'జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు' | I did not expect this award, says Sanjay Leela Bhansali | Sakshi
Sakshi News home page

'జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు'

Published Sun, Apr 3 2016 11:22 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు' - Sakshi

'జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు'

ముంబై: బాజీరావ్ మస్తానీతో హిట్ కొట్టడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సక్సెస్ తో తాను మరెన్నో ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. తన తర్వాతి ప్రాజెక్టు ఎలా ఉండబోతుందంటే ఎవరూ ఊహించలేనంత ట్విస్ట్ తో ఉంటుందన్నాడు. అయితే ప్రేమ కథలు చాలా బాగా తెరకెక్కించగలనని తనకు తెలుసునని భన్సాలీ అంటున్నాడు. గతంలో తాను తీసిన చిత్రాలకు చాలా కేటగిరీల్లో అవార్డులు వచ్చాయని... అందుకే బాజీరావ్ మస్తానీ మూవీకి అవార్డు వస్తుందని భావించానని, కానీ ఏకంగా తనకే అవార్డు వస్తుందని అసలు ఊహించలేదని భన్సాలీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండాలని భావించడం లేదని, అలా ఉన్నప్పుడే మన నుంచి బెస్ట్ పార్మార్మెన్స్, ప్రొడక్ట్ వస్తాయని చెప్పుకొచ్చాడు. తన నెక్స్ట్ మూవీ కోసం ఏ కథాంశం ఎంచుకోవాలి అనే విషయంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించాడు. రౌడీ రాథోడ్ లాంటి మూవీ చేస్తారా అన్న విలేఖరి ప్రశ్నపై స్పందిస్తూ.. అలాంటి ఆలోచనే తనకు లేదన్నాడు. బాద్షా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర హీరోలతో మూవీ ఏమైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. షారుక్ తో ప్రస్తుతం మూవీ చేయడం లేదని భవిష్యత్తులో ఆ విషయంపై కసరత్తు చేస్తానని భన్సాలీ తన అభిప్రాయాల్ని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement