డబ్‌స్మాష్‌తో స్మాష్ చేసిన మెగాస్టార్ | Amitabh Bachchan goes for a dubsmash with Ranveer Singh | Sakshi
Sakshi News home page

డబ్‌స్మాష్‌తో స్మాష్ చేసిన మెగాస్టార్

Published Thu, Nov 26 2015 6:59 PM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

డబ్‌స్మాష్‌తో స్మాష్ చేసిన మెగాస్టార్ - Sakshi

డబ్‌స్మాష్‌తో స్మాష్ చేసిన మెగాస్టార్

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  మొట్ట మొదటి సారిగా డబ్స్మాష్ వీడియోతో సంచలనం సృష్టించారు. తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మ్యాజిక్ చేశారు. హీరో కోసం చేసిన డబ్స్మాష్ వీడియో.. నెటిజన్లను  కట్టిపడేస్తోంది. అమితాబ్  చేస్తున్న 'ఆజ్ కీ రాత్ హై జిందగీ'  టెలివిజన్ షో సెట్‌లో తన కోసం డబ్ స్మాష్ చేయాలని రణవీర్ అడగ్గానే ఓకే చెప్పేశారు బిగ్ బి. దీంతో రణవీర్ తెగ సంబరపడిపోతున్నాడు. వెంటనే బాజీరావు మస్తానీ సినిమా కోసం తామిద్దరం కలిసి చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

బాలీవుడ్ లెజెండ్, బిగ్ బి నాకోసం డబ్స్మాష్ చేశారు... ఇపుడు ఇదే పెద్ద పురాణ గాధ.. అంటూ రణవీర్ ట్వీట్ చేశాడు. బాజీరావు  మస్తానీ మూవీ డైలాగ్‌తో కూడిన ఈ వీడియో ఇపుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. బాజీరావు నే మస్తానీ సే ప్యార్ కీ హై అయ్యాషీ నహీ.. అంటూ సాగే  ఈ 6 సెకన్ల వీడియో ఇపుడు వైరల్ అయింది.

కాగా 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్యపు అధినేత బాజీరావు చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలాభన్సాలీ  రూపొందిస్తున్న హిస్టారికల్‌ మూవీ బాజీరావు మస్తానీ.  ఓటమి ఎరుగని మరాఠా యోధుడు బాజీరావుగా రణవీర్‌ సింగ్‌, మస్తానీగా దీపిక, కాశీభాయ్‌గా ప్రియాంక నటించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా థియేట్రికల్‌ ట్రైలర్‌ కూడా అంచనాలను మరింతగా పెంచేసింది. అదిరిపోయే యుద్ధ సన్నివేశాలతో భన్సాలీ వెండితరపై అద్భుతంగా మలుస్తున్న ఈ మూవీ డిసెంబర్‌ 18న  ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement