
పవన్ కృష్ణ, గెటప్ శ్రీను, కేశవ్
పవన్‌కృష్ణ. సుప్రజ హీరో హీరోయిన్లుగా ‘జబర్ధస్త్’ ఫేమ్ గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డబ్‌స్మాష్’. సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మించారు. కేశవ్ దేపూర్ దర్శకుడు. నేడు ‘డబ్‌స్మాష్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నటి స్పందన మాట్లాడుతూ– ‘‘నేను చేసిన టిక్ టాక్ వీడియో చూసి ఈ చిత్రంలో చాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు.
సుబ్రమణ్యం మాట్లాడుతూ– ‘‘మా దర్శకునికి సినిమాపై ఉన్న తపన చూసి నమ్మకంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘బెస్ట్ టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చేశాను. దాదాపు 20 నిమిషాలపాటు వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉంటుంది. స్టూడెంట్స్ చేసే డబ్‌స్మాష్ వల్ల ఏం జరిగింది? అనేది మా సినిమా కథ’’ అన్నారు కేశవ్. గెటప్ శ్రీను, పవన్‌కృష్ణ సహనిర్మాత గజేంద్ర దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment