dubsmash
-
రామ్‌చరణ్, రానాల డబ్స్మాష్: వైరల్
సాక్షి, హైదరాబాద్ : మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దగ్గుబాటి రానాల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కేవలం సినిమా సహచరులు మాత్రమే కాదు క్లాస్మేట్స్ కూడా. దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా రానా ప్రేమ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందిస్తూ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే లాక్డౌన్ సమయంలో తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్ తిరిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. (ఆమె యస్ చెప్పింది : రానా) ఈ క్రమంలో రానా, రామ్ చరణ్‌లకు సంబంధించిన డబ్స్మాష్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మగధీర చిత్రంలోని ‘ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ ఒకేసారి వందమందిని పంపు’అనే పవర్ ఫుల్ డైలాగ్‌కు వీరిద్దరూ డబ్‌ష్మాష్ చేశారు. 2015లో రానా తన ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేస్తూ ‘భైరవతో డబ్స్మాష్’ అంటూ కామెంట్ జత చేశాడు. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. విరాటపర్వం, అరణ్య సినిమాలో రానా ఫుల్ బిజీగా ఉన్నాడు. (అందుకు ఓ ఎగ్జాంపుల్ నా పెళ్లి: రానా) Dubsmashhhh with Bhiravvvvaaa!! pic.twitter.com/1P08z9COYn — Rana Daggubati (@RanaDaggubati) June 7, 2015 -
డీప్‌ఫేక్ వీడియోలతో పోర్న్ క్లిప్‌లు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడవారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వీడియో అమెరికాలో కలకలం రేపింది. తరువాత అది నకిలీదని తేలింది. ఓ హాలీవుడ్ హీరోయిన్ పోర్న్ క్లిప్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. అందులో ఉన్నది తాను కాదన్నా ఎవరూ నమ్మలేదు. కానీ, ఆమె చెప్పేది నిజమే. మనకు నచ్చిన సెలబ్రిటీల శరీరానికి సామాన్యుల ముఖాలను అంటించి మురిసిపోయే వీలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ‘డీప్‌ఫేక్’సాఫ్ట్వేర్ సృష్టిస్తోన్న మాయాజాలమిది.(ముసలి మొహం ప్రైవసీ మాయం!) ఈ యాప్ వచ్చిన కొత్తలో తమకు ఇష్టమైన హీరో, గాయకులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ.. పలు ఫొటోలు, వీడియోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియా వేదికలపై పంచుకునేవారు. వాటికి వచ్చే లైకులు చూసి సంబరపడిపోయే వారు. అక్కడి వరకే పరిమితమైతే సరిపోయేది. కానీ, కొందరు మరో అడుగు ముందుకేసి.. సంచలనం సృష్టించాలని, తమ టీవీ చానళ్లకు రేటింగులను పెంచాలనే దురుద్దేశంతో డీప్‌ఫేక్‌ను వాడుకుని సెలబ్రిటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. అవి నకిలీవని నిరూపించుకునేందుకు బాధితులు నానా తంటాలు పడుతున్నారు. పలు దేశాల్లో నిషేధం.. టిక్‌టాక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో డ్యాన్సులు, డబ్‌స్మాష్‌తో భారీ డైలాగులు చెబుతూ చాలామంది సంబరపడిపోతారు కదా! ఈ యాప్ కూడా దాదాపు అలాంటిదే. కాకపోతే.. అడ్వాన్స్డ్ వర్షన్. ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ, అనుసరించాలనుకున్న ముఖం కవళికలను ఈ సాఫ్ట్వేర్ ముందే పసిగడుతుంది. మీ బాడీకి ఏ సెలబ్రిటీ శరీరమైతే సరిగ్గా సరిపోతుందో సూచిస్తుంది. దాని ప్రకారం.. మీరు ఏదో వీడియోను చేసి, అందులో మీకు నచ్చిన సందేశం ఇచ్చేయాలి. తరువాత మీ ముఖంపై ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది. (టిక్‌టాక్‌లో మరో డేంజర్ చాలెంజ్) అలా.. మీకు నచ్చిన ప్రముఖుల ముఖంలో మీ ముఖం ఇమడ్చడం, లేదా మీ ముఖంలో ప్రముఖుల ముఖం అమర్చే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇది. ముఖ కవళికలను ఎవరూ గుర్తుపట్టనంత స్పష్టంగా, నాణ్యంగా ఫొటోలు, వీడియోలు సృష్టించడం దీని ప్రత్యేకత. ఇంకో విషయమేమిటంటే.. ఇందులో సెలబ్రిటీల గొంతుతోనే వీడియో వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోని ప్లేస్టోర్లలో ఈ సాఫ్ట్వేర్లను అందించే యాప్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో చాలా యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిషేధించాయి. ఉగ్రవాదులు, సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌ల సాయంతో మోసాలు, దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని, వీటిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. (సిమ్ కావాలంటే ముఖం స్కాన్ చేయాల్సిందే) -
డబ్స్మాష్ వల్ల ఏం జరిగింది?
పవన్‌కృష్ణ. సుప్రజ హీరో హీరోయిన్లుగా ‘జబర్ధస్త్’ ఫేమ్ గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డబ్స్మాష్’. సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మించారు. కేశవ్ దేపూర్ దర్శకుడు. నేడు ‘డబ్స్మాష్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నటి స్పందన మాట్లాడుతూ– ‘‘నేను చేసిన టిక్ టాక్ వీడియో చూసి ఈ చిత్రంలో చాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. సుబ్రమణ్యం మాట్లాడుతూ– ‘‘మా దర్శకునికి సినిమాపై ఉన్న తపన చూసి నమ్మకంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘బెస్ట్ టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చేశాను. దాదాపు 20 నిమిషాలపాటు వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉంటుంది. స్టూడెంట్స్ చేసే డబ్స్మాష్ వల్ల ఏం జరిగింది? అనేది మా సినిమా కథ’’ అన్నారు కేశవ్. గెటప్ శ్రీను, పవన్‌కృష్ణ సహనిర్మాత గజేంద్ర దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘డబ్‌శ్మాష్’ ట్రైలర్ విడుదల
పవన్ క్రిష్ణ, సుప్రజ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డబ్‌శ్మాష్’. గెటప్ శ్రీను ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కేశవ్ డేపుర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార లక్ష్మీ, గజేంద్ర తిరకాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, పాటలకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ ట్రైలర్ యూత్‌కు బాగా కనెక్ట్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం యువత డబ్శ్మాష్ల కోసం ఏదైనా చేయడం, వారి అలవాట్లు, వారు చేసే తుంటరి పనులకు చివర్లో ఎదుర్కొనే కష్టాలు వంటివి ట్రైలర్లో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక కొన్ని డైలాగ్‌లు యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. వంశిష్ సంగీతమందిస్తున్నాడు. -
టిక్ టాక్ వీడియో కేసులో ఇద్దరు అరెస్టు
చెన్నై ,తిరువొత్తియూరు: పోలీసుస్టేషన్ ముందు నిలబడి టిక్‌టాక్ వీడియో తీసి విడుదల చేసిన కళాశాల విద్యార్థులు సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా చేరమాన్దేవి సమీపంలోని కారుకురిచ్చి పుదుకుడి గ్రామానికి చెందిన యువకుడు సీతారామన్ (28). గత 3న ఆలంకులం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో బైకుపై వచ్చిన సీతారామన్‌ను పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న అతని బంధువులు, ప్రైవట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అతని స్నేహితులు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. వారు వేర్వేరుగా ప్రముఖ సినిమా పాటలకు తగినట్టు సెల్ఫోన్లో టిక్‌టాక్ వీడియో తీసి వాటిని వాట్సాప్‌లలో ఉంచారు. ఈ వీడియోలు సామాజిక మాద్యమంలో వైరల్‌గా మారియి. విషయం తెలుసుకున్న ఆలంకులం సీఐ అయ్యప్పన్ విచారణ ఆ వీడియో తీసిన ఇద్దరు కళాశాల విద్యార్థులపై కేసు నమోదు చేశారు. సీతారామన్ సహా ముగ్గురిని గురువారం అరెస్టు చేశారు. -
వైరల్ : టిక్‌టాక్‌లో కలెక్టర్
చెన్నై , టీ.నగర్: టిక్‌టాక్‌లో సేలం జిల్లా కలెక్టర్ ఫొటో చోటుచేసుకోవడం సోమవారం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్ యాప్‌లో నమోదు చేశారు. కలెక్టర్ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్బుక్, టిక్‌టాక్ మ్యూజిక్, ట్విట్టర్లలో పోస్టు చేశారు. వీటిని గమనించిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్‌టాక్ మ్యూజిక్‌ను నిషేధించే పనిలో సైబర్‌క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇదివరకే అనేక మంది రాజకీయ ప్రముఖులు టిక్‌టాక్ యాప్‌ను రద్దు చేయాలని కోరుతున్న స్థితిలో ప్రస్తుతం కలెక్టర్ ఫొటోను టిక్‌టాక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం సంచలనం కలిగించింది. -
సోషల్ మీడియాలో టిక్‌టాక్‌గా..!
సాక్షి, హైదరాబాద్: ‘నాకు నచ్చింది, వచ్చింది చేస్తాను. నాలోని ప్రతిభను ప్రదర్శిస్తాను. కొత్తగా ఆలోచిస్తాను’ ఇదీ నేటి యువత తీరు. ఇవే ఆలోచనలతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్, ప్రోత్సాహం లేకున్నా సోషల్ మీడియా వేదికగా నటనలో దుమ్ము దులిపేస్తున్నారు కొందరు. తమ నటన, డ్యాన్సులతో లక్షల్లో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటున్నారు. అందరూ ఒకప్పుడు డబ్‌స్మాష్‌లు చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం టిక్‌టాక్‌తో మారుమోగుతోంది. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌లోని మ్యూజిక్ క్లిప్స్‌కు తమ నటనను జోడిస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఒకే ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారుతున్నవారు కొందరైతే.. ఏకంగా షార్ట్‌ఫిల్మ్, సినీ, సీరియల్ అవకాశాలను దక్కించుకుంటున్నారు ఇంకొందరు. తమ నటనా ప్రావీణ్యంతో తెలుగు టిక్‌టాక్‌లో అత్యధిక ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న కొందరి పరిచయమిదీ... వర్షిణి మాది హైదరాబాద్‌నే. ఇక్కడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సినిమాల్లోని చిన్న చిన్న డైలాగ్స్ చెబుతూ వాటిని అనుకరించేదాన్ని. ఇంట్లో, ఫ్రెండ్స్ చాలా బాగుందని చెప్పేవారు. అలా జూన్‌లో టిక్‌టాక్‌లో తొలిసారి సినిమా కామోడీ వీడియోను అప్లోడ్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఎమోషనల్, డైలాగ్స్ వీడియోస్ చేశాను. టిక్‌టాక్ యూజర్స్ నా వీడియోస్‌కి ఫ్యాన్స్‌గా మారడం పెరిగింది. ఇప్పుడు టిక్‌టాక్‌లో 6లక్షల మంది ఫ్యాన్స్, 8లక్షల హార్ట్స్‌ను సంపాదించాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంట్లో అమ్మానాన్న, మామయ్యల సపోర్ట్ చాలా ఉంది. నన్ను బాగా ప్రోత్సహించారు. ఈ వీడియోస్‌తో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పెద్ద సినిమా ఆడిషన్ఫైనల్ స్టేజ్‌లో ఉంది. మహబూబ్ షేక్ బీటెక్ బాబునే కానీ డ్యాన్స్, నటన అంటే చాలా ఇష్టం. ఏడాది నుంచి ఇన్‌స్ట్రాగామ్, డబ్స్మాష్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాను. సరదాగా సాగిన ఈ ప్రయాణం సోషల్ మీడియాలో క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. టిక్‌టాక్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మ్యూజికల్లీ టిక్‌టాక్ ద్వారా సోషల్ మీడియా యూజర్లకు చాలా దగ్గరయ్యాను. టిక్‌టాక్‌లో 6లక్షల మంది ఫ్యాన్స్, 6లక్షల హార్ట్స్ ఉన్నాయి. ఇన్‌స్ట్రాగామ్‌లో 2లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 1.5లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సోషల్ మీడియా యూజర్స్ వల్లే ఇది సాధ్యమైంది. మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. ఇప్పటికే రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. షూటింగ్ దశలో ఉన్నాయి. స్నిగ్ధాగౌడ్ నేనూ హైదరాబాదీనే. ఇక్కడే చదివాను. ఎంబీఏ బెంగళూర్‌లో చేశాను. హైదరాబాద్‌లో వాల్యూ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా చేస్తున్నాను. సరదాగా ఆరు నెలల క్రితం ఒక వీడియోను టిక్‌టాక్‌లో చేశాను. అరే.. బాగా చేశావని ఫ్రెండ్స్ చెబితే తర్వాత ‘చిన్న పిల్ల జీలకర్రతో కొట్టు బాబాయ్’ అనే వీడియో చేశాను. అది చాలా వైరల్ అయింది. దీంతో మరిన్ని చిన్న పిల్లలు, డైలాగ్స్, డ్యాన్స్ టిక్‌టాక్ వీడియోస్ చేశాను. టిక్‌టాక్ యూజర్స్ నేను చేసిన వీడియోలను కలుపుతూ వీడియోస్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. కొందరు బయట కూడా గుర్తు పడుతున్నారు. ఇప్పటికి 4.2 లక్షల మంది ఫ్యాన్స్, 1.4 మిలియన్ హార్ట్స్ వచ్చాయి. టిక్‌టాక్ యూజర్స్‌కి చాలా థ్యాంక్స్. శ్రీనిధిరెడ్డి , దివ్యశ్రీ మిశాల్ జైన్ మాది కాకినాడ దగ్గర రామచంద్రాపురం. బీబీఎం చేశాను. చిన్న వీడియోస్, షార్ట్‌ఫిల్మ్స్, డబ్‌స్మాష్‌లు చేసేవాణ్ణి. దీంతోపాటు జాబ్ చేశాను. కానీ సెట్ కాదని అనిపించింది. నటుడు కావాలనే ఉద్దేశంతో జాబ్ వదిలేశాను. టిక్‌టాక్‌ను ఏడాది నుంచి ఫాలో అవుతున్నాను. నచ్చిన వీడియోస్‌ను అప్లోడ్ చేశాను. నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికీ 60వేల మంది ఫ్యాన్స్, 6లక్షల హార్ట్స్ వచ్చాయి. సినిమాల్లో సైతం అవకాశాలు వచ్చాయి. లీడ్రోల్లో ఓ సినిమా చేస్తున్నాను. ఇందంతా సోషల్ మీడియా ద్వారానే సాధ్యమైంది. శ్రీనిధిరెడ్డి మాది కరీంనగర్. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటాం. మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చదువుతూనే ఇన్‌స్టా, డబ్స్మాష్ చూసేదాన్ని. మనమెందుకు ట్రై చేయకూడదని ఒకసారి టిక్‌టాక్‌లో వీడియోస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ, డైలాగ్స్‌తో వీడియోస్ చేస్తున్నాను. ఇప్పటికీ టిక్‌టాక్‌లో లక్ష మంది ఫ్యాన్స్, 7లక్షల హార్ట్స్ వచ్చాయి. ఇన్‌స్టాలో 80వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్స్ సినిమాల్లో సైతం అవకాశాలు వచ్చాయి. ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని ఉంది. దివ్యశ్రీ మాది హైదరాబాదే. బీటెక్ చేశాను. సినిమా తారలను అనుకరించేదాన్ని. సరదాగా టిక్‌టాక్ వీడియోస్‌తో పాటు ఇన్‌స్టాలో వీడియోస్ చేసేదాన్ని. అలా తమడ మీడియాలో అవకాశం వచ్చింది. తమడలో వెబ్‌సీరిస్‌లో నటిస్తున్నాను. టిక్‌టాక్‌లో వీడియోల వల్ల క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ 90వేల మంది ఫ్యాన్స్, 5లక్షల లైక్స్ వచ్చాయి. ప్రతిభను నిరూపించుకునేందుకు టిక్‌టాక్ ఓ ప్లాట్‌ఫామ్. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. -
స్మార్ట్‌గా అదరగొడుతున్నారు..!
హిమాయత్‌నగర్ : నచ్చిన పాట పాడాలని, వచ్చిన డైలాగ్ చెప్పాలని ఎవరికైనా ఉంటుంది.. నలుగురు మన కళను మెచ్చుకుంటూ ఇంకా ఆనందంగా ఉంటుంది.. అయితే బెరుకు, భయం మనలను ఆ పనిచేయనివ్వవు.. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. టెక్నాలజీ పుణ్యమా అని అందరూ తమలోని గాయకుడిని, నటుడిని బయటకు తీస్తున్నారు. డబ్‌స్మాష్‌తో అదరగొడుతున్నారు. ఫేస్బుక్, వాట్సప్‌లలో వీడియోలతో హల్చల్ చేస్తున్నారు. ఇలా డబ్స్మాష్ చేసేందుకు యూత్ ఇటీవల టిక్..టాక్ యాప్‌ను ఎక్కువగా వాడుతున్నారు. దీనిలో కేవలం 30 సెకెండ్ల నిడివి గల పాటలు, డైలాగ్‌లు ఉంటాయి. మనకు నచ్చిన సినిమా, డైలాగ్ పేరును సెర్చ్‌లో కొడితే క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. దీంతో పాటు డబ్స్మాష్, లైక్ యాప్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. నచ్చిన డైలాగ్, పాటని ఫోన్లో అచ్చు సినిమాలో హీరో, హీరోయిన్ చెప్పినట్లు చెబుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలను మించిపోతున్నారు నేటి యువత తమ టాలెంట్‌ని పలు విధాలుగా నిరూపించుకుంటున్నారు. స్కూల్ పిల్లలు మొదలు పెద్ద వయస్సు ఉన్న వారు సైతం తమకు నచ్చిన డైలాగ్, సాంగ్‌ని వీడియోల రూపంలో చేస్తూ స్నేహితులను అలరిస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్స్ చెప్పిన డైలాగ్‌లకు అమ్మాయిలు, అబ్బాయిలు ఫిదా అవుతుంటారు. నచ్చిన హీరోయిన్ ఎలా చెప్పిందో..అదే రీతిలో డైలాగ్ ఎక్స్ప్రెషన్ను డబ్స్మాష్ల ద్వారా చూపి స్తూ సెలబ్రిటీల కంటే తామేమీ తక్కువ కాదం టూ నిరూపించుకుంటున్నారు అమ్మాయిలు. ఇదే మంచి చాన్స్ నేను.. చిన్న చిన్న షార్ట్ఫిల్మ్లలో నటిస్తున్నాను. మోడల్‌గా రాణించాలనుకుంటున్నాను. నన్ను నేను ఎప్పటికప్పుడు నటనలో అప్డేట్ చేసుకోవడానికి మ్యూజికల్లీ, వియూ, డబ్స్మాష్ మొదలైన యాప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. – నిషా, మోడల్ నాలో కొత్త యాంగిల్ చూస్తున్నాను ఇన్నాళ్లూ.. నేను కేవలం ఫ్రెండ్స్‌తో మాట్లాడితే చాలని అనుకునేదాన్ని. పాటలు వినడమే తప్ప.. వాటిని పాడాలి, డైలాగ్స్ చెప్పాలన్న ఆలోచన ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ వీటిని ట్రై చేసి నాకు వాట్సప్ చేసినప్పుడు నాకూ ఇంట్రెస్ట్ పెరిగింది. మ్యూజిక్‌ని ట్రై చెయ్యడం ప్రారంభించాను. ఇప్పుడు నాలో కొత్త యాంగిల్ చూస్తున్నాను. – రూత్ ప్రియాంక, సాఫ్ట్వేర్ ఉద్యోగి రోజూ డబ్స్మాష్ చెబుతా నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. సినిమాల్లో పాటలు వినేదాన్ని. ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ వల్ల పాటలు పాడటమే కాదు.. నచ్చిన డైలాగ్స్‌ను డబ్ స్మాష్లా చెబుతూ.. ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ వాటిని చూసి అభినందిస్తుంటే.. ఆనందం అంబరాన్ని తాకుతోంది. – కళ్యాణి, పీహెచ్డీ స్కాలర్ బోర్ కొడితే టిక్‌టాక్ ఉందిగా నాకు బోర్ కొడితే చాలు వెంటనే టిక్‌టాక్ యాప్‌ని ఓపెన్ చేస్తా. ఇష్టమైన డైలాగ్, సాంగ్ పాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా. అంతే లైకులే లైకులు. ఇప్పటి వరకు నేను కొన్ని వందల డబ్‌స్మాష్‌లు చెప్పాను. – ప్రియాంక, మిస్ తెలంగాణ మొదట్లో వచ్చేది కాదు మొదట్లో పాట, డైలాగ్ సరిగ్గా వచ్చేది కాదు. కాస్త బెరుకుగా ఉండేది. ఒక పది, పదిహేను వీడియోలు చేశాక అలవాటైపోయింది. ఇప్పుడు డబ్స్మాష్, మ్యూజికల్లీ యాప్స్ ద్వారా ఇంట్లోనే పాటలు, మాటలు డబ్బింగ్ చెబుతున్నట్లుగా రోజూ క్రియేట్ చేసుకుంటున్నా. – రినీగ్రేస్, సాఫ్ట్వేర్ ఉద్యోగి -
ప్రతి ఒక్కడికీ కత్రినాకైఫ్ కావాలి.. కానీ!
హైదరాబాద్ : ‘ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవ్వడూ రణ్‌బీర్‌లా ఉండడు’ అంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ పోస్ట్ చేశారు. అదేంటీ రకుల్‌ను ఎవరైనా హర్ట్ చేశారా అనుకుంటున్నారా. అదేం లేదండీ.. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘చి ల సౌ’ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి రకుల్ ఓ డైలాగ్‌ను డబ్స్మాష్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేసిన ఆ డబ్స్మాష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిలీజ్‌కు ముందే మూవీ చూడాలని ఉందా! హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ‘చి ల సౌ’ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ‘ఇక్కడ నా ఫెవరెట్ డైలాగ్ ఉంది. అమ్మాయిలు ఏమంటారు. మీరు విడుదలకు ముందే ఆ చిత్రాన్ని చూడాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డబ్స్మాష్ వీడియోలను FunWithChiLaSow హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి. మూవీ యూనిట్‌తో కలిసి సినిమా చూసే చాన్స్ రావచ్చు’ అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రకుల్ చేసిన పోస్టుకు భారీగా స్పందన వస్తోంది. అయితే కొందరు మాత్రం రకుల్ మీరు గతంలోలాగ చబ్బీగా లేరు.. డైటింగ్ తగ్గించి మళ్లీ బొద్దుగా తయారవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి ల సౌ’.. ఈ మూవీ ద్వారా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుశాంత్‌కు జోడీగా రుహాని శర్మ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై మూవీ యూనిట్ ధీమాగా ఉంది. Here’s a dubsmash of my current fav dialogue. Totally love it ! 😂❤️ what say girls ?? cant wait to watch #ChiLaSow...If you wanna watch the the film before release with the team.. send your dubsmashes with #FunWithChiLaSow and you could win a chance:) @AnnapurnaStdios @SiruniCineCorp @iamSushanthA @iRuhaniSharma @rahulr_23 @23_rahulr A post shared by Rakul Singh (@rakulpreet) on Jul 18, 2018 at 2:11am PDT -
విడాకులపై వెరైటీగా స్పందించిన అర్భాజ్ ఖాన్
ముంబై: బాలీవుడ్ జంట మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ జంట విడిపోనున్నారనే వార్తలపై నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ వెరైటీగా స్పందించాడు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను రూమర్లంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు.. కొంతమంది వాళ్ల పని వాళ్లు చూసుకోకుండా.. పని గట్టుకొని ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తారంటూ మండిపడ్డాడు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదంటూ చురకలంటించాడు. దీనికి సంబంధించి ఆర్భాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దబ్స్మాష్ వీడియోను ఒకదాన్ని పోస్ట్ చేశాడు. కుఛ్ తో లోగ్ కహేంగే...లోగోం కా కామ్ హై కహనా.. అనే పాపులర్ హిందీ పాటను దబ్స్మాష్ చేసి మరీ తన కోపాన్ని ప్రదర్శించాడు. కాగా బాలీవుడ్లో అన్యోన్యమైన జంట అర్భాన్, మలైకా విడిపోనున్నారని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేశాయి. 1998లో వివాహం చేసుకున్న వీళ్లిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాఫిక్. మలైకా ఇప్పటికే తన 14 ఏళ్ల కొడుకుతో వేరే అపార్ట్మెంట్లో విడిగా ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్న 'పవర్ కపుల్' లో కూడా కొన్ని రోజులుగా మలైకా కనిపించడం లేదనే కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.. Some people need to mind their business, stop talking and writing bullshit and concentrate on their own miserable lives 🙏🙏🙏 A video posted by Arbaaz Khan (@arbaazkhanofficial) on Feb 1, 2016 at 10:00pm PST -
డబ్‌స్మాష్‌తో స్మాష్ చేసిన మెగాస్టార్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మొట్ట మొదటి సారిగా డబ్స్మాష్ వీడియోతో సంచలనం సృష్టించారు. తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మ్యాజిక్ చేశారు. హీరో కోసం చేసిన డబ్స్మాష్ వీడియో.. నెటిజన్లను కట్టిపడేస్తోంది. అమితాబ్ చేస్తున్న 'ఆజ్ కీ రాత్ హై జిందగీ' టెలివిజన్ షో సెట్లో తన కోసం డబ్ స్మాష్ చేయాలని రణవీర్ అడగ్గానే ఓకే చెప్పేశారు బిగ్ బి. దీంతో రణవీర్ తెగ సంబరపడిపోతున్నాడు. వెంటనే బాజీరావు మస్తానీ సినిమా కోసం తామిద్దరం కలిసి చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లెజెండ్, బిగ్ బి నాకోసం డబ్స్మాష్ చేశారు... ఇపుడు ఇదే పెద్ద పురాణ గాధ.. అంటూ రణవీర్ ట్వీట్ చేశాడు. బాజీరావు మస్తానీ మూవీ డైలాగ్‌తో కూడిన ఈ వీడియో ఇపుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. బాజీరావు నే మస్తానీ సే ప్యార్ కీ హై అయ్యాషీ నహీ.. అంటూ సాగే ఈ 6 సెకన్ల వీడియో ఇపుడు వైరల్ అయింది. కాగా 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్యపు అధినేత బాజీరావు చరిత్ర ఆధారంగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలీ రూపొందిస్తున్న హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీ. ఓటమి ఎరుగని మరాఠా యోధుడు బాజీరావుగా రణవీర్ సింగ్, మస్తానీగా దీపిక, కాశీభాయ్గా ప్రియాంక నటించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ కూడా అంచనాలను మరింతగా పెంచేసింది. అదిరిపోయే యుద్ధ సన్నివేశాలతో భన్సాలీ వెండితరపై అద్భుతంగా మలుస్తున్న ఈ మూవీ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. Now this .. is Epic !!! :))) the Biggest 'B' of all @SrBachchan #BajiraoMastani pic.twitter.com/AUhO1OJslC — Ranveer Singh (@RanveerOfficial) November 25, 2015 -
సోషల్ మీడియాలో సునీత హల్చల్
-
పాక్ క్రికెటర్లతో సానియా డబ్ స్మాష్ స్టెప్పులు
-
పాక్ క్రికెటర్లతో సానియా మీర్జా డ్యాన్స్
హైదరాబాద్: రతభా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఎందుకో తెలుసా... పాక్ క్రికెట్ టీమ్ విజయం సాధించినందుకట. ఆదివారం శ్రీలంకలో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. దీంతో మ్యాచ్ చూసేందుకు వెళ్లిన సానియా మీర్జా సంతోషంతో ఎగిరి గంతేసింది. అంతేనా, భర్తతోపాటు పాక్ జట్టు సభ్యులతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోను షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో సానియా వేసిన డబ్ స్మాష్ స్టెప్పులు ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తున్నాయి. When bae comes to watch you play....Abhi Toh Party Shuru Hoi Hai With lots of love from @MirzaSania & I from Colombo pic.twitter.com/JreRtoxPDv — Shoaib Malik (@realshoaibmalik) July 20, 2015