చెన్నై , టీ.నగర్: టిక్‌టాక్‌లో సేలం జిల్లా కలెక్టర్ ఫొటో చోటుచేసుకోవడం సోమవారం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్ యాప్‌లో నమోదు చేశారు. కలెక్టర్ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ మ్యూజిక్, ట్విట్టర్‌లలో పోస్టు చేశారు.
వీటిని గమనించిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్‌టాక్ మ్యూజిక్‌ను నిషేధించే పనిలో సైబర్‌క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇదివరకే అనేక మంది రాజకీయ ప్రముఖులు టిక్‌టాక్ యాప్‌ను రద్దు చేయాలని కోరుతున్న స్థితిలో ప్రస్తుతం కలెక్టర్ ఫొటోను టిక్‌టాక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం సంచలనం కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment