది. నటుడు కావాలనే ఉద్దేశంతో జాబ్‌ వదిలేశాను. టిక్‌టాక్‌ను ఏడాది నుంచి ఫాలో అవుతున్నాను. నచ్చిన వీడియోస్‌ను అప్‌లోడ్‌ చేశాను. నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికీ 60వేల మంది ఫ్యాన్స్, 6లక్షల హార్ట్స్‌ వచ్చాయి. సినిమాల్లో సైతం అవకాశాలు వచ్చాయి. లీడ్‌రోల్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఇందంతా సోషల్‌ మీడియా ద్వారానే సాధ్యమైంది.

శ్రీనిధిరెడ్డి  
మాది కరీంనగర్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటాం. మెహిదీపట్నం సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో బీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. చదువుతూనే ఇన్‌స్టా, డబ్‌స్మాష్‌ చూసేదాన్ని. మనమెందుకు ట్రై చేయకూడదని ఒకసారి టిక్‌టాక్‌లో వీడియోస్‌ చేశాను. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కామెడీ, డైలాగ్స్‌తో వీడియోస్‌ చేస్తున్నాను. ఇప్పటికీ టిక్‌టాక్‌లో లక్ష మంది ఫ్యాన్స్, 7లక్షల హార్ట్స్‌ వచ్చాయి. ఇన్‌స్టాలో 80వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. స్టార్స్‌ సినిమాల్లో సైతం అవకాశాలు వచ్చాయి. ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని ఉంది.

దివ్యశ్రీ
మాది హైదరాబాదే. బీటెక్‌ చేశాను. సినిమా తారలను అనుకరించేదాన్ని. సరదాగా టిక్‌టాక్‌ వీడియోస్‌తో పాటు ఇన్‌స్టాలో వీడియోస్‌ చేసేదాన్ని. అలా తమడ మీడియాలో అవకాశం వచ్చింది. తమడలో వెబ్‌సీరిస్‌లో నటిస్తున్నాను. టిక్‌టాక్‌లో వీడియోల వల్ల క్రేజ్‌ వచ్చింది. ఇప్పటికీ 90వేల మంది ఫ్యాన్స్, 5లక్షల లైక్స్‌ వచ్చాయి. ప్రతిభను నిరూపించుకునేందుకు టిక్‌టాక్‌ ఓ ప్లాట్‌ఫామ్‌. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement