
పవన్ క్రిష్ణ, సుప్రజ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డబ్‌శ్మాష్’. గెటప్ శ్రీను ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కేశవ్ డేపుర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార లక్ష్మీ, గజేంద్ర తిరకాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, పాటలకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది.
ఈ ట్రైలర్ యూత్‌కు బాగా కనెక్ట్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం యువత డబ్‌శ్మాష్‌ల కోసం ఏదైనా చేయడం, వారి అలవాట్లు, వారు చేసే తుంటరి పనులకు చివర్లో ఎదుర్కొనే కష్టాలు వంటివి ట్రైలర్‌లో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక కొన్ని డైలాగ్‌లు యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. వంశిష్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment